ఇనుమడిస్తున్న వేరుశనగ ధరలు

 


20-02-2022

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో వేరుసెనగ సంతృప్తికరంగా విస్తరించింది. రాబోయే గ్రీష్మకాలం పంట కోసం సేద్యం ప్రారంభమవుత్నునది, దీనితో నూనెమిల్లర్లు, కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ప్రతి వారం ధర రూ. 100-200 ఒడిదొడుకుల మధ్య కదలాడుతున్నది. ఎందుకనగా దేశంలోని ఉత్పాదక రాష్ట్రాలలో ప్రతి వారం 8-9 లక్షల బస్తాల సరుకు రాబడి అవుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కలిసి వారంలో సుమారు 3 లక్షల బస్తాల వేరుసెనగ రాబడి అవుతుండగా ధర ప్రతి క్వింటాలు రూ. 5000-6400, గుజరాత్లో వారంలో 15 లక్షల బస్తాలు రూ. 4500-5700, రాజస్తాన్లో 5-6 లక్షల బస్తాలు రూ. 4200-5400, కర్ణాటకలో 1 లక్షకు పైగా బస్తాలు నాణ్యమైన సరుకు రూ. 6000-6400, యావరేజ్ సరుకు రూ. 4000-5000 ధరతో వ్యాపారమవుతున్నది.





తెలంగాణలోని వనపర్తిలో గత వారం 18-20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5000–6500, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలీవరి రూ. 9500, 70-80 కౌంట్ రూ. 9900, ల0-70 కౌంట్ రూ.10,300, చెన్నై కోసం ఎక్స్పోర్టు క్వాలిటీ హెచ్ఎఎస్ గింజలు మిలైట్ రూ. 80-90 కౌంట్ రూ. 9400, లోడింగ్ కండిషన్ రెడీ సరుకు రూ. 9450, 90-100 కౌంట్ రూ.9200, 50-60 కౌంట్ రూ. 10,300, 60-65 కౌంట్ రూ. 9600-9700 ప్రతి క్వింటాలు మరియు దిండిగల్ సరుకు కేరళ కోసం 80-90 కౌంట్ ప్రతి 80 కిలోల బస్తా రూ. 9650 ధరతో వ్యాపారమైంది.


గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, వరంగల్ ప్రాంతాలలో ప్రతి రోజు 1.00-1.25 లక్షల బస్తాల సరుకు రాబవడిపై రూ.4000-7000, హెచ్ఎఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ.9500, 70-80 కౌంట్ రూ. 9600, 60-70 కౌంట్ రూ. 10,400-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్ లోని నరాలలో ప్రతి రోజు 8-10 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై 42 కిలోల బస్తా రూ. 2600-3200, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 10,900-11,000, 70-80 కౌంట్ రూ. 11,100-11,200, 60-70 కౌంట్ రూ. 12,000-12,500 మరియు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలో గత వారం 60-70 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 5800-7000, 80-90 కౌంట్ రూ. చెన్నై డెలివరి రూ.9500, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 10-12 వేల బస్తాలు రూ.6500-7000, హెచ్పిఎస్ గింజలు 80-90 చెన్నై డెలివరి రూ. 9400-9500, 70-80 కౌంట్ రూ. 9700-9800, 60-70 కౌంట్ రూ.10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 గుజరాత్ రాజ్, దిసా, గోండల్, పాలన్పూర్, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 1,50-2.00 లక్షల బస్తాల చేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ.5200-5900, మీడియం రూ. 4900-5000, హెచ్ఐఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 8150- 8600, 60-70 కౌంట్ రూ. 8350-9000, 50-60 కౌంట్ రూ.8350-9300, 50-60 కౌంట్ రూ. 8550-9300, 140-160 కౌంట్ రూ. 7600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజ్కోట్లో వేరుసెనగ రోహిణి నెంబర్-24, 37, 39 నాణ్యమైన సరుకు రూ. 5000-5150, మీడియం రూ. 5000-5200, యావరేజ్ రూ. 4750-5000, జి-20 సూపర్ రకం సరుకు రూ. 5700-5850, మీడియం రూ.5500-5700, యావరేజ్ రూ. 5250–5350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో రాబడులు తగ్గి 10 వేల బస్తాల సరుకు రాబడిపై 4200-5200, 70-80 కౌంట్ రూ. 8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని బికనీర్లో ప్రతి రోజూ 30 వేల బసాలు, మెడతా, జైపూర్, జోధ్ పూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా రూ. 4000-5200, హెచ్పీఎస్ గింజలు 60-65 కౌంట్ రూ. 7500-7550, 60-70 కౌంట్ రూ. 7600, 50-60 కౌంట్ రూ. 7800-7900, 40-50 కౌంట్ రూ. 7900-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్య ప్రదేశ్లోని నీమచ్లో ప్రతి రోజూ 1500-2000 బస్తాల వేరుసెనగ రాబడిపై రూ.4900-5300, చైనా సరుకు రూ.5321, మీడియం రూ. 4600-4800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, లక్ష్మేశ్వర్, హుబ్లీ, రాయిచూర్ ప్రాంతాలలో కలిసి గత వారం కేవలం 15 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ.4800-6500, నిమ్ము నరుకు రూ. 4000-5200, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 9200-9300, కళ్యాణి ప్రత్యక్ష ధర రూ. 8100, 70-80 కౌంట్ రూ. 9400, 90-100 కౌంట్ రూ. 9150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని శేపూరు, జైగుండం, అవలూరుపేట మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలసి ప్రతి రోజూ 7500 బస్తాల వేరుసెనగ రాబడిపై రూ.6500-7000, అలంగుడిలో 50-60 కౌంట్ రూ.10,000, 80-90 రూ. 9200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు