దూసుకుపోతున్న వేరుశనగ ధరలు

 


 ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 23 నాటికి దేశంలో నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 49.15 ల.హె. నుండి తగ్గి 45.53 ల.హె.కు పరిమితమైంది. ఇందులో గుజరాత్ వేర సెనగ సేద్యం 19,09,678 హెక్టార్ల నుండి తగ్గి 17,09,023 హెక్టార్లకు పరిమితం కాగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ లో రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున సేద్యం భారీగా వృద్ధి చెందింది.


జోధ్ పూర్ ప్రాంతంలో జి-20 రకం, బికనీర్, జైపూర్ లో బోల్డ్ రకం సేద్యం భారీగా విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పాత సరుకు 30 వేల టన్నులు మరియు కొత్త సరుకు 40 టన్నుల సరుకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్, బినాగంజ్, ప్రతాప్ నగర్, మాధవ్ గంజ్ వేరుసెనగ సేద్యం భారీగా విస్తరించడమే కాకుండా ఇక్కడి సరుకు విత్తుల కోసం వినియోగిస్తుంటారు. గుజరాత్ తో పాటు అన్ని పొరుగు రాష్ట్రాలు విత్తుల కోసం ఇక్కడి నుండే సరుకు కొనుగోలు చేస్తుంటారు.ఈ ఏడాది రాజస్తాన్ లో సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున పంటకు ప్రయోజనం చేకూరుతున్నది. మరో పది రోజులలో పంట పక్వానికి రానున్నది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ, మైనపురి, నౌవ్ గాంవ్ ప్రాంతాలలో పంట కోతల ప్రక్రియ ప్రారంభమై కొత్త ముడి సరుకు రాబడి అవుతున్నది. గత వారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కోతల ప్రక్రియ అంతరాయం ఏర్పడింది.

ఉత్తరప్రదేశ్ లోని ఎటా, మెన్ పురి ప్రాంతాలలో 800-1000 బస్తాల యాసంగి వేరు సెనగ రాబడి కాగా ఎండు సరుకు స్థానికంగా రూ. 5800-6000, ఝాన్సీలో 2-3 వేల బస్తాలు నిమ్ము సరుకు రూ. 4000-4800 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది. 

గుజరాత్ లోని రాజ్ కోట్ లో గత వారం 15-20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నెం-39 నాణ్యమైన సరుకు రూ. 6500-6700, మీడియం రూ. 6250-6350, యావరేజ్ సరుకు రూ. 5500-5850, నెం.-24,రోహిణి ఎక్స్ ట్రా రకం రూ. 7125-7350, నాణ్యమైన సరుకు రూ. 6950-6950,మీడియం రూ. 6000-6350, యావరేజ్ సరుకు రూ. 5250-5650, జి-20 రకం రూ. 6650-6850, మీడియం రూ. 6100-6350 ప్రతి క్వింటాలు మరియు హె పి ఎస్ గింజలు ముంద్రా ఓడరేవు డెలివరి బోల్డు సరుకు 50-60 కౌంట్ రూ. 10,600, 50-55 కౌంట్ రూ. 9600, 40-50 కౌంట్ రూ. 9700, 40-45 కౌంట్ రూ. 10,200, జావా 80-90 కౌంట్ రూ. 9900, 50-60 కౌంట్ రూ. 10,100, టిజె-37 రూ. 9700, 50-60 కౌంట్ రూ. 9800, 60-70 కౌంట్ రూ. 9700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా, మిడ్నపూర్, ఖరగ్ పూర్ మరియు పరిసర ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు రూ. 5600-5800, ఆయిల్ కండిషన్ గింజలు 60-70 కౌంట్ రూ. 8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. 

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణ్ దుర్గ్,రాయ్ దుర్గ్, మడకశిర, కదిరి ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 80-90 వేల బస్తాల రాబడిపై కదిరి లేపాక్షి క్వాలిటీ రూ. 5500-6500, స్థానికంగా నాణ్యమైన సరుకు రూ. 7000-8200, 80-90 కౌంట్ (10 శాతం నిమ్ము సరుకు) రూ. 10,300-10,500, చెన్నై డెలివరి రూ. 10,300-10,500, స్థానికంగా 70-80 కౌంట్ రూ. 11,000-11,200, మహారాష్ట్ర సరుకు రూ. 11, 700, విత్తుల కోసం 60-70 కౌంట్ తెలంగాణ డెలివరి రూ. 12,500-12,700, నరసరావుపేటలో హెచ్ పిఎస్ గింజలు 70-80 కౌంట్ రూ. 11,000, 60-70 కౌంట్ రూ. 11,500, 50-60 కౌంట్ రూ. 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణ ప్రాంతం హెచ్ పి ఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 10,800- 10,900, 60-70 కౌంట్ రూ. 11,200, 90-100 కౌంట్ రూ. 10,600-10, 700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.

 కర్ణాటకలోని చిత్రదుర్గ్, హుబ్లీ, గదగ్, చెల్లకేరి, బళ్లారి,రాయిచూర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 40-50 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5900-7300, కదిరి లేపాక్షి రకం రూ. 5500-6500, చెల్లకేరిలో హెచ్ పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 11,100-11,200, 70-80 కౌంట్ రూ. 11,500-11,600, 60-70 రూ. 11,700-11,800, 80-90 కౌంట్ స్థానికంగా రూ. 11,100–11,200, 70-80 కౌంట్ రూ.11,500-11,600, 60-70 కౌంట్ రూ. 11,700-11,800 మరియు పాత సరుకు 80-90 కౌంట్ రూ. 11,000-11, 100, 70-80 కౌంట్ రూ. 11,300-11,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 రాజస్తాన్లోని బికనీర్ లో రూ. 6200-6800, హెచ్ పిఎస్ గింజలు 40-50 కౌంట్ రూ. 11,500, 50-60 కౌంట్ రూ. 10,500, 60-70 కౌంట్ రూ. 10,200, 60-65 కౌంట్ రూ. 10,300ధరతో వ్యాపారమెంది.




తగ్గిన ఖరీఫ్ వేరుసెనగ సేద్యం

 

దేశంలోని మొత్తం వేరుసెనగ ఉత్పత్తిలో సౌరాష్ట్ర భాగస్వామ్యం 65-70 శాతం ఉండగా అటు తర్వాత రాజస్తాన్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటక ఉందని సౌరాష్ట్ర నూనెమిల్లుల అసోసియేషన్ పేర్కొన్నది. అయితే, ఈసారి ఉత్పత్తి తగ్గడంతో పాటు వేరుసెనగ మరియు నూనెకు చైనా నుండి ఎగుమతి డిమాండ్ నెలకొనే అవకాశం కనిపిస్తున్నది.

ఖరీఫ్ సీజన్ లో వేరుసెనగ సేద్యం గత ఏడాదితో పోలిస్తే 48.60 ల.హె. నుండి 7.2 శాతం అనగా 3.50 ల.హె. తగ్గి 45.10 ల.హె.కు పరిమితమైందని వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ గణాంకాలలో పేర్కొన్నది. గుజరాత్ లో వేరుసెనగ సేద్యం గత ఏడాదితో పోలిస్తే 19 ల.హె. నుండి తగ్గి 17 ల.హె.కు పరిమితమైంది. పత్తి, సోయాచిక్కుడు ధరలు లాభసాటిగా ఉన్నందున వేరుసెనగ సేద్యం కుంటుపడింది. గుజరాత్ లో గత ఖరీఫ్ సీజన్ వేరుసెనగ ఉత్పత్తి 35 ల.ట.కు చేరగా ఈసారి ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి 20 శాతం తగ్గే అంచనా వ్యక్తమవుతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది.

Comments

Popular posts from this blog