గుజరాత్ లో కొత్త వేరుశనగ ప్రారంభం
ప్రస్తుత సీజన్లో 2, ఆగష్టు వరకు దేశంలో నూనెగింజల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1 కోటి 89 లక్షల 66 వేల హెక్టార్లతో పోలిస్తే 1 కోటి 88 లక్షల 51 వేల హెక్టార్లకు చేరింది. ఇందులో వేరుశనగ విస్తీర్ణం 48 లక్షల 64 వేల హెక్టార్ల నుండి తగ్గి 45 లక్షల 14 వేల హెక్టార్లకు చేరింది.
ప్రస్తుత సీజన్ లో 1, సెప్టెంబర్ వరకు తెలంగాణాలో విస్తీర్ణం 16,015 ఎక రాల నుండి తగ్గి 13,672 ఎకరాలకు చేరగా, గుజరాత్ లో 29, ఆగష్టు వరకు విస్తీర్ణం 19 లక్షల 9 వేల 641 హెక్టార్ల నుండి తగ్గి 17 లక్షల 8 వేల 163 హెక్టా ర్లకు చేరింది. గుజరాత్ లోని వేరుశనగ ఉత్పాదక కేంద్రాలలో కొత్త సరుకు రాబడిప్రారంభమయింది. రాజ్ కోట్ లో దినసరి 600-800 బస్తాల కొత్త సరుకు రాబ డిపె నెం.39 రకం రూ. 4400-5900, నెం.24 రకం రూ. 6025-6900 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది మరియు 1500-2000 బస్తాల పాత సరుకు రాబడిపై జి-20 రకం రూ.6600-6800, మీడియం రూ. 6400-6600, యావరేజ్ రూ. 6150-6400 ప్రతి క్వింటాలు మరియు వేరుశనగ గింజలు 50-60 కౌంట్ రూ. 10,400-10,500, 40-50 కౌంట్ రూ. 10,700-10,800, 60-70 కౌంట్ రూ. 10,200-10,300 ధరతో వ్యాపారమయింది. ఉత్తరప్రదేశ్ లో రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. కేవలం ఏటా, మెన్ పురి ప్రాంతాలలో దాదాపు 15-20 వేల బస్తాల యాసంగి వేరుసె నగ రాబడిపె ఎండు సరుకు స్థానికంగా రూ.6000-6400, ఝాన్సీలో 6-7 వేల బస్తాల రాబడిపె రూ.5000-5600 ధరతో వ్యాపారమయింది.
గుజరాత్లో కొత్త వేరుశనగ
పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా, మిదనాపూర్, ఖడగ్ పూర్ తదితర ప్రాంతా లలో రాబడులు కనీస స్థాయికి చేరాయి మరియు దినసరి కేవలం 5-6 వేల బస్తాల రాబడిపై రూ.5500-5600, నూనె కండిషన్ 60-70 కౌంట్ రూ.8600 ప్రతిక్వింటాలు ధరతో లోకల్ లూజు వ్యాపారమయింది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణదుర్గ,
రాయదుర్గ, మడకశిర, కదిరి ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 40-50 వేల బస్తాల రాబడిపె కదిరి లేపాక్షి రకం రూ.5500-6000, స్థానికంగా నాణ్యమైన సరుకు రూ. 7000-8000 ప్రతి క్వింటాలు మరియు 80-90 కౌంట్ స్థానికంగా చెన్నై డెలివరీ రూ.70-80 కౌంట్ స్థానికంగా రూ. 11,000-11,200, ముంబాయి డెలివరీ రూ. 11,500 ధరతో వ్యాపారమయింది. కర్నూలు, ఎమ్మిగనూరులలో వేరుశనగ నూనె రూ. 1460, పిండి రూ. 3700-3750, నరసారావుపేటలో రూ. 1320 మరియు నరసారావు పేటలో వేరుశనగ హెచ్ పిఎస్ గింజలు 70-80 కౌం రూ. 10000, 60-70 కౌంట్ రూ. 10,500, 50-60 కౌంట్ రూ. 11,000 మరియు తెలంగాణా
ప్రాంతపు వేరుశనగ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరీ రూ. 10500-10600 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. కర్నాటకలోని చిత్రదుర్గ, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, బళ్లారి, రాయిచూర్, యాదగిరి ప్రాంతాలలో దినసరి 20-25 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6500-7500, కదిరి లేపాక్షి రూ.5500-6000, చెల్లకేరిలో వేరుశనగ గింజలు 80-90 కౌంట్ స్థానికంగా రూ. 10,400-10,500, 70-80 కౌంట్ రూ. 10,700-10,800, 60-70 కౌంట్ రూ. 11,500-11,600 ధరతో వ్యాపారమయింది.
రాజస్తాన్ లోని బికనీర్ మార్కెట్లో వారంలో కేవలం 2-3 వేల బస్తాల రాబడిపై రూ. 6000-6500, హెచ్ పిఎస్ 40-50 కౌంట్ రూ. 10,600, 50-60 కౌంట్ రూ. 10,000, 60-70 కౌంట్ రూ. 9550, 60-65 కౌంట్ రూ. 9750 మరియు వేరుశనగ నూనె (10కిలోలు) బికనీర్ లో రూ. 1435, అహ్మదాబాద్ లో రూ.1600,
జామ్ నగర్, గోండల్, రాజ్ కోట్ లలో రూ. 1640-1650, చెన్నైలో రూ.1650, ముంబాయి రూ. 1670 ధరతో వ్యాపారమయింది. తమిళనాడు లోని దిండిగల్, కరూరు, అరియాలూరు, సేలం,
జయగొండం, దిండివనం, శివ గిరి, , తిరుకోవిలూరు, కొడుముడి ప్రాంతాలలో కలిసి దినసరి దాదాపు 8-10 వేల బస్తాల రాబడిపె రూ. 7000-7600, 80-90 కౌంట్ ( ప్రతి 80 కిలో లు) రూ. 8400, 70-80 కౌంట్ రూ.8500 మరియు అలంగుడిలో 500 బస్తాల రాబడిపై రూ. 7000-7400, 50-60 కౌంట్ రూ. 11,200, 80-90 కౌంట్ రూ. 10,600 ప్రతి క్వింటాలు మరియు చెన్నెలో హెచ్ పిఎస్ గింజలు ( 80కిలోలు( పీ నట్ రూ.8800, జెఎల్ రకం రూ. 8700 ధరతో వ్యాపారమయింది. నిమచ్ లో గతవారం 8-10 వేల బస్తాల రాబడిపె నాణ్యమైన సరుకు రూ. 5700-5900, మీడియం సరుకు రూ. 5400-5700, యావ రేజ్ రూ. 6150-6400 ధరతో వ్యాపారమయింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు