తగ్గిన ఖరీఫ్ వేరుసెనగ విస్తీర్ణo - రబీలో పెరిగే అవకాశం - వేరుసెనగకు ఉజ్జ్వల భవిష్యత్తు
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
ప్రస్తుత సీజన్లో 9, సెప్టెంబర్ వరకు దేశంలో వేరుశనగ విస్తీర్ణం 48 లక్షల 94 వేల హెక్టార్ల నుండి తగ్గి 45 లక్షల 35 వేల హెక్టార్లకు చేరింది. గుజరాత్ లో కొత్త సరుకు రాబడి ప్రారంభ మెంది. అయితే విస్తీర్ణం 19,09,641 హెక్టార్ల నుండి 2 ల.హె. తగ్గి 17,08,286 హెక్టార్లకు చేరింది. తెలంగాణాలో విస్తీర్ణం 16,137 ఎకరాల నుండి తగ్గి 14,996 ఎకరాలకు చేరింది.
గుజరాత్ లోని రాజ్ కోట్ లో దినసరి 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపె నెం.39 రకం ఎక్స్ ట్రా సూపర్ రూ. 6500-6750, మీడియం రూ. 6350-6500, యావరేజ్ రూ. 6000-6300, నెం.24 రకం బెస్ట్ రూ. 6750-6950, మీడియం రూ. 6450-6750, యావరేజ్ రూ. 6000-6250 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది మరియు 500-600 బస్తాల పాత సరుకు రాబడి పె జి-20 రకం రూ.6400-6600, మీడియం రూ. 6200-6400 ప్రతి క్వింటాలు మరియు వేరుశనగ గింజలు ముంద్ర డెలివరి బోల్డ్ 50-60 కౌంట్ రూ. 9850, 50-55 కౌంట్ రూ. 10,000, 40-50 కౌంట్ రూ. 10,150, 40-45 కౌంట్ రూ. 10,300 ధరతో వ్యాపారమ యింది.
ఉత్తరప్రదేశ్ లోని ఏటా, మెన్ పురి ప్రాంతాలలో దాదాపు 2-3 వేల బస్తాల యాసంగి వేరుసెనగ రాబడిపె ఎండు సరుకు స్థానికంగా రూ.200-300 తగ్గి రూ. 5800-6200, ఝాన్సీలో 3-4 వేల బస్తాల రాబడిపె రూ.4800-5300 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపా రమయింది. పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా, మిదనాపూర్, ఖడగ్ పూర్ తదితర ప్రాంతాలలో నిల్వ అయిన ఎసి సరుకు రూ.5500-5700, నూనెకండిషన్ 60-70 కౌంట్ రూ. 8600 ప్రతిక్వింటాలు ధరతో లోకల్ లూజు వ్యాపారమయింది.
కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణదుర్గ,రాయదుర్గ, మడకశిర, కదిరి ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 80-90 వేల బస్తాల రాబడిపె కదిరి లేపాక్షి రకం రూ.5500-6000, స్థానికంగా నాణ్యమెన సరుకు రూ. 7000-8000 ప్రతి క్వింటాలు మరియు 80-90 కౌంట్ (10 శాతం నిమ్ము) స్థానికంగా రూ. 10,300, చెన్నై డెలివరీ రూ.10,200, 70-80 కౌంట సానికంగా రూ. 11,000, మహారాష్ట్ర సరుకు రూ. 11,400, విత్తనాల కోసం 60-70 కౌంట్ తెలంగాణ డెలివరి రూ. 12,500 (ట్యా క్స్ తో సహా) ధరతో వ్యాపారమయింది. నరసారావుపేటలో వేరుశనగ హెచ్ పిఎస్ గింజలు 70-80 కౌంట్ రూ. 10,500, 60-70 కౌంట్ రూ. 11,000, 50-60 కౌంట్ రూ. 11,500 మరియు తెలంగాణా ప్రాంతపు వేరుశనగ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరీ రూ. 10,600-10,700, 60-70 కౌంట్ రూ. 11,100, 90-100 కౌంట్ రూ. 10,400-10,500 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారము యింది.
తమిళనాడులోని దిండిగల్, కరూరు, అరియాలూరు, సేలం,జయ గొండం, దిండివనం, శివగిరి, , తిరుకోవిలూరు, కొడుముడి ప్రాంతా లలో కలిసి దినసరి దాదాపు 3-4 వేల బస్తాల రాబడిపె రూ. 6500-8200, 80-90 కౌంట్(ప్రతి 80 కిలోలు) రూ. 8300, 70-80 కౌంట్ రూ. 8500 మరియు అలంగుడిలో 50-60 కౌంట్ రూ. 11,300, 80-90 కౌంట్ రూ. 10,700 ప్రతి క్వింటాలు మరియు చెన్నైలో హెచ్ పిఎస్ గింజలు ( 80కిలోలు)పీ నట్ రూ. 8800, జెఎల్ రకం రూ. 8700 మరియు తిరువ కలు న్న మలెల్లో 80-90 కౌంట్ రూ. 10,100 ధరతో వ్యాపారమయింది.
అహ్మదాబాద్ - విస్తీర్ణం తగ్గడంతో పాటు చీడపీడల బెడద కారణంగా మరియు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున ప్రముఖ వేరుసెనగ ఉత్పాదక రాష్ట్రమైన గుజరాత్ లో పంట ప్రభావితమైంది. మరోవైపు ప్రముఖ వినియోగ దేశమైన చెనైలో అనావృష్టి పరిస్థితుల వలన డిమాండ్ పెరిగే అవ కాశం ఉన్నందున అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్ లో భారతీయ మార్కెట్లలో ధరల స్థాయి అధికంగా ఉండే అంచనా కలదు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 9 నాటికి దేశంలో నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 48.94 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 45.35 ల.హె.కు పరిమితం కాగా, తెలంగాణలో వేరుసెనగ సేద్యం 16,137 ఎకరాల నుండి తగ్గి 14,996 ఎకరాలకు చేరగా, ఆంధ్రలో 5.25 ల.హె, మధ్య ప్రదేశ్ లో 4.50 లక్షల హెక్టార్లు, కర్ణాటకలో 3.65 ల.హె., మహారాష్ట్రలో 1.57 ల.హెక్టా ర్లకు చేరింది. అయితే రాజస్థాన్ లో రికార్డు స్తాయిలో 7.90 లక్షల హెక్టార్లకు చేరగా, గుజరాత్ లో సెప్టెంబర్ 5 నాటికి విస్తీర్ణం 19,09,641 హెక్టార్ల నుండి తగ్గి 17,08,286 హెక్టార్లకు చేరింది. కొన్ని ప్రాంతాలలో చీడపీడల బెడద ఉన్నట్లు సమాచారం. దీనితో వ్యవసాయ శాఖ ముందస్తు అంచనా ప్రకారం 2022-23లో గుజరాత్ లో వేరుసెనగ ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 43.59 ల.ట. నుండి తగ్గి 39.17 ల.ట. లకు చేరే అంచనా కలదు. గుజరాత్ రాష్ట్ర వంటనూనెలు - నూనె గింజల సంఘం వారి కథనం ప్రకారం మరో 15 రోజులలో కురిసే వర్షాలపై పంట పరిస్థితి ఆధార పడి ఉండగలదు. వీరి కథనం ప్రకారం ప్రస్తుతం త్వరగా విత్తిన పంట రాబడులు కొనసాగుతున్నాయి. గురువారం నాడు గోండల్ మార్కెట్లో రూ. 6655 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. ఉత్పత్తి తగ్గడంతో పాటు దేశ విదేశాల కోసం డిమాండ్ నెలకొనడంతో వేరుసెనగ కనీస మద్దతు ధర రూ. 5850 ప్రతి క్వింటాలుతో పోలిస్తే మార్కెట్లో ధరలు అధికంగా ఉండే అవ కాశం ఉంది.
కొత్త పంట రాబడులు 3514 క్వింటాళ్లు నమోదయ్యాయి. పండుగల డిమాండ్ వలన వేరుసెనగ నూనె ధరలు పటిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. సూడాన్ మరియు సెనగల్ లాంటి ఇతర ఉత్పాదక దేశాలలో రాబడులు ఆల స్యంగా ప్రారంభమయ్యాయి. దీనితో ప్రారంభ నెలలలో ధరలు పటిష్టంగా ఉండే అంచనా కలదు. కొందరు వ్యాపారుల అభిప్రాయం ప్రకారం ధరలు మెరుగ్గా ఉన్నందున ప్రభుత్వ కొనుగోళ్లు పరిమితంగా ఉండే అంచనా కలదు.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు