తగ్గిన ధనియాల ఉత్పత్తి - ధరలు పెరిగే సూచన

 

గత వారం గుజరాత్లోని గోండల్ల్లో 75-80 వేల బస్తాలు, హల్వాడ్ లో 12-14 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై స్టాకిస్టుల కొనుగోళ్లతో ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 వృద్ధి చెందిందని వ్యాపారులు తెలిపారు.ఈ ఏడాది గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాలలో భారీగా తగ్గిన ఉత్పత్తి, అడుగంటిన పాత సరుకు నిల్వలు మరియు మార్కెట్లలో ప్రతియేటా ఫిబ్రవరిలో రాబడులు పోటెత్తుతుంటాయి. అయితే, ఈసారి వారం రాబడులు కలిసి 20 శాతానికి కూడా చేరడంలేదు. రష్యా, ఉక్రెయిన్ల నుండి ధనియాల రాబడులు దేశంలోకి దిగుమతి అవుతుండేవి. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దిగుమతులను ఆశించడం వృధా ప్రయాస తప్ప ఫలితంలేదు. కావున మిషన్-క్లీన్ నాణ్యమైన సరుకు రూ. 16,000 ప్రతి క్వింటాలుకు చేరే అవకాశం కనిపిస్తున్నది.



రాజస్తాన్ మరియు మధ్యప్రదేశ్లోని ఉత్పాదక కేంద్రాల వద్ద కొత్త మరియు పాత సరుకు కలిసి కేవలం 20 వేల బస్తాల సరుకు రాబడి కాగా తక్షణమే విక్రయించబడింది. స్టాకిస్టులు రాబడి అయిన సరుకును ఏమాత్రం విడిచిపెట్టడంలేదు. తద్వారా ప్రత్యక్ష విపణిలో ధరలు దూసుకెళ్తున్నాయి. ఎనిడిఎక్స్ వద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 11,160 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 80 క్షీణించి రూ. 11,080, మే వాయిదా రూ. 80 కోల్పోయి రూ. 11,170 వద్ద ముగిసింది. 

ఏ సరుకు అయినా ధరలు విజృంభించే తరుణంలో తమిళనాడు, కేరళ వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో ఈసారి అమ్మకానికి అనుగుణంగా కొనుగోళ్లు చేపడుతున్నారు. దీనిని బట్టి తమిళనాడులో ఏడాది పొడుగునా ధనియాలకు డిమాండ్ ఉండగలదని తెలుస్తోంది. 

రాజస్తాన్లోని రామంజ్మేండిలో గత వారం 10-12 వేల బస్తాల కొత్తసరుకు రాబడిపై 10-15 శాతం నిమ్ము సరుకు రూ. 8000-10,000 మరియు 27 -28 వేల బస్తాల పాత సరుకు బాదామీ రూ. 8600-8700, ఈగల్ రూ.9200-9300, స్కూటర్ రకం రూ.9500-9600 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు 40 కిలోలు బాదామీ లారీ బిల్టి రూ. 4300, ఈగల్ రూ. 4500, బాదామీ పప్పు రూ. 4000, ఈగల్ రూ. 4100, బారన్లో 10-12 వేల బస్తాలు బాదామీ రూ. 9000-9100, ఈగల్ రూ. 9200-9300, కోటాలో ప్రతి రోజు 7-8 వేల బస్తాలు బాదామీ రూ. 8500-8600, ఈగల్ రూ. 9000-9200, స్కూటర్ రూ. 9300-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని గునా మార్కెట్లో ప్రతి రోజు 7-8 వేల బస్తాలు బాదామీ రూ. 9100-9300, ఈగల్ రూ. 9500-9600, స్కూటర్ రకం రూ. 9700-9800, కుంభరాజ్లో 2-3 వేల బస్తాలు బాదామీ రూ. 9100-9400, ఈగల్ రూ. 9400-9800, నీమచ్లో 250-300 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6500-7000, నాణ్యమైన సరుకు రూ. 7800-9000 మరియు 2000-2500 బస్తాల పాత సరుకు బాదామీ రూ. 9000-9100, ఈగల్ రూ. 92000-9300, జామ్రాలో 200-250 బస్తాల కొత్త ధనియాల రాబడిపై నిమ్ము సరుకు రూ. 7700-8500, ఎండు సరుకు రూ. 9200-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని గోండల్లో గత వారం జునాగఢ్ 8-10 వేల బస్తాలు, జేత్పూర్లో 5-6 వేల బస్తాలు, జామజోధ్పూర్ 15 వేల బస్తాలు, రాజ్కోట్లో 12-15 వేల బస్తాలు, ఇతర ప్రాంతాలలో కలిసి 7-8 వేల బస్తాలు కొత్త ధనియాల రాబడిపై 15-20 శాతం నిమ్ము సరుకు రూ. 7375-8500, 10-15 7 y 5 Jº. 9500-10,000. ఎండు సరుకు రూ. 10,500-11,200, జునాగఢ్ ఈగల్ క్లీన్ సరుకు రూ. 10,300, స్కూటర్ రకం రూ. 10,800 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. 4700, ఈగల్ రూ. 4750, స్కూటర్ రకం రూ. 4825 మరియుశీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు రూ. 4500 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog