గుజరాత్లో రికార్డు స్థాయిలో ధనియాల రాబడులు



 గత వారం గుజరాత్లో రికార్డు స్థాయిలో ధనియాలు రాబడి కాగా, సీజన్ ప్రారంభం నుండి ఇంతవరకు 18 లక్షల బస్తాలకు పైగా సరుకు  అమ్మకం అయింది. ధరలు ఆకర్షణీయంగా ఉండడంతో రైతులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. మరియు ధరలు తగ్గే అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఉత్పత్తి తగ్గడంతో రాబడులు పెరగడం లేదు.  స్టాకిస్టులు ఎక్కువగా గుజరాత్ నుండి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకనగా ప్రస్తుతం ఎండు సరుకు రాబడి అవుతున్నది. తద్వారా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మార్కెట్లలో ధరలు రూ. 150-200 ప్రతి క్వింటాలుకు పెరిగాయి.


ఎన్సిడిఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 10,820 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 170 క్షీణించి రూ. 10,650, 3 మే వాయిదా రూ. 182 కోల్పోయి రూ. 10,750 వద్ద ముగిసింది.


ఉత్పాదక కేంద్రాలలో పాత సరుకు రాబడి సమాప్తం కావడంతో పాటు  కొత్త సరుకు కోసం స్టాకిస్టులు ముందుకు వస్తున్నందున నాణ్యమైన సరుకు - ధర రూ. 200-250 ప్రతి క్వింటాలుకు పెరిగింది. గత వారం హోళి కంటే - ముందు సోమవారం గుజరాత్లోని గోండల్లో 2 లక్షల బస్తాల రెత్తుల సరుకు రాబడి అయింది. మార్కెట్ యార్డు త్రోవలో సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు వరుస తీరాయి. అయితే గోండల్లో దినసరి కేవలం 15-20 వేల బస్తాల ధనియాల వ్యాపారమవుతుంది. ఇందులో గత వారం 60-70 వేల బస్తాల సరుకు అమ్మకం అయింది.

 గుజరాత్లోని జునాగఢ్ 15-20 వేల బస్తాలు, జేత్పూర్లో 10-12 వేల బస్తాలు, జామ్ జోధ్పూర్ లో 20-22 వేల బస్తాలు రాబడి కాగా, కేవలం శనివారం 15 వేల బస్తాలు, రాజ్కోట్లో 30-40 వేల బస్తాలు, ఇతర ప్రాంతాలలో 25-30 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9600-10,400, మీడియం రూ. 9500-10,200, యావరేజ్ రూ. 8800-9100, సన్నరకం ఆకుపచ్చ సరుకు రూ. 12,000–13,000, జూనాగడ్లో క్లీన్ ఈగల్ రూ. 10,350, స్కూటర్ రకం రూ. 10,850, జామ్నగర్లో దినసరి 3-4 వేల బస్తాలు, హల్వాడ్ శనివారం 4 వేల బస్తాల రాబడిపై ఈగల్ రూ. 9200-9700, స్కూటర్ రకం రూ. 9900–10,200, మీడియం రూ. 9500-10,000, నిమ్ము రకం సరుకు రూ. 8000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని రామంజ్మండిలో గత శనివారం 12500 బస్తాల రాబడితో పాటు మొత్తం వారంలో 70-75 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము సరుకు బాదామీ రూ. 7600-8100, ఎండు సరుకు రూ.9000 9200 నిమ్ము రకం ఈగల్ రూ. 8600-9100, ఎండు సరుకు రూ. 10,000-10,500, స్కూటర్ రకం రూ.11,300-11,500 మరియు 3-4 వేల బస్తాల పాత సరుకు బాదామీ రూ.8600-8700, ఈగల్ రూ. 9000-900 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు 40 కిలోలు బాదామీ లారీ బిల్టి రూ. 4350, ఈగల్ రూ. 4450, బాదామీ పప్పు రూ. 4150, ఈగల్ రూ.4250, బారన్లో 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, నిమ్ము సరుకు రూ. 7000-8500, ఎండు సరుకు రూ. 9000-9500, మరియు 3-4 వేల బస్తాల పాత సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 920-9300, ఈగల్ రూ. 9400-9500, కోటాలో 7-8 వేల బస్తాల రాబడిపై నిమ్ము సరుకు రూ. 8500-9500, ఎండు సరుకు రూ. 9200-9500 మరియు 700-800 బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 8800-9000, ఈగల్ రూ. 9200-9300, స్కూటర్ రూ. 9350-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్యప్రదేశ్లోని గునా మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాల రాబడిపె బాదామీ రూ. 7200-8700, ఈగల్ రూ. 8300-8900, ఎండు సరుకు రూ. 9300-9800, కుంభరాజ్ 3-4 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, నిమ్ము రకం రూ.7500-8100, ఎండు సరుకు రూ. 9000-9500, నాణ్యమైన సరుకు రూ.10,000-10,500, బినాగంజ్లో 8-10 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, ఈగల్ నిమ్ము సరుకు రూ. 7000–7200, ఎండు రకం రూ. 9400-9500, మధుసుదన్ ఘడ్లో 2000-2500 బస్తాల కొత్త సరకు రాబడి కాగా, నిమ్ము రకం రూ. 7200-8400, ఎండు రకం రూ. 9200-9500, నీమచ్లో 5-6 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 8500-9000, ఎండు సరుకు రూ. 10,500-10,800, 3-4 వేల బస్తాల పాత సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 9000-9300, ఈగల్ రూ. 94000-9500, జామ్రాలో 2-3 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై నిమ్ము సరుకు రూ.6500-7200, ఎండు సరుకు రూ. 9200-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. 4600, ఈగల్ రూ.4650, స్కూటర్ రకం రూ. 4800 మరియు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు రూ. 4550 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog