తగ్గిన ధనియాల రాబడులు - ధరలు స్థిరం

 

వ్యాపారస్తుల కథనం ప్రకారం గతవారం రాజస్థాన్, మధ్య ప్ర దేశ్ మార్కెట్లలో రాబడులు తగ్గి వారంలో 2.50 లక్షల బస్తాలు, గుజరాత్లో 60-70 వేల బస్తాల ధనియాల రాబడిపై సాధారణ గిరాకీ కారణంగా ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం కలదు. ఎందుకనగా గుజరాత్లో ఉత్పత్తి అయిన 60 శాతం సరుకు అమ్మకం అయింది.


రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఉత్పత్తి తగ్గడంతో సీజన్ ప్రారంభం నుండే ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. ఈ ఏడాది ఈగల్ ధనియాల ధర రూ. 15,000-16,000 వరకు చేరవచ్చు. ఎందుకనగా పాత సరుకు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. యుద్ధం కారణంగా దిగుమతులకు అవకాశాలు తగ్గాయి. అయితే ఎగుమతులు పెరిగే అంచనా కలదు. గత వారంఎన్సీడిఇఎక్స్ వద్ద సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 12,370 తో ప్రారంభమైన తరువాత బుధ వారం వరకు రూ. 446 తగ్గి రూ. 11,924 వద్ద ముగిసింది. మే వాయిదా సోమవారం రూ. 12,570తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 36 క్షీణించి రూ. 12,534, జూన్ వాయిదా శుక్రవారం రూ.12,660తో ప్రారంభమై సాయంత్రం వరకు రూ. 4 తగ్గి రూ. 12,656 వద్ద ముగిసింది. 

ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో బాదామీ రూ.5500, కొత్త ఈగల్ రకం రూ. 5600, స్కూటర్ రకం రూ. 5675, ఎసి సరుకు  రూ. 5400 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది. గత వారం రామ్ గంజ్మండీలో గత వారం 55 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 11,200-11,500, ఈగల్ రూ. 12,000-12,300, స్కూటర్ రకం రూ. 12,500–12,800 ప్రతి క్వింటాలు లోకల లూజ్ మరియు ప్రతి 40 కిలోలు లారీబిల్టి బాదామీ రూ. 5100, ఈగల్ రూ. 5500, ధనియాల పప్పు ఈగల్ రకం రూ. 13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరియు బారన్లో 8–10వేల బస్తాలు, కోటాలో 10-12 వేల బస్తాలు, పరిసర అన్ని మార్కెట్లలో కలిసి 15-20 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,500-10,800, ఈగల్ రూ. 11,500-11,800, స్కూటర్ రూ. 12,500–13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మధ్య ప్రదేశ్లోని గునా మార్కెట్లో గత వారం 45-50 వేల బస్తాలు, కుంభరాజ్ 35-40 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై బాదామీ రూ. 10,200-10,300, ఈగల్ రూ. 11,000-11,400, స్కూటర్ రకం రూ. 12,000-12,500, బీనాగండ్లో  10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై బాదామీ రూ. 9500-10,000, ఈగల్ రూ. 10,800–11,000, స్కూటర్ రూ. 11,500, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 12,500-14,000, మధుసుదన్ ఘడ్లో 15 వేల బస్తాల రాబడిపై రూ. 10,200-10,500, ఈగల్ రూ. 10,800-11,000, స్కూటర్ ర. 11,500-12,500 మరియు నీమచ్లో 6-7 వేల బస్తాలు, జావ్రాలో 800-1000 బస్తాల కొత్త సరుకు రాబడిపై బాదామీ రూ. 9500-10,500, ఈగల్ రూ. 11,500-12,000, ఆకుపచ్చ సరుకు రూ. 13,000-13,800 లోకల్ లూజ్ ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. 

గుజరాత్లోని జూనాఘడ్లో గత వారం 6-7 వేల బస్తాల ధనియాలు రాబడి కాగా, నాణ్యమైన ఈగల్ రూ. 11,700-12,600, మీడియం రూ. 11,400-11,500, స్కూటర్ రూ. 12,500-12,700, మిషన్ క్లీన్ ఈగల్ రకం రూ. 11,700 మరియు రాజ్కోట్లో 10-12 వేల బస్తాలు, జామ్నగర్లో 4-5 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 11,150–11,300, ఈగల్ రూ. 11,300-11,600, స్కూటర్ రకం రూ. 11,750-12,000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 12,050 -12,350 మరియు గోండల్లో దినసరి 10-12 వేల బస్తాల అమ్మకంపై స్కూటర్ రకం రూ. 13,000-13,200, మీడియం రూ. 12,800, ప్యారెట్ గ్రీన్ లావురకం సరుకు రూ. 13,500, సన్నరకం ఆకుపచ్చ సరుకు రూ. 13,800, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 14,200-14,800 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog