దూసుకుపోతున్న వేరుశనగ ధరలు

 



 ప్రస్తుత ఖరీఫ్లో ఆగస్టు 19 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47,95,000 హెక్టార్ల నుండి తగ్గి 44,32,000 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 19,01,082 హెక్టార్ల నుండి తగ్గి 17,00,123 హె .లకు చేరింది. రాజస్థాన్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 7,84,000 హెక్టార్లు ఉంది. అనగా గుజరాత్ తరువాత రెండవ ప్రముఖ స్థానంలో ఉంది.


ప్రస్తుతం పండుగల సీజన్ నెలకొనడంతో పాటు సరుకు కొరత ఏర్పడినందున వేరుసెనగ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. గత వారం శ్రీక్రిష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా గుజరాత్లోని అన్ని మార్కెట్లు మూసివున్నాయి.


ఉత్తరప్రదేశ్లోని ఎటా, మెనురి ప్రాంతాలలో 20 వేల బస్తాల యాసంగి వేరుసెనగ రాబడి కాగా ఎండు సరుకు స్థానికంగా రూ. 5400-5800, నిమ్ము సరుకు రూ. 4700-5000, హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 9700, ఝాన్సీలో 3-4 వేల బస్తాలు రూ. 5000-5800 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది. పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా, మిడ్నపూర్, ఖరగ్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రతి రోజు 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై రూ.5500-5700, ఆయిల్ కండిషన్ గింజలు 60-70 కౌంట్ రూ. 8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర, కదిరి ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 25-30 వేల బస్తాల రాబడిపై కదిరి లేపాక్షి క్వాలిటీ స్థానికంగా రూ.5500-6000, నాణ్యమైన సరుకు రూ. 7000-8000, 80-90 కౌంట్ రూ. 10,300-10,400, చెన్నై డెలివరి రూ. 10,700, స్థానికంగా 70-80 కౌంట్ రూ. 10,800, చెన్నై డెలివరి రూ. 11,200 ముంబై డెలివరి రూ. 11,000, స్థానికంగా 60-70 కౌంట్ రూ. 11,000, ముంబై డెలివరి రూ. 11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్నూలు, ఎమ్మిగనూరు, కొల్లాపూర్లో వేరుసెనగనూనె ప్రతి 10 కిలోలు రూ. 1550, పిండి ప్రతి క్వింటాలు రూ.4000, నరసరావుపేటలో, వేరుసెనగనూనె రూ. 1470, నరసరావుపేటలో హెచ్పీఎస్ గింజలు 70-80 కౌంట్ రూ. 9700, 60-70 కౌంట్ రూ. 10,200, 50-60 కౌంట్ రూ. 10,700 మరియు తెలంగాణ హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 10,700-10,800 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని చిత్రదుర్గ్, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, బళ్లారి, రాయిచూర్, యాద్గిర్ ప్రాంతాల అన్ని మార్కెట్లో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6500-7600, కదిరి లేపాక్షి రకం రూ. 5500-5800, చెల్లకేరిలో హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 10,300-10,400, 70-80 505 r. 10,800-10,900, 60-70 రూ. 11,200–11,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని బికనీర్ స్థానిక మార్కెట్లో 40-50 వేల బస్తాలు ప్రతి క్వింటాలు రూ.6000-6400, హెచ్పీఎస్ గింజలు 40-50 కౌంట్ రూ. 10,500, 50-60 కౌంట్ రూ. 10,000, 60-70 కౌంట్ రూ. 9500, 60-65 కౌంట్ రూ. 9700 మరియు వేరుసెనగ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1470, గుజరాత్లోని అహ్మదాబాద్లో రూ. 1625, జామ్నగర్, గోండల్, రాజ్ కోట్ ప్రాంతాలలో రూ. 1650, చెన్నైలో రూ. 1620, ముంబైలో 1670 ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని దిండిగల్, కరూర్, అరియలూరు, సేలం, జెగుండం, దిండి వనం ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 4-5 వేల బస్తాలు రూ. 7000-7500 ప్రతిక్వింటాలు మరియు హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ 80 కిలోల బస్తా రూ. 8400, 70-80 కౌంట్ రూ. 8500-8600, అలంగుడిలో 500-600 బస్తాలు రూ. 7000-7500, 50-60 కౌంట్ రూ. 11,100, 80-90 కౌంట్ రూ. 10,500 ప్రతి క్వింటాలు మరియు చెన్నైలో హెచ్పీఎస్ గింజలు పీనట్ 80 కిలోల బస్తా రూ.8600, జెఎల్ మిక్స్ రూ. 8500 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog