పెరిగిన ధనియాల రాబడులు

 


లభించిన సమాచారం ప్రకారం గత వారం మధ్య ప్రదేశ్, రాజస్థాన్లలోని కొన్ని ప్రాంతాలలో వర్షాల వలన పంటకు కొంత మేర నష్టం వాటిల్లింది. విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గడంతో ఇంతవరకు రాబడులు పెరగడం లేదు. స్టాకిస్టుల కొనుగోళ్లతో సీజన్ ప్రారంభం నుండే ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి 12 లక్షల బస్తాలకు పైగా కొత్తసరుకు రాబడి కాగా, మరో 30-32 లక్షల బస్తాల సరుకు రాబడి అయ్యే అవకాశం ఉంది. స్టాకిస్టుల పాత సరుకు అమ్మకాలు తగ్గాయి. మధ్య ప్రదేశ్లోని గునా ప్రాంతంలో నిల్వ అయిన పాత నాణ్యమైన మిషన్ లారీబిల్టీ రూ. 10,600-10,700, కొత్త సరుకు రూ. 11,500–11,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది.


హోళి పండుగ తరువాత రాబడులు పెరిగే అవకాశం ఉంది. ఈ సారి రైతుల వద్ద ఎక్కువగా సరుకు నిల్వలు లేవు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కారణంగా దిగుమతులకు అవకాశం కనిపించడం లేదు. కాబట్టి భారత్ నుండి ఎగుమతులు పెరగడం, దేశీయ వినియోగం, స్టాకిస్టుల పట్టు వలన ధరలు బలపడవచ్చు. దక్షిణ భారత వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా గుజరాత్లో ఏప్రిల్ చివరి వారం నుండి రాబడులు తగ్గవచ్చు. దీనితో నాణ్యమైన రంగు సరుకు ధర పెరిగి రూ. 16,000 ప్రతి క్వింటాలు వరకు కూడా చేరవచ్చు. ఎన్సిడిఇఎక్స్లో గత సోమవారం ధనియాల ఏప్రిల్ వాయిదా రూ. 10,920 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 52 తగ్గి రూ. 10,868, మే వాయిదా రూ. 28 పెరిగి రూ. 10,966 తో ముగిసింది.


గుజరాత్లోని గోండల్లో గతవారం దాదాపు 60-70 వేల బస్తాలు, జూనాఘడ్లో 35-40 వేల బస్తాలు, జోత్పూర్లో 20-25 వేల బస్తాలు, జామ జోధ్పూర్లో 18-20 వేల బస్తాలు మరియు రాజ్కోట్లో 30-40 వేల బస్తాలు మరియు ఇతర ప్రాంతాలలో 25-30 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9500-10,600, మీడియం రూ. 9600-10,400, యావరేజ్ రూ. 8800-9100, జూనాఘడ్లో క్లీన్ ఈగల్ రూ. 10400, స్కూటర్ రూ. 10900 ధరతో వ్యాపారమయింది.


రాజస్తాన్లోని రాంగంజ్ మండీలో వారంలో 40-42 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై బాదామీ రూ. 7200-7600, ఎండు సరుకు రూ. 9100-9200, ఈగల్ నిమ్ము సరుకు రూ. 8000-8600, ఎండు సరకు రూ. 10,00-10,300 మరియు 9-10 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 8700-8800, ఈగల్ రూ. 9200-9300, స్కూటర్ రూ. 9500-9600 లోకల్ లూజు మరియు ప్రతి 40 కిలోలు లారీ బిల్టీ బాదామీ రూ. 4300, ఈగల్ రూ. 4400, ధనియాల పప్పు బాదామీ రూ.4100, ఈగల్ రూ. 4200 ధరతో వ్యాపారమయింది మరియు బారన్లో 5-6 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము రకం రూ. 7000-80000, ఎండు రకం రూ. 9000.9500, మరియు 4-5 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 200-300, ఈగల్ రూ.9400-9500, కోటాలో 5-6 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై నిమ్ము రకం రూ. 7000-7500, ఎండు సరుకు 9500-10,000, 1500-2000 బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 8800-9100, ఈగల్ రూ. 9200-9300, స్కూటర్ రూ. 9350-9500 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


మధ్యప్రదేశ్లోని గునాలో గతవారం 6-7 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై రూ.6500-9500 మరియు 2-3 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 9000-9300, ఈగల్ రూ. 9400-9500 మరియు కుంభరాజ్లో 5-6 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై నిమ్ము రకం రూ. 7500-8000, ఎండురకం రూ. 900-10,000 మరియు 1200-1500 బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 9100-900, ఈగల్ రూ.9300-9500 మరియు బినాగంజ్లో 8-10 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై ఈగల్ నిమ్ము రకం రూ. 8000-8500, ఎండు రకం రూ. 10,300-10400 మరియు మధుసూదన్ ఘడ్ లో 2000-2500 బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము రకం బాదామీ రూ. 7200-8000, ఎండు సరుకు రూ. 9200-9500, నీమచ్లో 6-7 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 7500-9500 మరియు 3-4 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 9000 - 9200, ఈగల్ రూ. 9300-9400, జావ్రాలో 3-4 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము రకం రూ. 6500-7000, ఎండు రకం రూ. 9200-9500 లోకల్ ల వ్యాపారమయింది. ఒంగోలులో బాదామీ రూ. 4600, ఈగల్ రూ. 4800, స్కూటర్ రూ. 4900 మరియు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన సరుకు రూ. 4650 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం