రాబడులు తగ్గడంతో ధనియాలు పటిష్టం

 


 గతవారం దేశంలోని ప్రముఖ ధనియాల ఉత్పాదక కేంద్రాలలో వర్షాలు కురవడంతో రెత్తులు ఖరీఫ్ పంటల సాగులో నిమగ్నం కావడంతో మార్కెట్లలో ధనియాల రాబడులు క్షీణించాయి. తద్వారా ప్రత్యక్ష, పరోక్ష మార్కెట్లలో ధరలు రూ. -300-400 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. గత సోమవారం ఎన్సీడిఇఎక్స్ వద్ద ధనియాల జూలె వాయిదా రూ. 10,220 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 462 వృద్ధిచెంది రూ. 11,382, ఆగస్టు వాయిదా రూ. 332 పెరిగి రూ. 11,482 వద్ద ముగిసింది. 


రాజస్తాన్లోని రాంగంజీ మండీలో వారం 7-8 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,600-10,700, ఈగల్ రూ. 11800-11,300, స్కూటర్ రకం రూ. 11,900-12,100 ప్రతి క్వింటాలు లోకల్ లూజు మరియు లారీ బిల్డీ ప్రతి 40 కిలోల బస్తా బాదామీ రూ. 4850, ఈగల్ రూ. 5050, బారన్లో 3 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,500-10,700, ఈగల్ రూ. 11,200–11,400, కోటాలో 4-5 వేల బస్తాలు బాదామీ రూ. 9700-10,000, ఈగల్ రూ. 10,200-10,400, భవానీమండి, ఛట్టా, ఇటావా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 2-3 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,000-10,400, ఈగల్ రూ. 10,700-11,000, స్కూటర్ రూ. 11,500-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. 

మధ్యప్రదేశ్లోని గునాలో గత వారం 4-5 వేల బస్తాల రాబడి కాగా, బాదామీ రూ. 9500-10,200, నాణ్యమైన బాదామీ రూ. 10,500-10,600, ఈగల్ రూ. 10,800-11,000, స్కూటర్ రకం రూ. 11,700-11,800 మరియు కుంభరాజ్లో 2 వేల బస్తాలు బాదామీ రూ.10,100-10,800, ఈగల్ రూ. 11,000-11,400, స్కూటర్ రకం రూ.11,700-11,900, బీనాగంజ్లో 1500 బస్తాల రాబడిపై ఈగల్ రూ. 10,500-10,800, స్కూటర్ రకం రూ. 11,000–11,500, ప్యారట్-గ్రీన్ రూ. 11,700–12,300, శ్యామ్ గఢ్, నిమచ్, మందసోర్, జాన్ ప్రాంతాలలో కలిసి 4-5 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,300–10,600, ఈగల్ రూ. 11,000- 11,200 లోకల్ లూజా ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. 

గుజరాత్లోని గోండల్లో గత వారం 8-10 వేల బస్తాల రాబడిపై ఈగల్ రూ. 10,500–10,800, స్కూటర్ రూ. 11,000–11,500 మరియు రాజ్ కోట్, జామ్నగర్, జునాగఢ్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 7-8 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,500-10,750, ఈగల్ రూ. 10,800-10,950, స్కూటర్ రూ. 11,125– 11,500, ప్యారట్-గ్రీన్ రూ. 11,625-11,875, జూనాగఢ్ మిషన్-క్లీన్ ఈగల్ రూ.11,500, స్కూటర్ రకం రూ. 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog