వేరుసెనగ ధరలలో హెచ్చు-తగ్గులు

  

ప్రస్తుతం అనేక ప్రాంతాలలో కురుస్తున్న ఆకాల వర్షాలతో వేరుసెనగ రాబడులకు అవరోధం ఏర్పడింది. కొత్త సరుకు నిమ్ముతో ఉండే అవ కాశం ఉన్నందున ధరలు హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్లోని ఆదోని, కర్నూలు, అనంతపురం, మడకశిర, కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలలోని అన్ని మార్కెట్లో కలిసి వారంలో 70 లక్షల 80 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై నాణ్యమైన స్థానికంగా రూ. 6580-7350, కదిరి లేపాక్షి రూ. 5000-6000, 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 10,400, స్థానికంగా రూ. 10,100, 90-100 కౌంట్ రూ. 10,100, స్థానికంగా రూ. 9850, 60-70 కౌంట్ చెన్నై డెలివరి రూ. 10,800, స్థానికంగా రూ. 10,500, 50-60 కౌంట్ ముంబై కోసం రూ. 11,500, స్థానికంగా రూ. 11,100, 60-65 కౌంట్ చెన్నై డెలివరి రూ. 11,000, స్థానికంగా రూ. 17,000, కళ్యాణి చెన్నై డెలివరి రూ. 9600, స్థానికంగా రూ. 9300 ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూలు, అచ్చంపేట ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం కేవలం 15-20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ.7000-7410, హెచ్సీఎస్ గింజలు 90-100 కౌంట్ రూ. 10,100, 80-90 కౌంట్ రూ. 10,300, 60-70 కౌంట్ రూ. 10,600, 60-65 కౌంట్ రూ. 10,750, 50-60 కౌంట రూ.11,800, కళ్యాణి రూ. 8500 ధరతో వ్యాపారమైంది.

తమిళనాడులోని దిండిగల్, కురంజిపాడి, విరుధచలం, విల్లుపురం, కడలూరు, అవలూరు పేట, తిరుకోవిలూరు, వేదారణ్యం, తిరువన్నామలై, కల్లకుర్చిలలో వారంలో 15-16 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7950, మీడియం రూ.6000-6700 (ప్రతి 80 కిలోల బస్తా) మరియు తిరువన్నామలైలో ఎక్స్పర్టు రకం సరుకు హెచ్ఎపిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 11,150, తెలుపు 90-100 కౌంట్ రూ. 10,000, దిండిగల్, అరియలూరు, కరూరు, అలంగుడి, జైగుండం, సేలంలో 15-18 వేల బస్తాలు రూ. 7000-7650, అలంగుడిలో హెచ్ఐఎస్ గింజలు 50-60 కౌంట్ రూ. 11,100, 80-90 కౌంట్ రూ. 10,400, చెన్నైలో హెచ్పీఎస్ గింజలు పి-నట్ 80 కిలోల బస్తా రూ. 8600, జెఎల్ మిక్స్ రూ. 8700 ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని చిత్రదుర్గ్, హుబ్లీ, గద, చెల్లకేరి, బళ్లారి, రాయిచూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 35-40 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై కదిరి లేపాక్షి రూ. 5500-6000, నాణ్యమైన సరుకు రూ. 6600-7500, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ స్థానికంగా రూ. 10,300, 90-100 కౌంట్ రూ. 10,150, 70-80 కౌంట్ రూ. 10,600, 60-70 కౌంట్ రూ. 10,650, కళ్యాణి రూ. 9600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో రాబడులు తగ్గి 1000-1200 బస్తాల రాబడి కాగా, రూ. 6500-7500, బికనీర్ హెచ్ఎస్ గింజలు 40-50 కౌంట్ రూ. 11,500, 50-60 కౌంట్ రూ. 11,200, 60-70 కౌంట్ రూ. 11,000, 60-65 కౌంట్ రూ. 11,300 (జిఎస్టితో) మరియు

ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ మార్కెట్తో పాటు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో రూ. 6500-7200 ప్రతి క్వింటాలు ధరతోవ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్ లోని ఉత్పాదక కేంద్రాల వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూ లంగా ఉంటే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం వరకు కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి గత వారం 20-25 వేల బస్తాల రాబడిపై బెస్ట్ రూ. 7150-7300, మీడియం రూ. 7000-7150, యావరేజ్ రూ. 6900-7000 ముంద్రా ఓడరేవు డెలివరి హెచ్ఐఎస్ గింజలు 60-65 కౌంట్ బోర్డు సరుకు రూ. 10,700, 60-70 కౌంట్ రూ. 10,500, 50-60 కౌంట్ రూ. 10,900, 50-55 కౌంట్ రూ. 11,100, 40-50 కౌంట్ రూ. 11,300, 40-45 కౌంట్ రూ. 11,500, 38-42 కౌంట్ రూ. 11,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog