హెచ్చుముఖం లో ధనియాల ధరలు

 



 వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రస్తుత 2021-22 సంవత్సరం రబీ సీజన్ కోసం ఉత్పత్తి తగ్గడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. దీనితో ఇంతవరకు 80-85 శాతం రైతుల సరుకు అమ్మకమయింది. సీజన్లో నిల్వ అయిన చిన్న వ్యాపారుల 50-60 శాతం సరుకు కూడా అమ్మకమయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన సరఫరా తగ్గడంతో మరియు దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రైతులు మరియు మసాలా దినుసుల వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే కొనుగోలు చేస్తున్నందున మార్కెట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, స్పెక్యులేటర్ల అంచనా ప్రకారం నవంబర్ నుండి జనవరి వరకు మార్కెట్ ధరలు పటిష్టంగా ఉండే అంచనా కలదు. దీనితో గతవారం ఎన్ సిడిఎ లో సోమవారం ధనియాల అక్టోబర్ వాయిదా రూ. 11118 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 410 పెరిగి రూ. 11528, నవంబర్ వాయిదా రూ. 204 పెరిగి రూ. 11318 తో ముగిసింది. ఈ ఏడాది అన్ని ఉత్పాదక మార్కెట్లలో ధనియాల రాబడులు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. దీనితో గత ఏడాది నిల్వలు కూడా నామమాత్రంగా ఉన్నాయి. కొత్త సీజన్ ప్రారంభం కావడానికి దాదాపు 4 నెలల సమయం ఉంది. ఎందుకనగా, అక్టోబర్, నవంబర్ నుండి పంట విత్తడం ప్రారంభమవుతుంది.


లభించిన సమాచారం ప్రకారం గుజరాత్ లో ప్రతి సంవత్సరంతో పోలిస్తే కొన్ని ప్రాంతాలలో పంట విత్తడం త్వరగా ప్రారంభ మయింది. అయితే, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ లలోని ప్రముఖ ఉత్పాదక ప్రాంతాలలో వర్షాల కారణంగా పంట సాగు 15-20 రోజులు ఆలస్యమయింది. అయితే, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి నివేదక ప్రకారం రికార్డు స్థాయిలో ఆవసాగు చేపట్టబడింది. కావున, ధనియాల విస్తీర్ణం 10-15 శాతం తగ్గవచ్చు. అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగితే సరుకు నాణ్యంగా ఉండే అవకాశం కలదు. గతవారం మర ఆడించే యూనిట్లతో పాటు కిరాణా వ్యాపారుల డిమాండ్ తో ధనియాల ధర రూ. 300-400 ప్రతిక్వింటాలు పెరిగింది. 


రాజస్తాన్ లోని రాంగంజ్ మండీలో గతవారం 9-10 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10200-10300, ఈగల్ రూ. 10500-10600, స్కూటర్ రకం రూ. 11200-11300 మరియు కోటాలో 4-5 వేల బస్తాలు,

బారలో 4 వేల బస్తాలు, భవానీమండీ, ఛబ్దా, ఇటావా తదితర మార్కెట్లలో కలిసి 2 వేల బస్తాల రాబడిపై బాదామీ యావరేజ్ రూ. 9600-9800, నాణ్యమైన సరుకు రూ. 10000-10100, ఈగల్ రూ. 10400-10500, స్కూటర్ రూ. 11000-11500 ధరతో వ్యాపారమయింది. 


మధ్య ప్రదేశ్ లోని గునాలో గతవారం  10-12 వేల బస్తాలు, కుంభరాజ్ లో 3-4 వేల బస్తాలు, నిమ లో 3 వేల బస్తాలు, ముంద సోర్, జావా, మధుసూదన్‌ఘడ్, బినాగంజ్ తదితర మార్కెట్లలో కలిసి 2-3 వేల బస్తాల రాబడిపె నాణ్యమైన బాదామీ రూ. 10000-10200, మీడియం రూ. 9500-9800, నాణ్య మైన ఈగల్ రూ. 10700-10900, మీడియం రూ. 10300-10500, స్కూటర్ రూ. 11200-11400 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


 గుజరాత్ లోని గోండల్ లో 4-5 వేల బస్తాల రాబడి పె ఈగల్ రూ. 10600-10700, నాణ్యమైన సరుకు రూ. 10800-11200, రాజకోట్‌లో రూ. 2-3 వేల బస్తాల రాబడిపె బాదామీ రూ. 9875-10200, స్కూటర్ రకం రూ. 10750 - 10900, ఆకుపచ్చ సరుకు రూ. 11000 -11250, జూనాఘడ్ లో మిషన్ క్లీన్ ఈగల్ రూ. 11500, స్కూటర్ రకం రూ. 11000, 


ఒంగోలులో బాదామీ ప్రతి 40 కిలోలు రూ. 5150, ఈగల్ కొత్త సరుకు రూ. 5250, స్కూటర్ రూ. 5400, ఎసి సరుకు రూ. 5200 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog