ఉగాది మరియు రామనవమి కోసం వ్యాపారుల కొనుగోళ్లు సమాప్తం కావడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. మరియు ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకనగా రాబడులతో పోలిస్తే వినియోగం తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో గత వారం 500-600 బస్తాల కొబ్బరి రాబడిపై ఎక్సో పోర్ట్ రకం రూ. 9500-10,000, మీడియం రూ. 8200- 8500, యావరేజ్ రూ. 7600-8000 మరియు ప్రతి రోజు 20-30 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, పాత సరుకు రూ. 9000, మీడియం రూ. 7900-8000, యావరేజ్ రూ. 6000-6750, మరియు మిల్లింగ్ రకం రూ. 8500-9000, ఎండు సరుకు రూ. 11,500–12,000 ధరతో వ్యాపారమైంది.
అంబాజిపేటలో గత వారం 10-15 లారీల రాబడి కాగా, పాత కాయలు రూ. 12,000, మీడియం రూ. 11,500, కొత్త నాణ్యమైన సరుకు రూ. 8500, మీడియం రూ. 7000, యావరేజ్ రూ. 6000-6500 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమెంది. పాలకొల్లులో గత వారం 25-30 వాహనాల కొబ్బరికాయల రాబడిపై నాణ్యమైన పాత సరుకు 10,000, మీడియం రూ. 8500-9000, యావరేజ్ రూ. 7000 మరియు నాణ్యమైన కొత్త సరుకు రూ. 9000, మీడియం రూ. 8000, యావరేజ్ రూ. 6000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని టిపూర్లో వారాంతపు సంతలో 2 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 17,000-17,350, కిరాణా రకం సరుకు రూ. 18,000, వంట కొబ్బరి రూ. 12,000-12,500, మీడియం రూ. 8000-8500, మెరికో రకం రూ.9500-10,000, మిల్లింగ్ కొబ్బరి రూ.9500-9800 మరియు అరిసేకేరి, సి.ఆర్. పట్నం, మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 3 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 16,000-16,525, మీడియం రూ. 12,000-13,000, మిల్లింగ్ సరుకు రూ. 9500–11,000 ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని కాంగేయంలో వారంలో 300 బస్తాల రాబడి కాగా, కొబ్బరి సాదా రూ. 8950, మిల్లింగ్ స్పెషల్ రూ. 9000, మెరికో రూ. 9000-9050 ప్రతి క్వింటాలు మరియు కాంగేయం, ఊటుకులి ప్రాంతాలలో కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 2020-2040, వెల్లకోవిల్, అన్నామలై, అవిలుందురై, కొడుముడి, జలకందపురం ప్రాంతాల మార్కెట్లలో కలిసి 8 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9450, మీడియం రూ. 7000-8000 మరియు కొచ్చి, త్రిచూర్లలో కొబ్బరి నూనె రూ. 15,100, కోజికోడ్ రాజాపురి కొబ్బరి రూ. 15,200, రాసి రూ. 9000, మిల్లింగ్ కొబ్బరి రూ. 9450, దిల్పసంద్ రూ. 9500, బంతి కొబ్బరి రూ. 13,400 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ. 31,000, వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 15,300, ఎండు సరుకు రూ. 11,500, మిల్లింగ్ సరుకు రూ. 9450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు