వ్యాపారస్తుల కథనం ప్రకారం సోమవారం నుండి దేశంలోని అన్ని ఉత్పాదక మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశం కలదు. ఎందుకనగా గత 5-6 సంవత్సరాల తరువాత మొదటిసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీనితో రెత్తులకు మొత్తం సరుకు విక్రయించే అవకాశం కలదు. వాయిదా ధరలను పరిగణలోకి తీసుకుంటే ఏప్రిల్ మొదటివారంలో రికార్డు రాబడులు ఉండగలవు. తరువాత రాబడులు తగ్గి జూన్ 15 వరకు సీజన్ సమాప్తం అయ్యే అవకాశం కలదు.
గత వారంఎన్సీడిఇఎక్స్ వద్ద సోమవారం నుండి ఏప్రిల్ వాయిదా రూ.10,820 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 1000 పెరిగి రూ. 11,820, మే వాయిదా రూ. 1020 పెరిగి రూ. 11,960 వద్ద ముగిసింది.
గత శుక్రవారం నాడు గుజరాత్లోని గోండల్లో 65 వేల బస్తాల ధనియాలు రాబడి కాగా, రూ. 500-700 ప్రతి క్వింటాలుకు వృద్ధిచెంది ఈగల్ రూ. 10,000-10,500, నాణ్యమైన ఈగల్ రూ. 10,500-11,000, స్కూటర్ రకం రూ. 11,200-11,500 మరియు జూనాఘడ్లో 4 వేల బస్తాల రాబడి కాగా, ఈగల్ రూ. 10,400-10,700, నాణ్యమైన ఈగల్ రూ. 11,200-12,800, ఆకుపచ్చ సరుకు రూ.13,000, క్లీన్ ఈగల్ రూ. 10,500, స్కూటర్ రకం రూ. 11,000 ధరతో వ్యాపారమెంది.
రాజస్తాన్లోని రామంజ్మిండిలో గత సోమవారం నుండి బుధవారం వరకు సుమారు 90 వేల నుండి 1 లక్ష బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 9500-10,100, ఈగల్ రూ. 10,900-11,000, స్కూటర్ రకం రూ. 11,300–11,600 మరియు బారన్లో 6-7 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 9500-9600, ఈగల్ రూ. 10,000-10,500 మరియు కోటాలో 5-6 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 9500-9600, ఈగల్ రూ. 10,000-10,200, స్కూటర్ రూ. 11,000-11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని గునా మార్కెట్లో గత వారం 15 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ.9200-9500, ఈగల్ రూ. 9800-10,200, ఎండు సరుకు రూ. 11,000-11,500, కుంభరాజ్ 40-45 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 9300-9500, ఈగలూ. 9800-10,100, స్కూటర్ రకం రూ. 10,500-10,700 మరియు నిమ 4–5 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై బాదామీ రూ. 9900-10,100, ఈగల్ ధరతో లోకల్లూజ్ వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు మార్కెట్లో ప్రతి 40 కిలోలు బాదామీ రూ. 4825, ఈగల్ రూ. 4875, స్కూటర్ రకం రూ. 4950 మరియు శీతలగిడ్డంగులలో నిల్వ చేసిన సరుకు రూ. 4750 ధరతో వ్యాపారమెంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు