లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది దేశంలో ధనియాల ఉత్పత్తి తగ్గడంతో పాటు పాత సరుకు నిల్వలు కనీస స్థాయికి చేరాయి మరియు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతికి అవకాశాలు లేవు. అంతేకాకుండా, ఉక్రెయిన్ నుండి ఇతర దేశాలకు ఎగుమతుల స్థానంలో భారతీయ ధనియాల ఎగుమతికి అవకాశమున్నందున పెద్ద స్టాకిస్టులు మార్కెట్కు చేరుతున్నారు. ఎందుకనగా, ఈ ఏడాది ధర పెరిగి రూ. 14000-15000 వరకు చేరవచ్చని వీరు అంచనా వేస్తున్నారు. దీనితో దేశంలో రిటైల్ గా విక్రయించే కిరాణావ్యాపారులు చురుకుగా మారుతున్నారు.
అయితే, రాజస్తాన్ రైతులు ఆవాల అమ్మకంలో నిమగ్నమై ఉన్నందున ధనియాల రాబడులు పెరగడంలేదు. ఎన్సిడిఇఎక్స్ గత సోమవారం ధనియాల ఏప్రిల్ వాయిదా రూ. 11,092 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 108 తగ్గి రూ. 10,984, మే వాయిదా రూ. 154 పెరిగి రూ. 11,114 తో ముగిసింది. రాజస్తాన్లోని రాంగంజ్ మండీలో వారంలో 34-35 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై బాదామీ రూ. 7400-7900, ఈగల్ రూ. 8400-9400, స్కూటర్ రూ. 1000-11000 మరియు 12-14 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 8500-8600, ఈగల్ రూ. 9000-9500, స్కూటర్ రూ. 9600-9700 లోకల్ లూజు మరియు ప్రతి 40 కిలోలు లారీ బిల్జీ బాదామీ రూ. 4250, ఈగల్ రూ. 4450, ధనియాల పప్పు బాదామీ రూ.4000, ఈగల్ రూ. 4100 ధరతో వ్యాపారమయింది మరియు బారన్లో 5-6 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 9000-9200, ఈగల్ రూ. 9400-9500, కోటాలో 1000-1200 బస్తాల కొత్త ధనియాల రాబడిపై నిమ్ము రకం రూ. 8000-9800, 2000-2500 బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 8800-9000, ఈగల్ రూ. 9100-9200, స్కూటర్ రూ. 9300-9500 ధరతో వ్యాపారమయింది.
మధ్య ప్రదేశ్ లోని గునాలో గతవారం 1000-1200 బస్తాల కొత్త ధనియాల రాబడిపై రూ. 7500-9000 మరియు 3-4 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 9000-9300, ఈగల్ రూ. 9400-9600 మరియు కుంభరాజ్లో 1500 బస్తాల కొత్త ధనియాల రాబడిపై నిమ్ము రకం రూ. 7000-7600, ఎండురకం రూ. 9500-10500 మరియు 1000-1200 బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 100-900, ఈగల్ రూ. 9400-9699 మరియు బినాగంజ్లో 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై ఈగల్ నిమ్ము రకం రూ. 8000-9000, ఎండు రకం రూ. 10000-10200 మరియు మధుసూదన్ ఘడ్ లో 3000 బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము రకం బాదామీ రూ. 7000, ఈగల్ రూ. 7500 మరియు నీమల్లో 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ.7000-9000 మరియు 5-6 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 9000-9300, ఈగల్ రూ. 9400-9600, జావ్రాలో 800-1000 బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము రకం రూ. 7000-7500, ఎండు రకం రూ. 9500-10000 ధరతో వ్యాపారమయింది.
గుజరాత్లోని గోండల్లో గతవారం దాదాపు 75-80 వేల బస్తాలు, జూనాఘడ్లో60-65 వేల బస్తాలు, జోత్పూర్లో 20 వేల బస్తాలు, జామజోధ్పూర్లో 25-27 వేల బస్తాలు మరియు రాజ్కోట్లో 85-90 వేల బస్తాలు మరియు ఇతర ప్రాంతాలలో 30-35 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై 15-20 శాతం నిమ్ము సరుకు రూ. 7500-8625, ఎండురకం ఈగల్ రూ. 9125-9750, ఈగల్ ఎండు రంగు సరుకు రూ. 9875-10250, సన్నరకం రూ. 11500-12500, జూనాఘడ్లో క్లీన్ ఈగల్ రూ. 1000, స్కూటర్ రూ. 10900 ధరతో వ్యాపారమయింది.
ఒంగోలులో బాదామీ రూ. 4750, ఈగల్ రూ. 4850, స్కూటర్ రూ. 4950 మరియు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన సరుకు రూ. 4775 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు