లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది రబీ సీజన్లో దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. అయితే ఇప్పటికీ,ఖరీఫ్ సరుకు సరఫరా అవుతున్నందున ధరలు రూ.200-300 ప్రతి క్విoటాలుకు హెచ్చు-తగ్గులు కొనసాగుతున్నాయి. దేశంలో వంటనూనెలలో వేరుసెనగ నూనెకు డిమాండ్ పెరుగుతున్నది. తెలంగాణ వ్యవసాయ శాఖ వారి వివరాల ప్రకారం ప్రస్తుత రబీలో నూనెల గింజల విస్తీర్ణం 2020-21తో పోలిస్తే 3.49 లక్షల ఎకరాల నుండి 1.09 లక్షల ఎకరాలు పెరిగి 4.55 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో వేరుసెనగ విస్తీర్ణం పెరిగింది.
తెలంగాణలోని గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, అచ్చంపేట, సూర్యపేట, తిరుమల్ గిరి, వరంగల్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి సుమారు 60-70 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 3600-7180 మరియు మహబూబ్నగర్లో హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 10,000, 70-80 కౌంట్ రూ. 10,200-10,300, 60-65 కౌంట్ రూ. 11,000, 60-70 కౌంట్ రూ. 10,500-10,600, 50-60 కౌంట్ రూ. 11,500 ధరతో వ్యాపారమెంది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని హోళి పండుగ తరువాత కొత్త పంట రాబడి అయ్యే అవకాశం కలదు మరియు 6-7 వేల బస్తాల పాత సరుకు రాబడిపై 42 కిలోల బస్తా రూ. 2500-2800, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9500, 70-80 కౌంట్ రూ. 9900 మరియు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలో గత వారం 90 వేల నుండి 1 లక్ష బస్తాలు, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 16–20 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 6000-6800, హెచ్పీఎస్ గింజలు 80-90 చెన్నై డెలివరి రూ. 9900, 70-80 కౌంట్ రూ. 10,100, 60-70 కౌంట్ రూ. 10,600, మహారాష్ట్ర డెలివరి రూ. 10,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
గుజరాత్లోని రాజ్కోట్, దిసా, గోండల్, పాలన్పూర్, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో సుమారు 1 లక్ష బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6200-6850, మీడియం రూ. 5800-6300, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ కొత్త సరుకు రూ. 9000, 60-70 కౌంట్ రూ. 9400, 50-60 కౌంట్ రూ. 9300-9600, 140-160 కౌంట్ రూ. 8400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
రాజస్తాన్లోని బికనీర్, మహానిపూర్, మెడతా, జైపూర్, జోధ్ పూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 30-35 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా రూ. 5000-6000, హెచ్పీఎస్ గింజలు 60-65 కౌంట్ రూ. 8000-8400, 60-70 కౌంట్ రూ. 8200, 40-50 కౌంట్ రూ. 8900-9000, 50-60 కౌంట్ రూ. 8600-8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో 18-20 వేల బస్తాల సరుకు రాబడిపై 4800-5700, 70-80 కౌంట్ ఈరోడ్ డెలివరి (జిఎస్టి సహా) రూ.9400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అయింది. కర్ణాటకలోని చిత్రదుర్గ్, రాయిచూర్, చెల్లకేరి, బళ్లారి, యాద్గిర్ తదితర ప్రాంతాలలో కలిసి దినసరి 18-20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6000-7100, నిమ్ము సరుకు రూ. 4500-5100 మరియు చెల్లకేరిలో హెచ్ఐఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 9650-9700, 90-100 కౌంట్ రూ. 9450-9500, కళ్యాణి ప్రత్యక్ష ధర రూ. 8200-8300, 70-80 కౌంట్ రూ. 9800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని త్రిచంగోడ్లో గత వారం 600-700 బస్తాల కొత్త వేరుసెనగ గింజల రాబడిపై 240 కిలోల బస్తా రూ. 18,500-24,300, ఆలంగుడిలో 50-60 కౌంట్ రూ. 10,600, 80-90 కౌంట్ రూ. 9600, చెన్నెలో హెచ్ఐఎస్ గింజలు (పీనట్) రూ. 8700, జెఎల్ మిక్స్ రూ. 8800, దిండిగల్లో వేరుసెనగ గింజలు కేరళ డెలివరి 80-90 కౌంట్ ప్రతి 80 కిలోల బస్తా రూ. 8100, తిరునెల్వేలిలో 80-90 కౌంట్ రూ. 11,200, తెలుపు రకం సరుకు 90-100 కౌంట్ రూ. 10,000 ధరతో వ్యాపారమెంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు