ధనియాలలో మందగమనం

 


 గత వారం భారీ వర్షాల వలన మార్కెట్లలో గిరాకీ లేనందున మార్కెట్ ధరలు రూ. 300-400 తగ్గడంతో గత సోమవారం ఎన్సిడిఇఎక్స్ వద్ద ధనియాల ఆగస్టు వాయిదా రూ 11,930తో ప్రారంభమైన తరువాత శుక్ర వారం నాటికి రూ. 460 తగ్గి రూ. 11,470, సెప్టెంబర్ వాయిదా రూ. 464 క్షీణించి రూ. 11,536 వద్ద ముగిసింది. 


ఆంధ్రలోని ఒంగోలు ప్రాంతంలో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. 100 తగ్గి రూ. 5400, ఈగల్ కొత్త సరుకు రూ. 5450, స్కూటర్ రకం రూ.5550, ఎసి సరుకు రూ. 5250 ధరతో వ్యాపారమెంది. 

రాజస్తాన్లోని రాంగంజ్మండీలో గత వారం 18-20 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,400 -10,500, ఈగల్ రూ. 10,700– 11,000, స్కూటర్ రకం రూ. 11,800 -12,000 ప్రతి క్వింటాలు మరియు లారీ బిల్టి ప్రతి 40 కిలోలు బాదామీ రూ. 5100, ఈగల్ రూ. 5400 ధరతో వ్యాపారమైంది. బారన్ మార్కెట్లో గతవారం 7-8 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,000-10,100, ఈగల్ రూ. 10,500-11,000, కోటాలో 6-7 వేల బస్తాల రాబడిపై మీడియం బాదామీ రూ. 10,000- 10,200, ఈగల్ రూ. 10,500 -10,800, భవానీమండీ, ఛబ్జా, ఇటావా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,000– 10,200, ఈగల్ రూ. 10,500-10,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్యప్రదేశ్లోని గునాలో 8-10 వేల బస్తాల ధనియాల రాబడి కాగా, బాదామీ రూ. 10,200-10,600, ఈగల్ రూ. 11,000-11,500, కుంభరాజ్ 1500-2000 బస్తాలు నాణ్యమైన బాదామీ రూ. 10,000-10,500, ఈగల్ రూ. 11,200-11,300, స్కూటర్ రకం రూ.11,500-11,800 మరియు శ్యామఢ్, మధుసూదన్ ఘడ్, నిమచ్, మందసోర్, జాప్తా ప్రాంతాలలో కలిసి 5-6 వేల బస్తాల రాబడిపై బాదామీ - రూ. 10,400 -10,500, ఈగల్ రూ. 10,700- 10,800, స్కూటర్ రూ. 11,000 –11,500 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. 

గుజరాత్లోని గోండల్ మార్కెట్లో గత వారం 7-8 వేల బస్తాల రాబడి నాణ్యమైన ఈగల్ రూ. 11,000-11,250, స్కూటర్ రకం రూ.11,500-11,750, రాజ్ కోట్లో 3-4 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 11,100-11,250, నాణ్యమైన ఈగల్ రూ. 11,375–11,650, స్కూటర్ రూ. 11,800-11,850, ప్యారెట్ గ్రీన్ రూ. 12,000-12,250 మరియు జామ్నగర్, జునాగఢ్, బేటా పూర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 1500 - 2000 బస్తాల రాబడిపై నాణ్యమైన ఈగల్ రూ.11,200-11,500, మీడియం రూ. 10,800 -11,000, స్కూటర్ రూ. 11,800- 12,000, జూనాగఢ్ మిషన్-క్లీన్ ఈగల్ రూ. 11,700, స్కూటర్ రకం రూ. 12,200 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు