గత వారం గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మార్కెట్లలో రాబడులు తగ్గినందున చిన్న మరియు మధ్య తరగతి రైతుల సరుకు అమ్మకం అయినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేవలం పెద్ద రైతుల వద్ద సరుకు నిల్వలు ఉన్నాయి. మర ఆడించే యూనిట్లు మరియు స్టాకిస్టులు సరుకు కొనుగోలు చేస్తున్నందున గత వారం మార్కెట్ ధరలు రూ. 200-300 పెరగగా, ఏప్రిల్ వాయిదా రూ. 148 వృద్ధిచెందింది. దీనితో వాయిదా డెలివరి చేసేవారి గట్టిపట్టు ఉన్నట్లు అంచనా వేయబడుతున్నది. వచ్చేవారం రాబడులు తగ్గితే, ధరలు నిరవధికంగా పెరిగే అవకాశం కలదు.
గత వారంఎన్ సిడిఇఎక్స్ వద్ద సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 12,302 తో ప్రారంభమైన తరువాత బుధవారం వరకు రూ. 148 పెరిగి రూ. 12,450, మే వాయిదా రూ. 60 పెరిగి రూ. 12,580 వద్ద ముగిసింది.
ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు ప్రాంతంలో బాదామీ రకం రూ. 5600, కొత్త ఈగల్ రకం రూ. 5650, స్కూటర్ రకం రూ.5750,శీతలగిడ్డంగులలో నిల్వ చేసిన సరుకు రూ. 5400 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని వ్యాపారులు మహారష్ట్రలో గత నాలుగేళ్ల క్రితం నిల్వ చేసిన ధనియాలు మదురై ప్రాంతం డెలివరి రూ. 5400 ధరతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నందున ప్రస్తుతం ధనియాల భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండే అంచనా కలదు.లభించిన సమాచారం ప్రకారం గుజరాత్లో ఉత్పత్తి సుమారు 60 శాతం అనగా 27 లక్షల సరుకు రాబడి అయింది. తద్వారా ధరలు 15000-16,000కు సులభంగా చేరగలవనే అంచనా వేస్తున్నారు.
రాజస్తాన్లోని రామంజ్మండిలో గత సోమ, మంగళ, బుధ మరియు శుక్రవారం కలసి సుమారు 90 వేల బస్తాల సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 11,500-11,800, ఈగల్ రూ. 12,000-12,400, స్కూటర్ రకం రూ. 12,600-12,800 ప్రతి క్వింటాలు లోకల్లూజ్ మరియు ప్రతి 40 కిలోలు లారీబిల్టీ బాదామీ రూ. 5200, ఈగల్ రూ.5600, ధనియాల పప్పు రూ. 13,000 మరియు బారన్లో సోమ వారం నుండి బుధవారం వరకు 10-12 వేల బస్తాలు, కోటాలో రూ. 4-5 వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 6-7 వేల బస్తాల సరుకు రాబడి కాగా, లోకల్లో బాదామీ రకం రూ. 10,500-11,000, ఈగల్ రూ. 10,200-11,000, స్కూటర్ రకం రూ. 12,000-13,200 ధరతో వ్యాపారమైంది.
మధ్య ప్రదేశ్ లోని గునా మార్కెట్లో గత సోమవారం నుండి బుధవారం | వరకు 40-45 వేల బస్తాలు, కుంభరాజ్ 45-50 వేల బస్తాల సరుకు రాబడి పై బాదామీ రూ. 10,500-10,900, ఈగల్ రూ. 11,400-11,800, స్కూటర్ రకం రూ. 12,000–12,500 మరియు బీనాగం 15-16 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై ఈగల్ రూ. 11,000-11,200, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 13,000 మధుసుదన్ ఘడ్ 10-12 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,200-10,500, ఈగల్ రూ. 10,600-10,700, స్కూటర్ 11,500-12,000 మరియు నీమచ్లో 3-4 వేల బస్తాలు, జావ్రాలో 7 కొత్త ధనియాల రాబడి కాగా, బాదామీ రూ. 10,500-11,000, ఈగల్ రూ. 11,500-12,000, ఆకుపచ్చ సరుకు | రూ. 12500-13,000 లోకల్ లూజ్ ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.
గుజరాత్లోని జూనాఘడ్లో గత వారం 5-6 వేల బస్తాలు ధనియాలు రాబడి కాగా, నాణ్యమైన ఈగల్ రూ. 11,900–12,600, మీడియం రూ. 11,200-11,500, స్కూటర్ రకం రూ. 12,500–12,700, మషీన్ క్లీన్ ఈగల్ రూ. 12,300, స్కూటర్ రకం | రూ. 12,900, మరియు రాజ్కోట్లో 4-5 వేల బస్తాలు, జామ్నగర్లో 3-4 వేల బస్తాల రాబడి కాగా, బాదామీ రూ. 11,000-11,300, ఈగల్ రూ. 11,500-11,900, స్కూటర్ రకం రూ. 12,000–12,250, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 12,400-12,750 మరియు గోండల్లో దిన 12-15 వేల బస్తాల సరుకు అమ్మకంపై స్కూటర్ రకం రూ. 13,200 - 13,400, మీడియం రూ. 13,000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు లావురకం రూ. 13,600, సన్నరకం రూ. 13,900, ఆకుపచ్చ సరుకు రూ. 14,500-15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు