తగ్గిన యాసంగి వేరుశనగ విస్తీర్ణం

 

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుత సంవత్సరంయాసంగి సీజన్ కోసం దేశంలో నూనెగింజల విస్తీర్ణం గత ఏడాది 9.85 లక్షల హెక్టార్లతో పోలిస్తే వృద్ధిచెంది 10.18 లక్షల హెక్టార్లకు చేరింది. అయితే వేరుసె నగ విస్తీర్ణం గత ఏడాది 5.43 ల.హె. నుండి తగ్గి 5.2 ల.హె.లకు చేరింది. త్వరలో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ మరియు గుజరాత్లలో కొత్త పంట రాబ డులు ప్రారంభం కానున్నాయి. కాగా పంట పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. ప్రస్తుతం తీవ్రమైన ఎండల వలన పంట కోతల సమయంలో దిగుబడిపై అంచనా వేయడం జరుగుతుంది. ఎందుకనగా పశ్చిమబెంగాల్లోని దక్షిణ ప్రాంతాలలో త్వరగా సేద్యం అయినందున మే మొదటి వారంలో మరియు ఉత్తర ప్రాంతా లలో పంట కోతలకు జాప్యం జరిగినందున మే చివరి వారం నాటికి కోతలు ప్రారంభం కాగలవు. 



గుజరాత్, మహారాష్ట్రలలో మే 15 నుండి ప్రారంభమై జూలై, ఆగస్టు వరకు సరఫరా కొనసాగగలదు. దీనితోపాటు మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో జూన్ నుండి కోతలు పంట కోతలు ప్రారంభం కాగలవు మరియు ప్రస్తుతం తమిళనాడులో రాబడులు కొనసాగగలవు. తద్వారా ధరలు ఎక్కువగా పెరిగే అంచనా కనిపించడం లేదు. తమిళనాడులోని దిండిగల్లో దినసరి 12-15 వేల బస్తాలు, కరూర్ 5-6 వేల బస్తాలు, అరియలూరులో 4-5 వేల బస్తాలు, సేలంలో 3-4 వేల బస్తాలు, జయగోండం, దిండివనమ్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6200-6500, నాణ్యమైన సరుకు రూ. 6900-7250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దిండిగల్లో 80-90 కౌంట్ ప్రతి 80 కిలోలు రూ. 7200, 70-80 కౌంట్ రూ. 7400-7500 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో గత వారం 18-20 వేల బస్తాలు, ఆదోనిలో 35-40 వేల బస్తాలు, ఎమ్మిగనూరులో 30-32 వేల బస్తాలు, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో 35-40 వేల బస్తాలతో పాటు సుమారు 1 లక్ష 30 వేల బస్తాల సరుకు రాబడి కాగా మీడియం రూ.5000-6000, నాణ్యమైన సరుకు రూ. 6100-6600 ప్రతి క్వింటాలు మరియు ఆదోని లోక ల్ మార్కెట్లో హెచ్పీఎస్ గింజలు 80–90 కౌంట్ రూ. 9100, చెన్నై డెలివరి రూ.900, 70-80 కౌంట్ రూ.9500, 60-70 కౌంట్ రూ. 9800-10,000 ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని చిత్రదుర్గ్, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, బళ్లారి, రాయిచూర్, యాద్గిర్ మరియు పరసర ప్రాంతాల అన్ని మార్కె ట్లలో కలిసి దినసరి 50-60 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై కదిరి లేపాక్షి క్వాలిటీ రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6000-6800 ధరతో వ్యాపారమైంది. 

గుజరాత్లోని ఉత్పాదక కేంద్రాలలో గతవారం సుమారు 80-90 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5500-6500, మ ధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రాబడులు క్షీణించాయి. మరియు కొత్త సరుకు రాబడులు జూన్ నుండి ప్రారంభం కాగలవు. కాగా ప్రస్తుతం వారంలో 14-15 వేల బస్తాల రాబడిపై రూ.4800-5300 ధరతో అమ్మకం అవుతుంది. 

రాజస్తాన్లో వేరుసెనగ రాబడులు దాదాపు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం కేవలం 500-1000 బస్తాల రాబడిపై స్థానికంగా రూ.5700-6700, హెచ్పీఎస్ గింజలు 40-50 కౌంట్ రూ. 9500, 50-60 కౌంట్ రూ. 9400, 60-70 కౌంట్ రూ. 8800, 60-65 కౌంట్ రూ. 9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని జడ్చర్ల, గద్వాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, తిరుమలగిరి, అచ్చంపేట, సూర్యపేట, వరంగల్, కేసముద్రం మరియు పరిసర ప్రాంతాలలో రాబడులు తగ్గాయి. మరియు స్థానికంగా రూ. 6000-6200, గద్వాల, మహబూబ్ నగర్ హెచ్ఎఎస్ గింజలు 90-100 కౌంట్ రూ. 9150-9200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



నిరాశకు గురైన వేరుశనగ రైతులు


అనంతపురం : అనంతపురం జిల్లాలో గత ఏడాది ఖరీప్లో వేరుశనగ విస్తీర్ణం 11.50 లక్షల ఎకరాలు ఉంది. అయితే, జూన్ మరియు జూలైలలో కురిసిన అధిక వర్షాల వలన మరియు ఆగష్టు, సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాల వలన రైతులు నష్టాలకు గురికావలసి వచ్చింది. రాబోవు 2022 కోసం పంట విత్త సమయం చేరువలో ఉంది. అయితే, రైతులకు 2021 ఖరీప్లో జరిగిన నష్టం పంచబడలేదు. వ్యవసాయ శాఖ వారి కథనం ప్రకారం ఖరీప్ సీజన్లో కేవలం 10 వేల ఎకరాలలో పంటకు నష్టం వాటిల్లింది. దీని ఆధారంగా ప్రభుత్వం నష్టం జరిగిన రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కాని తమకు అన్యాయం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థి తుల వలన దాదాపు అన్ని ప్రాంతాలలో పంటకు నష్టం వాటిల్లింది. దీని తరువాత జిల్లా కమిటీ సమావేశం మరియు జిల్లా పరిషద్ సమావేశాలలో చర్చించడం. జరిగింది. దీని తరువాత సవరించిన పంట నష్టం అంచనా నివేదికను ప్రభుత్వా నికి పంపడం జరిగిందని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతులకు పంట నష్టం పై బీమా లభించగలదు. కాని, దీని తరువాత ఇంతవరకు ఎలాంటి సహాయం లభించకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. అధికారుల కథనం ప్రకారం వ్యవసాయ డైరక్టర్ చే రిపోర్టును పరిశీలించడం జరుగుచున్నది. రాబోవు ఖరీప్లోపు ప్రభావిత రైతులకు పొలాలలో సబ్సిడీ లేదా బీమా ప్రకటించే అవకాశం కలదు.

Comments

Popular posts from this blog