వేరుశనగ - ఎక్కువుగా తగ్గే అవకాశం లేదు

 

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ - నివేదికలో ప్రస్తుత సీజన్లో జూన్ 24 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.72 ల.హె. నుండి తగ్గి 7.62 ల.హ.లకు చేరింది. ఈ ఏడాది ఆంధ్రలో విస్తీర్ణం తగ్గడం, ఉత్తరప్రదేశ్లో సరుకు నాణ్యత లోపించ డంతో కర్మాటక, తెలంగాణల వ్యాపారులు పశ్చిమబెంగాల్ నుండి సరుకు కొను గోలు చేస్తున్నారు. దీనితో ధరలు బలోపేతం చెందాయి. కాగా ఎక్కువగా మంద కొడికి అవకాశం లేదు. ఎందుకనగా దేశంలో వంటనూనెల డిమాండ్ పెరుగుతోంది. 


మహారాష్ట్రలో యాసంగి పంట రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఎటా, మెన పురి, ఫరూఖాబాద్ లాంటి ప్రాంతాలలో 60-65 వేల బస్తాల యాసంగి కొత్త వేరుసెనగ రాబడి కాగా, ఎండు రకం రూ. 5500-5900, హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ గుజరాత్ డెలివరి రూ. 8700-8800, స్థానికంగా రూ. 8600, ఝాన్సీలో 8-10 వేల బస్తాల రాబ డిపె రూ. 5400-6800 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైoది.

 పశ్చిమబెంగాల్ లోని కోల్కత్తా, మిడ్నపూర్, ఖరగ్పూర్ తదితర ప్రాంతాలలో ప్రతి రోజు 45-50 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6500–7300, ఆయిల్ కండిషన్ గింజలు రూ. 9000-9100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. మహారాష్ట్రలోని పర్బణి, హింగోలి ప్రాంతాలలో రూ. 6100-6200, 80-90 కౌంట్ రూ. 9700, 70-80 కౌంట్ నాణ్యమైన సరుకు రూ. 10,100, మీడియం రూ.9400-9700, 90-100 కౌంట్రూ. 9400-9500, నాందేడ్లో రూ. 6100-6200 ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర, కదిరి ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 30-35 వేల బస్తాల రాబడిపై రూ. 5800-6400, కదిరి లేపాక్షి క్వాలిటీ రూ. 5000-5300 మరియు హెచ్ఎస్ గింజలు 80-90 కౌంట్ స్థానికంగా రూ. 9200, చెన్నై డెలివరి రూ. 9500, 70-80 కౌంట్ రూ. 9600, 60-70 కౌంట్ మహారాష్ట్ర డెలివరి రూ. 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్నూలు, ఎమ్మిగనూరులలో వేరుసెనగ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1530, పిండి 100 కిలోలు రూ. 3450, నరసరావుపేట, కొల్లాపూర్లో రూ.1500-1535 ధరతో వ్యాపారమైంది. తెలంగాణ మార్కెట్లలో రెత్తుల నిల్వ కు రూ. 6000-6180, వేరుసెనగ గింజలు 80-90 కౌంట్ రూ. 9400, 60-70 కౌంట్ రూ. 9650, 50-60 కౌంట్ రూ. 10,000, 140-160 కౌంట్ రూ. 9300 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలో పంట విత్తిన తరువాత వర్షాలు లేనందున రెత్తులు నిరుత్సా హంగా ఉన్నారు. చిత్రదుర్గ్, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, బళ్లారి, రాయిచూర్, యాద్గిర్, ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 7-8 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6000-7000, కదిరి లేపాక్షి రూ. 5000-5800, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9500, ఎక్స్పోర్ట్ రకం రూ. 9800, 70-80 కౌంట్ రూ. 9800-9900, ఎక్స్పోర్ట్ రకం రూ. 10,200 మరియు 60-70 కౌంట్ రూ. 10,500 ప్రతి క్వింటాలు ధరతో శ్రీ వ్యాపారమైంది. 

గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి గత వారం 60-65 వేల బస్తాల వేరుసెనగ పాత సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6400-6550, మీడియం రూ.5550-6000, యావరేజ్ రూ. 5400-5500 మరియు 3-4 వేల బస్తాల యాసంగి నాణ్యమైన కొత్త సరుకు రూ. 6000-6300 ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని బికనీర్ వారాంతపు సంతలో రూ.6000-6300, హెచ్పీఎస్ గింజలు రూ. 40-50 కౌంట్ రూ. 10,000, 50-60 కౌంట్ రూ. 9600, 60-70 కౌంట్ రూ. 9000, 60-65 కౌంట్ రూ. 9200, వేరుసెనగ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1510-1520, గుజరాత్లోని రాజ్కోట్, జామ్ నగర్, గోండల్ ప్రాంతాలలో రూ. 1575, అహ్మదాబాద్లో రూ. 1550, తమిళనాడులోని చెన్నెలో రూ. 1650 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని దిండిగల్లో ప్రతి రోజు 1000 బస్తాలు, కరూర్లో 1 వేయి బస్తాలు, అరియలూరులో 500 బస్తాలు, సేలంలో 1000 బస్తాలు, జెగుండం, ఆలంగుడి, దిండివనం ప్రాంతాలలో 2-3 వేల బస్తాల రాబడి కాగా, రూ.6300-7400 మరియు ఆలంగుడిలో 800-1000 బస్తాల కొత్త వేరుసెనగ రాబడి కాగా, రూ. 7000-7400, 80-90 కౌంట్ రూ. 7600 ప్రతి 80 కిలోలు, ఆలంగుడిలో 50-60 కౌంట్ వేరుసెనగ గింజలు రూ. 10,500, 80-90 కౌంట్ రూ. 9900 ప్రతి క్వింటాలు మరియు చెన్నైలో హెచ్పీఎస్ గింజలు (80 కిలోలు) పినట్ రూ. 7700, జెఎల్ మిక్స్ రూ. 7800 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు