ధనియాలు - తగ్గిన రాబడులు

 

15-02-2022

వ్యాపారస్తుల అంచనా ప్రకారం మార్చి మొదటి వారం వరకు రాబడులు పెరగనట్లయితే, ధరలు మరింత పెరిగే అవకాశం కలదు. ఎందుకనగా, మూడు రాష్ట్రాలతో పాటు ఇతర ఏ రాష్ట్రంలో కూడా కొత్త పెద్ద పంట రాబడి కాదు. దీనితో స్టాకిస్టులు చురుకుగా మారే అవకాశం కలదు. గతవారం గుజరాత్, మధ్య ప్రదేశ్ మరియు రాజస్తాన్లలోని ఉత్పాదక కేంద్రాలలో కొత్త సరుకు రాబడులు పెరగకపోవడంతో మరియు దక్షిణాది రాష్ట్రాల కోసం డిమాండ్ ఉండడంతో వాయిదా సహా మార్కెట్ ధరలు రూ. 150-200 ప్రతిక్వింటాలుకు పెరిగాయి.





 ఎన్సీడిఇఎక్స్లో సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 10650 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 200 పెరిగి రూ. 10850, మే వాయిదా రూ. 400 పెరిగి రూ. 10920 తో ముగిసింది. 

రాజస్తాన్లోని రాంగంజ్ మండీలో వారంలో 150-200 బస్తాల కొత్త సరుకు రాబడిపై 30-35 శాతం నిమ్ము సరుకు రూ. 7000-8500 మరియు 15-16 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 8500-8600, ఈగల్ రూ. 8900-9000, స్కూటర్ రూ. 9200-9400, బారన్లో 8–10 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8700-8800, ఈగల్ రూ. 9000-9100, కోటాలో 6-7 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8000-8500, ఈగల్ రూ. 8600-8800, స్కూటర్ రూ. 8800-9000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.

 మధ్య ప్రదేశ్లోని గునాలో 7-8 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8400-8700, ఈగల్ రూ. 8800-9100, స్కూటర్ రూ. 9200-9300, కుంభరాజ్ 2-3 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8500-8600, ఈగల్ రూ. 8900-9200 మరియు నిమల్లో దినసరి 70-80 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము రకం రూ. 6000-6500, నాణ్యమైన రూ. 7300-7800 మరియు 2500-3000 బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ. 8400-8500, ఈగల్ రూ. 8700-9000, స్కూటర్ రూ. 9100-9300 ధరతో వ్యాపారమయింది. 

గుజరాత్లోని గోండల్లో దినసరి 800–1000 బస్తాలు, జూనాఘడ్లో 70-80బస్తాలు మరియు జోత్పూర్లో 80-100 బస్తాలు మరియు రాజ్కోట్లో 300-400 బస్తాలు మరియు ఇతర ప్రాంతాలలో 200-250 బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము రకం రూ. 700-9000, 15-20 శాతం రూ. 9000-10750 మరియు 8-10 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ రూ.8150-8400, ఈగల్ రూ. 9000-9250, స్కూటర్ రూ. 9300-9450, జూనాఘడ్లో క్లీన్ ఈగల్ రూ. 9900, స్కూటర్ రూ. 10400 ధరతో వ్యాపారమయింది. 

ఒంగోలులో బాదామీ రూ. 4450, ఈగల్ రూ. 4500, స్కూటర్ రూ. 4575 మరియు ఎసి సరుకు రూ. 4300 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు