ధనియాలకు కొరవడిన గిరాకీ

 

గతవారం ధనియాల ఉత్పాదక కేంద్రాలలో స్వల్పంగా వర్షాలు కురవడంతో రెత్తులు సోయాబీన్, పత్తి పంటల సాగులో నిమగ్నం కావడంతో మార్కెట్లలో ధనియాల రాబడులు క్షీణించాయి. ప్రస్తుతం దక్షిణ భారత వ్యాపా రులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ఆగస్టు చివరి వారం నుండి ధరలు బలోపేతం చెందగలవని వ్యాపారులు అంచనా వేస్తు న్నారు. అంతవరకు యూనిట్ల వద్ద కూడా సరుకు నిల్వలు తగ్గగలవు. పండుగల సీజన్లో మసాలా దినుసుల వినియోగం అధికంగా ఉంటుంది. దీనితో పెద్ద రెత్తులు తక్కువ ధరతో సరుకు విక్రయించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రాజస్తాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్లలో రైతుల వద్ద నిల్వలు తగ్గాయి. దీనితో మార్కెట్లలో రాబడులు తగ్గడంతో ధరలు నిలకడగా మారాయి.


గత సోమవారం ఎన్ సిడిఇఎక్స్ వద్ద ధనియాల జూన్ వాయిదా రూ. 10,922 తో ప్రారంభ మై సాయంత్రం వరకు రూ. 18 వృద్ధిచెంది రూ. 10,940 వద్ద సమాప్తమైంది. జూలె వాయిదా సోమవారం నాడు రూ. 11,398తో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి రూ. 314 తగ్గి రూ. 11,084,ఆగస్టు వాయిదా రూ. 322 క్షీణించి రూ. 11,166 వద్ద ముగిసింది. రాజస్తాన్లోని రాంగంజ్మండీ లో వారం 9-10 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,000-10,400, ఈగల్ రూ. 10,800-11,000, స్కూటర్ రకం రూ. 11,500-11,800 ప్రతి క్వింటాలు లోకల్ లూజు మరియు లారీ బిల్టీ ప్రతి 40 కిలోల బస్తా బాదామీ రూ. 4800, ఈగల్ రూ. 5000, బారన్లో 4-5వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,000-10,300, ఈగల్ రూ. 10,500-10,700, కోటాలో 6-7 వేల బస్తాలు బాదామీ రూ.9500 9800, ఈగల్ రూ. 10,000–10,200, భవానీమండీ, ఛబ్జా, ఇటావా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 9800-10,200, ఈగల్ రూ. 10,500-10,800, స్కూటర్ రూ. 11,500–11,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. 

మధ్య ప్రదేశ్లోని గునాలో గత వారం 6-7 వేల బస్తాల రాబడి కాగా, బాదామీ రూ. 9500 -10,000, ఈగల్ రూ. 10,500-11,000, స్కూటర్ రకం రూ. 11,500-12,000 మరియు కుంభరాజ్లో 5-6 వేల బస్తాలు బాదామీ రూ. 10,300–10,500, ఈగల్ రూ. 10,800-11,000, స్కూటర్ రకం రూ. 11,500-11,700, బీనాగంజ్లో 3 వేల బస్తాల రాబడిపై ఈగల్ రూ. 10,500-10,600, స్కూటర్ రకం రూ. 11,000-11,500, ప్యారట్-గ్రీన్ రూ. 12,000-12,200, శ్యామ్ గఢ్, నిమచ్, మందసోర్, జావ్రా ప్రాంతాలలో కలిసి 5 -6 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 9800-10,300, ఈగల్ రూ. 10,500- 11,000 లోకల్ లూజు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్, జామ్నగర్, జునాగఢ్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 10-12 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,350 - 10,550, ఈగల్ రూ. 10,625-10,750, స్కూటర్ రూ. 11,950 - 11,125, ప్యారట్-గ్రీన్ రూ. 11,250–11,625, జూనాగఢ్ మిషన్-క్లీన్ ఈగల్ రూ. 11,400, స్కూటర్ రకం రూ. 11,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు