ధనియాల ధరలు ఎక్కువగా తగ్గే అవకాశం లేదు

 


 ఈ ఏడాది దేశంలో ఉత్పత్తి తగ్గడంతో విదేశాల నుండి ధనియాల దిగుమతులు పెరిగాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఉత్పత్తి 90 వేల టన్నుల మేర తగ్గింది. వ్యాపారుల కథనం ప్రకారం విదేశాల నుండి 19 వేల టన్నుల సరుకు దిగుమతి అయింది. భవిష్యత్తులో మరో 8-10 వేల టన్నుల సరుకు దిగుమతి అయినప్పటికీ, ధరలపై ఎలాంటి ప్రభావం ఉండబోదు. తద్వారా సరుకు ధరలు అధికంగా తగ్గే అవకాశం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ, ధరలు అధికంగా ఉన్నాయి. ఎందుకనగా వినియోగానికి అనుగుణంగా సరుకు సరఫరా లేదు. 2021-22లో దేశంలో ధనియాల ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిసేత 8.91 ల.ట. నుండి తగ్గి 8.01 ల.ట.లకు చేరింది. 


వ్యాపారస్తుల కథనం ప్రకారం బల్గేరియా, టర్కీ రష్యా లాంటి దేశాల నుండి దిగుమతులు పెరిగే అవకాశం ఉంది దీనితో సరఫరా మెరుగ్గా ఉండే అంచనాతో రాబోవు రోజులలో ధరలపై ఒత్తిడి పెరగవచ్చు. ఈ ఏడాది దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 4588 టన్నుల నుండి పెరిగి 19,173 టన్నులకు చేరాయి. ఇందులో రష్యా నుండి దిగుమతులు 256 టన్నుల నుండి పెరిగి 14,465 టన్నులకు చేరగా, బల్గేరియా నుండి 716 నుండి పెరిగి 1623 టన్నులకు, ఫ్రాన్స్ నుండి 300 నుండి పెరిగి 413 టన్నులకు, ఇటలీ నుండి 2520 నుండి తగ్గి 1962 టన్నులకు, టర్కీ నుండి 389 నుండి తగ్గి 289 టన్నులకు చేరినట్లు సమాచారం. గత మంగళవారం ఎన్ సిడి ఇఎక్స్ వద్ద సెప్టెంబర్ వాయిదా రూ. 10,884 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 68 తగ్గి రూ. 10,816, అక్టోబర్ వాయిదా రూ. 20 పెరిగి రూ. 11,070 వద్ద ముగిసింది. గత వారం రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో వర్షాలు ఉన్నప్పటికీ, కిరాణా మరియు మర ఆడించే యూనిట్ల డిమాండ్ నెలకొ నడంతో ధర రూ. 200-300 వృద్ధి చెందింది. 

రాజస్తాన్లోని రాంగంజ్ మండీలో మంగళవారం 18-20 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 10,000-10,200, ఈగల్ రూ. 10,600-10,800, స్కూటర్ రూ. 11,000-11,100, బారన్లో 7-8 వేల బస్తాల రాబడి పె బాదామీ రూ. 10,000-10, 100, ఈగల్ రూ. 10,500-10,600, కోటాలో 6-7 వేల బస్తాలు మీడియం బాదామీ రూ. 9700-9800, ఈగల్ రూ. 10,000-10, 100, భవానీమండీ, ఛఋ, ఇటావా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ రూ. 10,300-10,500, ఈగల్ రూ. 10,600-10,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. 

మధ్య ప్రదేశ్ లోని గునాలో 15-16 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 9500-10,200, ఈగల్ నాణ్యమైన సరుకు రూ.10,800-11,200, మీడియం రూ. 10,500-10,700, కుంభరాజ్ లో 4-5 వేల బస్తాలు బాదామీ రూ. 10,000-10,300, ఈగల్ రూ. 10,500-10, 700, స్కూటర్ రకం రూ. 11,000- 11,200, శ్యా మ్ గఢ్, మధుసూదన్ గఢ్, నిమచ్, మందసోర్,జావ్రా ప్రాంతాలలో కలిసి 5-6 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన బాదామీ రూ. 10,000-10,300, మీడియం రూ. 9500-9700, నాణ్యమైన ఈగల్ రూ. 10,700-10,900, మీడియం ఈగల్ రూ. 10,500-10,600 ధరతో నాణ్య తానుసారం వ్యాపారమెంది. 

గుజరాత్ లోని గోండల్ లో గత వారం 10-12 వేల బస్తాల సరుకు రాబడిపె ఈగల్ రకం రూ. 10,500-10,600, నాణ్యమైన సరుకు రూ. 10,700-11,000, స్కూటర్ రూ. 11,500-11,600 మరియు రాజ్కోట్, జూనాఘడ్ మరియు తదితర మార్కెటలో గత వారం 8-10 వేల బసాల రాబడిపై బాదామీ రూ. 10,600-10,700, ఈగల్ రూ. 10,800-11,000, స్కూటర్ రూ. 11,200-11,500 మరియు జూనాఘడ్ లో మిషన్ క్లీన్ ఈగల్ రూ. 11,300, స్కూటర్ రకం రూ. 11,800 ధరతో వ్యాపారమెంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. _5150, ఈగల్ కొత్త సరుకు రూ. 5250, స్కూటర్ రకం రూ. 5375, ఎసి సరుకు రూ. 5175 ధరతో వ్యాపారమైంది.



Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు