ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 2 వరకు దేశంలో ముతక ధాన్యాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 171.62 ల.హె. నుండి పెరిగి 178.96 ల.హె.లకు చేరింది. ఇందులో ప్రస్తుత సీజన్లో సజ్జల విస్తీర్ణం 63.26 ల.హె. నుండి పెరిగి 70.44 లక్షల హెక్టార్లకు చేరింది. గుజరాత్ లో విస్తీర్ణం 1,64,209 హెక్టార్ల నుండి పెరిగి 1,83,347 హెక్టార్లకు చేరగా, తెలంగాణలో 313 ఎకరాల నుండి పెరిగి 997 ఎకరాలకు చేరింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో కొత్త సజ్జల రాబడులు ప్రారంభమై రూ. 2400-2500 ధరతో వ్యాపారమె పౌల్టీ పరిశ్రమల కోసం వ్యాపారమెంది.
కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 500 బస్తాల సజ్జల రాబడిపై రూ. 2600-2700ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
దేశంలో జొన్న పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 14.89 ల.హె. నుండి తగ్గి 13.92 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్ లో విస్తీర్ణం 26,713 హెక్టార్ల నుండి తగ్గి 17,079 హెక్టార్లకు చేరగా, తెలంగాణలో 57,504 ఎకరాల నుండి క్షీణించి 33,732 ఎకరాలకు చేరింది.
గత వారం గుజరాత్ లోని రాజ్ కోట్ లో 2 వేల బస్తాల రాబడిపై తెలుపు రకం నాణ్యమైన సరుకు రూ. 3625-3700, మీడియం రూ. 3450-3550,యావరేజ్ రూ. 3225-3400, ఎరుపు రకం సరుకు రూ. 3450-3705 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు మిల్క్-వైట్ స్థానికంగా రూ. 2600-2700, మహీంద్ర రకం రూ. 2500-2600, ఎరుపు రకం రూ. 3000-3200, పచ్చజొన్నలు రూ. 5700-6000 మరియు కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-400 బస్తాలు రూ. 2200-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు