కొబ్బరి

 


ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేటలో గత వారం 8-10 వాహనాల కొబ్బరి రాబడిపై స్థానికంగా రూ. 8300-8400, మీడియం రూ.7800-7900, యావరేజ్ సరుకు రూ. 6900 మరియు 10-12 వాహనాలు కొబ్బరికాయలు నాణ్యమైన సరుకు ప్రతి 1000 కాయలు రూ. 7900-8000, మీడియం రూ. 7200-7400, పాత సరుకు రూ.8800-8900, మీడియం రూ.8300-8400 మరియు పాలకొల్లులో ప్రతి రోజు 25-30 వాహనాలు పెద్ద కాయలు రూ. 9800-9000, మీడియం రూ. 7500-8000, యావరేజ్ సరుకు రూ.5600-8000, పాత సరుకు రూ. 9400, మీడియం రూ.8500-8600, యావరేజ్ సరుకు రూ. 8900–7000 ధరతో మహారాష్ట్ర, రాజస్తాన్ కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని వెల్లకోవిల్, జలకందాపురం, అన్నామలై, బోతపాడి, కొడుముడి ప్రాంతాలలో గత వారం కేవలం 5 వేల బస్తాల కొబ్బరి రాబడిపై రూ.8300–8760, పెరుందురైలో 8 వేల బస్తాలు రూ. 8656-8935 ప్రతి క్వింటాలుధరతో వ్యాపారమైంది.



కేరళలోని కోజికోడ్లో రూ. 8750, రాసి కొబ్బరి రూ. 8350, దిల్వనంద్ రూ. 8850, రాజాపురి కొబ్బరి రూ. 12,000, మిల్లింగ్ సరుకు రూ. 8800, బంతికొబ్బరి రూ. 10,000, కాంగేయంలో సాదా కొబ్బరి రూ. 8200, స్పెషల్ రూ. 8300, మెరికో రూ. 8350, కొచ్చిలో కొబ్బరినూనె రూ. 14,000, త్రిచూర్ రూ.14,100 ప్రతి క్వింటాలు మరియు కాంగేయం, ఉటుకులిలో 15 కిలోల డబ్బా రూ. 1880-1890 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని టిప్టూర్లో గత వారం 6-7 వేల బస్తాలు, తుంకూరు, అరిసెకేరి, మంగుళూరు, సి.ఆర్. పట్నం ప్రాంతాలలో 2 వేల బస్తాల కొబ్బరి రాబడిపై రూ. 14,000–14,500, కిరాణా రకం రూ. 11,000–12,000, మెరికో రూ. 8200,మీడియం రూ.600-7200, యావరేజ్ సరుకు రూ.5500-6000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog