మందగమనంలో ధనియాల ధరలు

 

  మధ్య ప్రదేశ్ లోని జావ్రా మరియు పరిసర ప్రాంతాలలో , ధనియాల సేద్యం నత్తనడకన సాగుతున్నది. మరో వారం పది రోజులలో , రాజస్తాన్, గుజరాత్ లో ప్రారంభం కానున్నది. తద్వారా గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద కొనుగోళ్లు డీలా పడినందున ధనియాల ధరలు తగ్గి మందగనంలో చలిస్తున్నాయి.


గత సోమవారం ఎన్ సిడిఇఎక్స్ వద్ద ధనియాల అక్టోబర్ వాయిదా రూ. - 10,832 తో ప్రారంభ మై శుక్రవారం నాటికి రూ. 262 నష్టంతో రూ.10,570, నవంబర్ వాయిదా రూ. 304 తగ్గి రూ. 10,762 వద్ద ముగిసింది. అయితే, కొత్త సీజన్ ప్రారంభం కావడానికి మరో నాలుగు నెలల సమయం ఉన్నందున ధరలు ఊపిరి పోసుకునే అవకాశం ఉంది. మధ్య ప్రదేశ్ లోని - గునాలో 1500-2000 బస్తాలు బాదామీ రూ. 9500-9800, ఈగల్  నాణ్యమైన సరుకు రూ. 10,400-10,500, మీడియం 10,000-10,200, కుంభరాలో 1000-1200 బస్తాలు బాదామీ రూ. 9800- 10,100, ఈగల్ రూ. 10,300-10,400, స్కూటర్ రకం రూ. 10,800- 11,000, నిమచ్, మందహార్, జావ్రా ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాలు బాదామీ నాణ్యమైన సరుకు రూ. 10,000-10, 100, మీడియం రూ. 9500-9800, ఈగల్ రూ. 10,500-10,700, మీడియం రూ. 10,300-10,400 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమెంది.


రాజస్తాన్లోని రాంగం మండిలో గత వారం 17-18 వేల బస్తాల రాబడి పై బాదామీ రూ. 10,000-10, 100, ఈగల్ రూ. 10,500-10,600, స్కూటర్ రకం రూ. 10,800-11,000, బారన్లో 6-7 వేల బస్తాలు బాదామీ రూ. 9800-10, 000, ఈగల్ రూ. 10,400-10,500, కోటాలో 4-5 వేల బస్తాలు బాదామీ మీడియం సరుకు 9000-9200, ఈగల్ రూ. 9500-9700, భవానీమండీ, ఛబ్దా, ఇటావా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాలు బాదామీ రూ. 10,000-10,200, ఈగల్ రూ. 10,300-10,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.

గుజరాత్ లోని గోండ లో గత వారం 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై ఈగల్ రూ. 10,300-10,500, నాణ్య మైన సరుకు రూ. 10,600-10,800, స్కూటర్ రకం రూ. 11,200-11,400, రాజ్ కోట్, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాలు బాదామీ రూ. 9750-10,000, ఈగల్ రూ. 10,100-10,600, స్కూటర్ రకం రూ. 10,750-11,000, జునాగఢ్ లో ఈగల్ మిషన్-క్లీన్ రూ. 10,800, స్కూటర్ రకం రూ. 11,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. 4950, ఈగల్ కొత్త సరుకు రూ. 5100, స్కూటర్ రకం రూ. 5200, ఎసి సరుకు రూ. 5100 ధరతో వ్యాపారమైంది.





Comments

Popular posts from this blog