తగ్గిన వేరుశనగ ఉత్పత్తి

 



ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. ఇందులో గుజరాత్ లో విస్తీర్ణం 2 ల.హె. మేర తగ్గి నందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 38.55 ల.హె. నుండి తగ్గి 30 ల.హె.లకు చేరే అంచనా కలదు. ఎందుకనగా విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా తగ్గుచున్నది. అయితే గుజరాత్ లో మొత్తం విస్తీర్ణం గత ఏడాది సాధారణ స్థాయిలో ఉన్నందున ఉత్పత్తి 30 లక్షల టన్నులు ఉంది. అయితే ప్రతి హెక్టారు సగటు దిగుబడి 2020 కిలోల నుండి తగ్గి 1755 కిలోలు ఉండే అంచనా కలదు.కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రూ. 5850 ప్రతి క్వింటాలు ఉంది.


 దీనితో పోలిస్తే ఈ సారి ఎండు సరుకు రూ. 6000-6300 ధరతో వ్యాపారమెంది. లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన రాజస్థాన్లో ఖరీఫ్ సీజన్ విస్తీర్ణం 7.90 ల.హె., ఆంధ్రలో 5.47 ల.హె., మధ్య ప్రదేశ్ లో 4.50 ల.హె., కర్ణాటకలో 3.73 ల.హె., తమిళనాడులో 2.28 ల.హె. ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు మద్దతు ధర లేదా అంతకంటే అధికంగా ఉన్నందున మరియు అనుకూల వర్షాల వలన రబీ పంట విస్తీర్ణం పెరగవచ్చు. ఎందుకనగా రైతులు వివిధ రాష్ట్రాల నుండి నాణ్యమెఇన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.రాజస్థాన్ లోని బికనేర్, జైపూర్ తదితర ప్రాంతాలలో గత వారం 75-80 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపె రూ. 5500-6500, బికనేర్‌లో 40-50 కౌంట్ రూ. 9000, 50-60 కౌంట్ రూ. 8600, 60-65 కౌంట్ రూ. 8500, 60-70 కౌంట్ రూ. 8800 ధరతో వ్యాపారమెంది.

 ఝాన్సీ తదితర ప్రాంతాలలో కలిసి వారంలో 25-30 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపె రూ. 4900-5500, శివపురిలో 8-10 వేల బస్తాల రాబడిపై రూ. 5200-5400 ధరతో వ్యాపారమెంది. గుజరాత్ లోని ఉత్పాదక కేంద్రాలలో ప్రతిరోజు సుమారు 1 లక్ష బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా నాణ్యమైన సరుకు రూ. 6300-6500, మీడియం రూ. 5500-6000, యావరేజ్ సరుకు రూ. 5000-5500, ఎక్స్ ట్రా రకం రూ. 6450-6500, నాణ్యమైన సరుకు రూ. 6250-6400, యావరేజ్ రూ. 5550-5750, జి-20 రకం రూ. 6500-6650, మీడియం రూ. 6350-6550, హెచ్ పిఎస్ గింజలు ముంద్రా' ఓడరేవు డెలివరి 50-60 కౌంట్ రూ. 9250, 50-55 కౌంట్ రూ. 9350, 40-50 • కౌంట్ రూ. 9450, 38-42 కౌంట్ రూ. 9750,జావా 80-90 కౌంట్ కొత్త సరుకు రూ. 5 10,300, 60-70 కౌంట్ రూ. 10,400, 50-60 కౌంట్ రూ. 10,700, టిజె-3780-90 కౌంట్ రూ. 9550, 50-60 కౌంట్ రూ. 9750, 60-70 కౌంట్ రూ. 9650 - ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 పశ్చిమబెంగాల్ లోని కోల్‌కత్తా, మిడ్నపూర్, ఖరగ్ పూర్ - మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు రూ. 5500-5700, - ఆయిల్ కండిషన్ గింజలు 60-70 కౌంట్ రూ. 8700 ధరతో వ్యాపారమెంది.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణ్ దుర్గ్, రాయ్ దుర్గ్, క మడకశిర, కదిరి ప్రాంతాల మార్కెట్లలో కలిసి రెండు రోజుల మార్కెట్లో 45-50 వేల 5 బస్తాల సరుకు రాబడిపై కదిరి లేపాక్షి రకం నాణ్యమైన సరుకు రూ. 4500-5000, - స్థానికంగా రూ. 5270-6480, 80-90 కౌంట్ రూ. 10,300-10,400 మరియు - చెన్నై డెలివరి రూ. 10,500-10,600, స్థానికంగా 70-80 కౌంట్ రూ. 10,6005 10,700, 60-70 కౌంట్ రూ. 11,500–12,000 ధరతరో వ్యాపారమె కర్ణాటకలో విత్తనాల కోసం రవాణా అవుతోంది.నర్సారావుపేటలో నూనె రూ. 1450, హె పిఏస్ గింజలు రూ. 11,000, 60-70 కౌంట్ రూ. 11,500, 50-60 కౌంట్ రూ. 12,000, కర్నూలులలో వేరుసెనగ నూనె 1615, విత్తనాలు (240 కిలోలు) రూ. 19,300, ఎమ్మి - కొల్లాపూర్ ప్రాంతాలలో నూనె రూ. 1550-1560 ధరతో వ్యాపారమెంది.

తెలంగాణలో హెచ్ పిఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నె డెలివరి రూ. • 10,600-10,700, 60-70 కౌంట్ రూ. 10,900-11,000, 60-65 కౌంట్ రూ. - 11,200-11,300 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ్, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, - బళ్లారి,రాయిచూర్, యాద్ర్, కుస్తగి, సిరి ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు - 70 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5780-7470, కదిరి లేపాక్షిసరుకు రూ. 4500-5000, చెల్లకేరిలో హెచ్ పి ఎస్ గింజలు 80-90 కౌంట్ స్థానికంగా రూ. 10,800-11,000, 70-80 కౌంట్ రూ. 11,200-11,300, 60-70 కౌంట్ రూ. 11,500-11,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని శివ గిరి, దిండిగల్, అరియలూరు, మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 7000-7800, 80-90 కౌంట్ (80 కిలోల బస్తా) రూ. 8300, 70-80 కౌంట్ రూ. 8500, అలంగుడిలో 50-60 కౌంట్ రూ. 11,500, 80-90 కౌంట్ రూ. 10,900 ప్రతి క్వింటాలు మరియు చెన్నైలో హెచ్ పిఎస్ గింజలు 80 కిలోల బస్తా పీ-నట్ రూ. 8900-9000, జెఎల్ మిక్స్ రూ. 8900, తిరువన్నామలైలో 80-90 కౌంట్ రూ. 10,750, తెలుపు రూ. 90-100 కౌంట్ రూ. 9900 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog