బెల్లానికి కొరవడిన గిరాకీ - ధరలలో మందగమనం

 

వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది వర్షాలు సమయానికి వచ్చే అవకాశం ఉంది. మే చివరి వారం నాటికి వివాహాల సీజన్ సమాప్త మయ్యే అవకాశం కలదు. ముజఫర్ నగర్ కోల్డ్ స్టోరేజీల నుండి సరుకు రవాణా ప్రారంభమయ్యే అవకాశం కలదు. దీనితో ఇతర రాష్ట్రాల స్టాకిస్టులు బయట పడే అవకాశం కలదు. ఎందుకనగా ఇంతవరకు మహారాష్ట్రలో బెల్లం తయారీ అవుతున్నది. మహారాష్ట్రలో వారంలో సుమారు 75-80 లారీల సరుకు రాబడి అవుతుండగా, పౌడర్ యూనిట్ల సరఫరా పెరుగుతున్నది. 


కర్ణాటకలో వారంలో 100 లారీల సరుకు రాబడి అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని ఎసి ల నుండి సరుకు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. తూర్పు ఆంధ్రలో గత వారం 20-25 లారీల రైతుల సరుకు రాబడి అవుతున్నది. గుజరాత్, రాజస్థాన్ స్టాకిస్టులు తమ సరుకు విక్రయిస్తున్నందున గత వారం ఉత్పాదక కేంద్రాలలో రూ. 100-150 ప్రతి క్వింటాలుకు తగ్గుదల నమోదయింది.

 ముజఫర్ నగర్ లోని శీతలగిడ్డంగులలో 2 మే నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 15,21,996 బస్తాల నుండి 22,709 బస్తాలు పెరిగి 15,44,705 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూ బెల్లం గత ఏడాది 9,08,116 బస్తాల నుండి పెరిగి 9,18,846 బస్తాలు, కురుపా గత ఏడాది 20,575 బస్తాల నుండి పెరిగి 28,635 బస్తాలు, చదరాలు 1,11,699 నుండి పెరిగి 1,19,637 బస్తాలు, రాబిన్ 2,11,041 నుండి పెరిగి 2,67,855 బస్తాలు, లడ్డు రకం 412 నుండి పెరిగి 751 బస్తాలకు చేరింది. అయితే రస్కెట్ గత ఏడాది 63, 735 బస్తాల నుండి తగ్గి 36,820 బస్తాలు, పాపి రకం 2,04,156 బస్తాలతో పోలిస్తే క్షీణించి 1,71,002 బస్తాలకు చేరింది.

 ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1125-1345, కురుపా రూ. 1200-1240, లడ్డు రూ. 1140, 1020-1030, ,పౌడర్ బెల్లం రూ. 1230-1250, మరియు హాపూర్లో 2-3 వాహనాల బెల్లం రాబడిపై బకెట్ బెల్లం రూ. 1200-1225 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్లో గతవారం 18-20 వేల దిమ్మల రాబడిపై ఎరుపు నలుపు మిక్స్ రూ. 2800-2850, సురభి రకం రూ. 3000–3050, మరియు సోలాపూర్లో 10-12 వేల దిమ్మల రాబడిపై ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2850-2900, నాణ్యమైన రంగు బెల్లం రూ. 3100-3150 మరియు సాంగ్లీలో 14-15 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ. 3200-3400, గుజరాత్ రకం రూ. 3300-3500, ముంబై రకం రూ. 3350-3600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 20-25 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3000, సింగల్ ఫిల్టర్ రూ. 3200, డబుల్ ఫిల్టర్ రూ. 3400, చదరాలు రూ. 3750-3800, మహాలింగపూర్లో 6-7 వాహనాల రాబడి కాగా, సురభి (కేసరి రకం) రూ. 3350-3400, గుజరాత్ రకం రూ. 3450-3500, చదరాలు రూ. 3550, అరకిలో ముక్కలు రూ.3600, శిమోగాలో 10-12 వాహనాల రాబడిపై దేశీ బెల్లం రూ.3500-3550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 6-7 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ.3550-3600, మీడియం రూ. 3300-3400, నలుపు రూ.2450-2550 మరియు చిత్తూరులో 30-35 వాహనాల ఎసి సరుకు రాబడిపై లడ్డూ రకం రూ. 3500, సూపర్-ఫైన్ రూ. 4000, సాట్నా రకం రూ.3000, నలుపు రూ. 2600 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని సేలం మార్కెట్లో గతవారం 4 రోజుల లావాదేవీలలో 8 వేల బస్తాల బెల్లం రాబడిపై రూ. తెలుపు 30 కిలోలు రకం రూ. 1240-1250, సురభి రకం సరుకు రూ.1220-1230, ఎరుపు రకం రూ. 1200-1220, పిలకలపాలయంలో బుధవారం నాడు 4500 బస్తాల రాబడి కాగా, తెలుపు రకం రూ. 1180-1210, సురభి రకం రూ. 1150-1170, ఎరుపు రూ. 1120-1140 మరియు వెలూరులో గతవారం 5-6 వాహనాల బెల్లం రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 4100-4200, మీడియం రూ. 3750-3800, నలుపు రకం రూ. 2400 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog