ఉత్తరాదిలో ప్రారంభమైన వేరుశనగ
ఉత్తరపదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశ్శా లాంటి వేరుసెనగ ఉత్పాదక రాష్ట్రాలలో వేరుసెనగ పంట నూర్పిళ్లు శరవేగంతో చేపడుతుండగా మార్కెట్ కు రాబడులు స్వల్పంగా ప్రారంభమవుతున్నాయి. మరో రెండు వారాలలో రాబడులు జోరందుకోగలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. పాత సరుకు నిల్వలు హరించుకుపోయాయి. ఈసారి ఉత్తరప్రదేశ్ సరుకు గుజరాత్కు మరియు ఒడిశ్శా, పశ్చిమ బెంగాల్ సరుకు దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకనగా, ఈసారి మద్దతు ధరను అధిగమించిన లాభసాటి ధరలు లభిస్తున్నందున రైతులు తమ సరుకు నూర్పిడి చేపట్టిన వెంటనే విక్రయిస్తున్నారు. వంటనూనెల ధరలు డీలా పడినందున వేరుసెనగ ధరలు ఒడిదొడుకులకు లోనుకావడంలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ 29 వరకు దేశంలో యాసంగి వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 5.27 ల.హె. నుండి తగ్గి 4.50 ల.హె.కు పరిమితమైంది. ఇందులో ఏప్రిల్ 24 వరకు గుజరాత్ వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 60,820 హెక్టార్ల నుండి తగ్గి 53,743 హెక్టార్లకు పరిమితమైంది. నూనె మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేసున్నారు. సరఫరా కూడా సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ధరలు ఒడిదొడుకులకు లోనుకావడంలేదు. ప్రస్తుతం దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలలో కలిసి వారంలో 4 లక్షల బస్తాల సరుకు రాబడి అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని, కర్నూలు, అనంతపురం, మడకశిర, కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 1.90 లక్షల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై నాణ్యమైన స్థానికంగా రూ. 6740-7280, కదిరి లేపాక్షి రూ. 5200-6300, 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 10,300, స్థానికంగా రూ. 10,000, 90-100 కౌంట్ రూ. 10,000, స్థానికంగా రూ. 9700, 60-70 కౌంట్ చెన్నై డెలివరి రూ. 11,000, స్థానికంగా రూ. 10,700, 50-60 కౌంట్ ముంబై కోసం రూ. 11,300, స్థానికంగా రూ. 11,000, 60-65 కౌంట్ చెన్నై డెలివరి రూ. 11,200, స్థానికంగా రూ. 11,000, కళ్యాణి చెన్నై డెలివరి రూ. 9600, స్థానికంగా రూ. 9400 ధరతో వ్యాపారమైంది.
తెలంగాణలోని గద్వాల, మహబూబ్నగర్, వికారాబాద్, నాగర్ కర్నూలు, అచ్చంపేట ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం కేవలం 3035వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5000-7050, హెచ్పీఎస్ గింజలు 90-100 కౌంట్ రూ. 10,000, 80-90 కౌంట్ రూ. 10,300, 60-70 కౌంట్ రూ. 10,700, 50-60 కౌంట్ రూ. 11,200, 60-65 కౌంట్ రూ. 10,000-10,900, కళ్యాణి రూ. 9600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని దిండిగల్, కురంజిపాడి, విరుధచలం, విల్లుపురం, కడలూరు, అవలూరు పేట, తిరుకోవిలూరు, వేదారణ్యం, తిరువన్నామలైలో ప్రతి రోజు 18–20 వేల బస్తాల కొత్త వేరుసెనగ ప్రతి 80 కిలోల బస్తా రూ. మీడియం రూ. 6300-7150 మరియు7200-8200 తిరువన్నామలైలో ఎక్స్ పోర్టు రకం సరుకు హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 11,300, తెలుపు 90-100 కౌంట్ రూ. 10,100, దిండిగల్, అరియలూరు, కరూరు, అలంగుడి, జైగుండం, సేలంలో 20-25 వేల బస్తాలు రూ. 7000-8000, అలంగుడిలో హెచ్పిఎస్ గింజలు 50-60 కౌంట్ రూ. 10,500-10,600, 80-90 కౌంట్ రూ. 9800 - 9900, చెన్నైలో హెచ్పీఎస్ గింజలు పి-నట్ 80 కిలోల బస్తా రూ.8500, జెఎల్ మిక్స్ రూ. 8600 ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని చిత్రదుర్గ్, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, బళ్లారి, రాయిచూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 45-50 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై కదిరి లేపాక్షి రూ.4500-5700, నాణ్యమైన సరుకు రూ. 6000-7700, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ స్థానికంగా రూ. 10,250, 90-100 కౌంట్ రూ. 10,100, 70-80 కౌంట్ రూ. 10,500, 60-70 కౌంట్ రూ. 10,600, కళ్యాణి రూ.9600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో రాబడులు తగ్గి 1500 బస్తాలకు పరిమితం కాగా రూ. 6500-7500, బికనీర్ హెచ్పీఎస్ గింజలు 40-50 కౌంట్ రూ. 11,500, 50-60 కౌంట్ రూ.11,000, 60-70 కౌంట్ రూ. 10,800, 60-65 కౌంట్ రూ.10,900 (జిఎస్టితో) మరియు ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మార్కెట్తో పాటు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో రూ. 6800-7500, హెచ్పీఎస్ గింజలు 60 - 70 కౌంట్ తమిళనాడు డెలివరి రూ. 10,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి గత వారం 35-40 వేల బస్తాల రాబడిపై బెస్ట్ రూ.7150-7350, మీడియం రూ. 6900-7100, యావరేజ్ రూ. 6650-6800 ముంద్రా ఓడరేవు డెలివరి హెచ్పీఎస్ గింజలు 60-65 కౌంట్ బోర్డు సరుకు రూ. 10,800, 60-70 కౌంట్ రూ. 10,650, 50-60 కౌంట్ రూ. 10,950, 50-55 కౌంట్ రూ. 11,200, 40-50 కౌంట్ రూ. 11,450, 40-45 కౌంట్ రూ. 11,650, 38-42 కౌంట్ రూ. 11,850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు