ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 3 నాటికి దేశంలో వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 44.39 ల.హె. నుండి తగ్గి 44.09 ల.హె. పరిమితం కాగా ఇందులో గుజరాత్ ఖరీఫ్ సేద్యం ఆగస్టు 1 నాటికి వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18,93,734 హెక్టార్ల నుండి తగ్గి 16,72,401 హెక్టార్లకు చేరగా జునాగఢ్ జూన్లో విత్తిన పంట సెప్టెంబర్ -మూడో వారం నాటికి రాబడి కాగలదు. రాజస్తాన్లో 7,39,650 హెక్టార్ల నుండి పెరిగి 7,83,670 హెక్టార్లకు విస్తరించింది.
గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి గత వారం 50-60 వేల బస్తాల వేరుసెనగ పాత సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7325, మీడియం రూ.6700-6900, యావరేజ్ రూ.6400-6600, యాసంగి నాణ్యమైన సరుకు రూ. 6350-6775 ధరతో వ్యాపారమైంది.
ఉత్తరప్రదేశ్లోని ఎటా, మెన్రపురి ప్రాంతాలలో 40-50 వేల బస్తాల యాసంగి వేరుసెనగ రాబడి కాగా ఎండు సరుకు స్థానికంగా రూ. 5800-5900, నిమ్ముసరుకు రూ. 4600-5100, హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ గుజరాత్డె లివరి రూ. 9000, స్థానికంగా రూ. 9100, ఝాన్సీలో 3-4 వేల బస్తాలు రూ. 5100-5500 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా, మిడ్నపూర్, ఖరగ్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రతి రోజు 15-18 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 5500-500, ఆయిల్ కండిషన్ గింజలు రూ. 9600, క్రషింగ్ సరుకు రూ. 8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్ ని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర, కదిరి ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 15-20 వేల బస్తాల రాబడిపై కదిరి లేపాక్షి క్వాలిటీ స్థానికంగా రూ. 7000-7500, 80-90 కౌంట్ విత్తనాల కోసం రూ. 10,000, చెన్నై డెలివరి రూ. 10,300, 70-80 కౌంట్ రూ. 10,800, ముంబై డెలివరి రూ. 11,000, 60-70 కౌంట్ స్థానికంగా రూ. 11,000, ముంబై డెలివరి రూ. 11,400-11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్నూలు, ఎమ్మిగనూరులో వేరుసెనగనూనె ప్రతి 10 కిలోలు రూ. 1540, పిండి ప్రతి క్వింటాలు రూ. 3600, నరసరావుపేట, కొల్లాపూర్లో వేరుసెనగనూనె రూ.1470-180, నరసరావుపేటలో హెచ్పీఎస్ గింజలు 70-80 కౌంట్ రూ. 9500, 60-70 కౌంట్ రూ. 11,000, 50-60 కౌంట్ రూ. 10,600 మరియు తెలంగాణ మార్కెట్లలో హెచ్ఐఎస్ గింజలు 80-90 కౌంట్ రూ.
10,200, 60-70 కౌంట్ రూ. 11,300-11,400 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ్, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, బళ్లారి, రాయిచూర్, యాద్గిర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 8-10 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6000-7000, కదిరి లేపాక్షి రకం రూ.5800-6000, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ.10,400-10,500, 70-80 కౌంట్ రూ. 10,600 ప్రతి క్వింటాలు ధరతో
రాజస్తాన్లోని బికనీర్ స్థానిక మార్కెట్లో ప్రతి క్వింటాలు రూ. 6000-6600, హెచ్పీఎస్ గింజలు 40-50 కౌంట్ రూ. 10,500, 50-60 కౌంట్ రూ. 10,000, 60-70 కౌంట్ రూ.9500, 60-65 కౌంట్ రూ. 9700 మరియు వేరుసెనగ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1460, గుజరాత్లోని జామ్నగర్, గోండల్, రాజ్కోట్ ప్రాంతాలలో రూ. 1600, ముంబై, చెన్నెలో.. రూ. 1630–1650 ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని దిండిగల్, కరూర్, అరియలూరు, సేలం, జెగుండం, దిండి వనం ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 2 వేల బస్తాలు రూ. 7000-7500 ప్రతిక్వింటాలు మరియు హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ 80 కిలోల బస్తా రూ. 8250, 70-80 కౌంట్ రూ. 8400-8500, అలంగుడిలో 400-500 బస్తాలు రూ. 7000-7600, 50-60 కౌంట్ రూ. 10,600, 80-90 కౌంట్ రూ. 10,000 ప్రతి క్వింటాలు మరియు చెన్నైలో పీ నట్ 80 కిలోల బస్తా రూ. 8600, జెఎల్ మిక్స్ రూ. 8500 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు