విస్తీర్ణం తగ్గడంతో వేరుశనగ ధరలు బలోపేతం

 



హైదరాబాద్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో ప్రస్తుత సీజన్లో జూన్ 30 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవ ధితో పోలిస్తే 18.28 ల.హె. నుండి తగ్గి 13.71 ల.హ.లకు చేరింది. గుజరాత్ ప్రభుత్వం 2021-22 కోసం జారీ చేసిన నాల్గవ ముందస్తు అంచనాప్రకారం ఖరీఫ్ సీజన్లో వేరుసెనగ ఉత్పత్తి 43.59 ల.ట, యాసంగిలో 1.38 ల.ట. కలిసి 44.95 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఎటా, మెన పురి, ఫరూఖాబాద్ లాంటి ప్రాంతాలలో 1 లక్ష బస్తాల యాసంగి కొత్త పేరుసెనగ రాబడి కాగా, ఇటీవలె కురిసిన వర్షాల వలన సరుకు నిమ్ముగా ఉన్న నేపథ్యంలో ఎండు సరుకుకు మంచి డిమాండ్ రావడంతో ఎండు. రూ.500-500, హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 8300, గుజరాత్ డెలివరి రూ. 8500, ఝాన్సీలో 5-8 వేల బస్తాల రాబడిపై రూ. 5400-6300 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.


పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా, మిడ్నపూర్, ఖరగ్ పూర్ తదితర ప్రాంతాలలో ప్రతి రోజు 35-40 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ.6500-7300, ఆయిల్ కండిషన్ గింజలు రూ.9000-9200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళ నాడు కోసం ఎగుమతి అయింది. మహారాష్ట్రలోని పర్బణి, హింగోలి ప్రాంతాలలో రాబ డులు తగ్గాయి. స్వల్పంగా రాబడిపై ఎండు సరుకు రూ. 6100-6200, నాందేడ్లో రూ. 6150-6300 80-90 కౌంట్ రూ. 9700, 70-80 కౌంట్ నాణ్యమైన సరుకు రూ.10,100, మీడియం రూ. 9450-9700, 90-100 కౌంట్ రూ. 9450-9500 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర, కదిరి ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 20-25 వేల బస్తాల రాబడిపై రూ.5500-6400, కదిరి లేపాక్షి క్వాలిటీ రూ. 5000–5500, మరియు హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ స్థానికంగా రూ. 9200, చెన్నై డెలీవరి రూ. 9500, 70-80 కౌంట్ రూ.9600, 60-70 కౌంట్ మహారాష్ట్ర డెలివరి రూ. 9550–10,000, నర్సారావుపేటలో హెచ్ఎఎస్ గింజులు 70-80 కౌంట్ రూ.9500, 60-70 కౌంట్ రూ. 10,000, 50-60 కౌంట్ రూ. 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణ మార్కెట్లలో రెత్తుల నిల్వ సరుకు రూ. 6000-6200, వేరుసెనగ గింజలు 80-90 కౌంట్ రూ. 9600, 60-70 కౌంట్ రూ. 9700, 50-50 కౌంట్ రూ. 10,000, 140-160 కౌంట్ రూ. 9400 ధరతో వ్యాపా రమెంది. కర్ణాటకలోని చిత్రదుర్గ్, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, బళ్లారి, రాయిచూర్, యాద్గిర్, ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 6-7 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ.5800-7000, కదిరి లేపాక్షి రూ.5000-6000, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9750, 70-80 కౌంట్ రూ. 10,000–10,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని అన్ని ఉత్పా చక కేంద్రాలలో కలిసి గత వారం 80-90 వేల బస్తాల వేరుసెనగ పాత సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6650-6830, మీడియం రూ.6400-6600, యావరేజ్ రూ.6100-6300 మరియు యాసంగి నాణ్యమైన కొత్త సరుకు రూ. 5875-6550 ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని బికనీర్ వారాంతపు సంతలో రూ. 6000-6400, హెచ్పీఎస్ గింజలు రూ. 40-50 కౌంట్ రూ. 10,000, 50-60 కౌంట్ రూ. 9600, 60-70 కౌంట్ రూ. 9000, 60-65 కౌంట్ రూ. 9200, వేరుసెనగ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1510-1520, గుజరాత్లోని జామ్నగర్, గోండల్ ప్రాంతాలలో రూ. 1550-1575, అహ్మదాబాద్లో రూ. 1550, తమిళనాడులోని చెన్నైలో రూ. 1600, ముంబైలో రూ. 1610, రాజ్కోట్లో రూ.1675, బికనేర్లో 1480 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని దిండిగల్లో ప్రతి రోజు 800-1000 బస్తాలు, కరూ ర్ 1 వేయి బస్తాలు, ఆరియలూరులో 400-500 బస్తాలు, సేలంలో 1000-1200 బస్తాలు, జెగుండం, దిండివనం ప్రాంతాలలో 2 వేల బస్తాల రాబడి కాగా, రూ. 8500-7410 మరియు ఆలంగుడిలో 600-700 బస్తాల కొత్త వేరుసెనగ రాబడి కాగా, రూ. 6800-7200, 60-70 కౌంట్ రూ. 10,500, 80-90 కౌంట్ రూ. 9900 ప్రతి క్వింటాలు మరియు దిండిగల్లో 80-90 కౌంట్ రూ. 7550 ప్రతి 80 కిలోలు, చెన్నైలో హెచ్ఎస్ గింజలు (80 కిలోలు) పినట్ రూ. 7700, జిఎల్ మిక్స్ రూ.7800 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog