తగ్గుచున్న ఖరీఫ్ సీజన్ వేరుసెనగ సీద్యం - మార్కెట్ ధరలు

 


 దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సేద్యం చేరుసెనగ సేద్యం తగ్గుచున్నట్లు వంకేతాలు అందుతున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గుజరాత్లో జూలై 25 నాటికి వేరసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18,68,169 హెక్టార్ల నుండి తగ్గి 10,20,700 హెక్టార్లు, రాజస్తాన్లో 7.26 ల.హె. నుండి పెరిగి 7.71 ల.హె., మధ్యప్రదేశ్లో 3.26 ల.హె. నుండి 3.60 ల.హె.కు విస్తరించగా, మహారాష్ట్రలో 1.83 ల.హె. నుండి తగ్గి 1.44 ల.హె., ఆంధ్రప్రదేశ్లో 3.27 ల.హె. నుండి 3 ల.హె., కర్ణాటకలో 3.66 ల.హె. నుండి 2.14 ల.హె., తెలంగాణలో 15,016 ఎకరాల నుండి 4372 ఎకరాలకు పరిమితమైంది. 


అయితే, సంతృప్తికరమైన వర్షాలు కురుస్తున్నందున రాబోయే రబీ సీజన్ సేద్యం తెలంగాణ, కర్ణాటకలో విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఉత్తరప్రదేశ్లోని ఎటా, మెనురి ప్రాంతాలలో 45-50 వేల బస్తాల యాసంగి వేరుసెనగ రాబడి కాగా, ఎండు రకం రూ. 4900-5100, లారీ బిల్టి రూ. 5500-5750, హెచ్ ఎస్ గింజలు 60-70 కౌంట్ స్థానికంగా రూ. 9100, గుజరాత్ డెలివరి రూ. 9400, ఝాన్సీలో రూ. 4900-5300 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది. పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా, మిడ్నపూర్, ఖరగ్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రతి రోజు 10-15 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 5500-5700, కండిషన్ గింజల రూ. 5000-1200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ఆదోని ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 15 వేల బస్తాల రాబడిపై కదిరి లేపాక్షి క్వాలిటీ స్థానికంగా రూ. 5000-5500, 80-90 కౌంట్ విత్తనాల కోసం రూ. 10,000-10,200, చెన్నై డెలివరి రూ. 10,200, 70-80 కౌంట్ రూ. 10,800, ముంబై డెలివరి రూ. 11,000, 60-70 కౌంట్ స్థానికంగా రూ. 11,000, ముంబై డెలివరి రూ. 11,500-21,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. నరసన్నపేటలో హెచ్పీఎస్ గింజలు 70-80 కౌంట్ రూ. 9500, 60-70 కౌంట్ రూ. 10,200, 50-60 కౌంట్ రూ. 10,600 మరియు తెలంగాణ మార్కెట్లలో హెచ్ ఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 10,200, 60-70 కౌంట్ రూ. 10,500-10,800, 50-60 కౌంట్ రూ. 11,000 ధరతో వ్యాపారమెంది.


కర్ణాటకలోని చిత్రదుర్గ, హుబ్లీ, గద, చెల్లకే, బళ్లారి, రాయిచూర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6000-7000, కదిరి లేపాక్షి రకం రూ. 5000-6000, చెల్లకేరిలో హెచ్ఐఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 10,400-10,500, 70-80 కౌంట్ రూ. 10,700-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని అన్ని ఉన్నా దక కేంద్రాలలో కలిసి గత వారం 60-70 వేల బస్తాల వేరుసెనగ పాత సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6600-6900, మీడియం రూ. 6400-6550, యావరేజ్ రూ. 6150-6250, యాసంగి నాణ్యమైన సరుకు రూ. 6400-6500 ధరతో వ్యాపా రమైంది. 

రాజస్తాన్లోని బికనీర్ స్థానిక మార్కెట్లో రూ.5800-6000, హెచ్పీఎస్ గింజలు రూ. 40-50 కౌంట్ రూ. 10,200, 50-60 కౌంట్ రూ. 9700, 60-70 కౌంట్ రూ.9150, 60-65 కౌంట్ రూ.9200-9300, వేరుసెనగ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1480-1520, గుజరాత్లోని జామ్నగర్, గోండల్, రాజ్కోట్ ప్రాంతాలలో రూ. 1600, ముంబై, చెన్నైలో రూ.1620-1650 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని దిండిగల్, కరూర్, అలూరు, సేలం, కొండం, ఉండివనం ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 2-3 వేల బస్తాలు రూ. 7000-7800 ప్రతి క్వింటాలు మరియు హెచ్ఐఎస్ గింజలు 80-90 కౌంట్ ప్రతి 80 కిలోల బస్తా రూ. 8250, 70-80 కౌంట్ రూ. 8400 -8500, అలంగుడిలో 500-600 బస్తాలు రూ. 7000-7800, 50-60 కౌంట్ రూ. 10,600, 80-90 కౌంట్ రూ. 10,000 ప్రతి క్వింటాలు మరియు చెన్నైలో పీ- నట్ 80 కిలోల బస్తా రూ. 8600, జెఎల్ మిక్స్ రూ. 8500 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు