7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
గతవారం ప్రారంభంలో పెసల ధరలు తగ్గిన తరువాత మార్కెట్ స్థిరంగా మారి రాజస్తాన్లోని కేర్డీ, మెడతా, సుమేర్పూర్, కిషన్డ్, శ్రీగంగానగర్ ప్రాంతా లలో కలిసి 78 వేల బస్తాల రాబడిపై రూ.5500-6200, నాణ్యమైన లావు రకం రూ. 6500-6700, జైపూర్లో రూ. 6100-6900, పప్పు రూ. 7400-8400, మిటుకులు రూ. 6400-7400, మధ్య ప్రదేశ్లోని పిపరియా, హరదా, జబల్ పూర్ ప్రాంతాలలో దినసరి 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 4000-7200 క్వాలిటీ ప్రకారం మరియు ఇండోర్లో రూ.6800-7100 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు