ధనియాలపై కమ్ముకుంటున్న నీలినీడలు
మధ్య ప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 2.50 లక్షల బస్తాలు, గుజరాత్ మరియు రాజస్తాన్లో 2 లక్షల బస్తాలు, ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో 50 వేల బస్తాలకు పైగా ధనియాల రాబడి అయింది. మసాలా గ్రైండింగ్ : యూనిట్ల కొనుగోళ్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నాయి. అయితే అన్ని రకాల సరుకు స్టాకిస్టు వ్యాపారుల కొనుగోళ్ల వలన ధర ప్రతి క్వింటాలుకు కేవలం రూ. 150-200 హెచ్చు-తగ్గులతో సరుకు విక్రయించబడుతున్నది. మసాలా యూనిట్ల కొనుగోళ్లు మరో రెండు వారాలలో సమాప్తం కాగలవు. దీనిని బట్టి సమీప భవిష్యత్తులో ధరలకు మందగమనం పొడసూపగలదని స్పష్టమవుతున్నది. ఈసారి రైతులు సరుకు నిల్వచేసే బదులు విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో 2024 సీజన్ కోసం సేద్యం కుంటుపడే అవకాశం కనిపిస్తున్నది.
గత సోమవారం ఎన్ఎసిడిఇఎక్స్ వద్ద మే వాయిదా రూ. 6458 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 72 వృ ద్ధి చెంది రూ. 6530, జూన్ వాయిదా రూ. 38 లాభంతో రూ. 6590 వద్ద స్థిరపడింది.
రాజస్తాన్లోని రామంజేండిలో గత వారం 1.25 లక్షల బస్తాలు రాబడి కాగా బాదామీ రూ.5700-5800, పప్పు రూ. 6000, ఈగల్ రూ. 6200-6600, పప్పు రూ. 6400, కోటాలో 15-16 వేల బస్తాలు బాదామీ రూ. 5200-5500, ఈగల్ రూ. 5600-5700, బారన్లో 18-20 వేల బస్తాలు బాదామీ రూ. 5300-5400, ఈగల్ రూ. 5800-5900, భవానీమండీ, ఛబ్దా మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 15-20 వేల బస్తాలు నిమ్ము సరుకు రూ.5200-5600, ఈగల్ రూ. 6000-6300 మరియు
మధ్య ప్రదేశ్లోని గునాలో 70-80, కుంభరాజ్ 80-85, బినాగంజ్ 20-22, మధుసూదనఢ్ 15-19, నీమచ్ 14-15,మందసోర్ 5–6, జావ్లో 2 -3 మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 15-20 వేల బస్తాలు బాదామీ యావరేజ్ సరుకు రూ. 4500-5000, నాణ్యమైన సరుకు రూ.5200-5300, ఈగల్ రూ. 5600-6000, స్కూటర్ రకం రూ. 6500-6800, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ.8000-9500, మీడియం రూ.7000-7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
గుజరాత్లోని గోండల్ మార్కెట్లో గత సోమవారం 50-60 బస్తాల రాబడిపై నిమ్ము సరుకు రూ. 5200-5700, ఈగల్ ఎండు సరుకు రూ. 6000-6500, స్కూటర్ రకం 6800-7000, రాజ్కోట్లో 15-16 వేల బస్తాలు బాదామీ రూ. 5250-5750, ఈగల్ రూ. 5875-6075, స్కూటర్ రకం రూ. 6150-6400, రంగు సరుకు రూ. 7000-9500, జైత్పూర్, జునాగఢ్, అమ్రేలిలో 15-16 వేల బస్తాలు ఈగల్ రూ. 6000-6200, స్కూటర్ రకం రూ. 6500-7000, ప్యారట్ గ్రీన్ రూ. 8000-8500, జునాగఢ్ ఈగల్ క్లీన్ సరుకు రూ. 6550, స్కూటర్ రకం రూ.7150, జామ్నగర్ ప్రతి రోజు 5-6 వేల బస్తాలు మీడియం సరుకు రూ. 5800-6200, సన్న సరుకు రూ. 7500-8500 ప్రతి క్వింటాలు మరియు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. 3050, ఈగల్ కొత్త సరుకు రూ. 3100, స్కూటర్ రకం రూ. 3225 ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు