ఉత్పత్తి పెరిగినప్పటికీ దిగిరాని కొబ్బరి ధరలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె, పామాయిల్ పాటు అన్ని వంటనూనెల ధరలు నింగికెగిసి పడుతున్నందున ఈ ప్రభావం కొబ్బరినూనెపై ఉండగలదని ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. గత ఏడాది కొబ్బరినూనె ధరలు బలోపేతం చెందినందున వినియోగదారులు చౌకరకం నూనెల వినియోగానికి మొగ్గు చూపారు. ప్రస్తుతం అన్ని వంటనూనెల ధరలు చుక్కలు చూపిస్తున్నందున కొబ్బరినూనె వినియోగం పెరగడంతో పాటు ధరలు కూడా ఇనుమడించగలవని వ్యాపారులు భావిస్తున్నారు.
సంతృప్తికరమైన ఉత్పత్తి వలన మార్కెట్లో కొబ్బరి సరఫరా సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ధరలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం కనిపించడంలేదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది సంతృ ప్తికరమైన వర్షాలు, సానుకూల వాతావరణం తోడైనందున భారీ ఉత్పత్తి నమోదు చేసింది. రాబోయే సంవత్సరం కూడా ఇదే విధంగా ఉండగలదని తెలుస్తోంది. అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కొబ్బరికాయల ఉత్పత్తి 5 శాతానికి పైగా వృద్ధి నమోదు చేసింది. 2020-21 లో కేరళలో 7 ల.హె. విస్తీర్ణంలో 697.45 కోట్ల కొబ్బరికాయల దిగుబడి నమోదైంది. ఈ ఏడాది కూడా ఇదే మాదిరిగా లేదా ఇంతకన్నా ఎక్కువ ఉండగలదనే అంచనా వ్యక్తమవుతున్నది. ఫలితంగా పతనమవుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని 50 వేల టన్నుల కొబ్బరి కొనుగోలు చేయాలని నాఫెడు ని ప్రభుత్వం ఆదేశించింది. అయితే,ప్రస్తుతం స్వేచ్ఛా విపణిలో మద్దతు ధరలను అధిగమించి వ్యాపారమవుతున్నందున కొనుగోలు ప్రక్రియ కుంటుపడింది.
వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది కేరళ, తమిళనాడు మరియు కర్నాటకలలో కొబ్బరి ఉత్పత్తి పెరుగుచున్నది మరియు సరఫరా కూడా పెరుగుతున్నది. అయితే, హోళీ, ఉగాది, శ్రీరామనవమి పండుగల కోసం కొబ్బరి కాయలు, కొబ్బరికి డిమాండ్ మరియు ఆంధ్ర నుండి సరఫరా తగ్గడంతో పాటు ఇతర వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో కొబ్బరనూనెలో ఇతర నూనెల కల్తీ తగ్గడంతో వినియోగం పెరుగుచున్నది. దీనితో ధరలు పటిష్టంగా మారాయి. కాని, 15, ఏప్రిల్ తరువాత తిరిగి మందకొడికి అవకాశం కలదు.
ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో గత వారం 90-95 టన్నుల కొబ్బరి రాబడి పై ఎక్స్పోర్ట్ రకం రూ. 9900-10,000, మీడియం రూ. 8900-9000, యావరేజ్ రూ. 8000 మరియు దినసరి 25-30 లారీల కొబ్బరి కాయల రాబడిపై రూ. 9000-10,000 మరియు పాలకొల్లులో గత వారం 140-150 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, నాణ్యమైన పాత సరుకు రూ. 10,000, మీడియం రూ. 8000, యావరేజ్ రూ. 6300-6500, కొత్త కాయలు నాణ్యమైన సరుకు రూ. 9000, మీడియం రూ. 6000-7000, యావరేజ్ రూ. 5500-6000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమై అత్యధిక సరుకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ల కోసం రవాణా అవుతున్నది.
కర్ణాటకలోని టిపూర్లో వారాంతపు సంతలో 4-5 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 17,500-17,550, కిరాణా రకం మీడియం సరుకు రూ. 18,100-18,500, నాణ్యమైన సరుకు రూ.12,500-13,000, మీడియం రూ. 8900-9500, మిల్లింగ్ కొబ్బరి రూ. 9800-10,000 ధరతో వ్యాపారమై బెంగుళూరు, మహారాష్ట్ర, పంజాబ్, హర్యాణాల కోసం రవాణా అవుతున్నది.
అరిసేకేరి, సి.ఆర్. పట్నం మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 2000-2500 బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 17,500-17,700, మీడియం రూ. 15,000-15,500, మిల్లింగ్ సరుకు రూ. 10,000-10,500 ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని కాంగేయంలో 80-100 బస్తాల రాబడిపై సాదా రూ. 9700, మిల్లింగ్ స్పెషల్ రూ. 9800, మెరికో రూ. 9900 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 2225-2250, వెల్లకోవిల్, అన్నామలై, అవిలుందురై, కొడుముడి, జలకందపురం ప్రాంతాల మార్కెట్లలో కలిసి 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9200-10,000, మీడియం రూ. 7870-8000 మరియు కొచ్చి, త్రిచూర్లలో కొబ్బరి నూనె రూ. 15,300, పెరుందురైలో 4-5 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9365-9715, కోజికోడ్లో రాజాపురి కొబ్బరి రూ. 17,100, రాసి రూ. 9100, మిల్లింగ్ కొబ్బరి రూ. 9800, బంతి కొబ్బరి రూ. 15,000, దిల్పసంద్ రూ. 9500 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ. 30,500, వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 16,700, ఎండు సరుకు రూ. 11,500, మిల్లింగ్ సరుకు రూ. 9800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు