కొబ్బరికాయలకు కొనుగోలు తాకిడి

 


 దేశంలో కరోనా మహమ్మారి నుండి ఉపశమనం లభించినప్పటి నుండి దేవాలయాలలో అర్చనలు, పూజాధికాలు పునరుద్ధరించబడిన తర్వాత కొబ్బరికాయలు కొనుగోళ్లు జోరందుకున్నాయి. శివరాత్రి మరియు హోళీ పండుగను పురస్కరించుకొని కొబ్బరి మరియు కొబ్బరికాయలకు గిరాకీ నెలకొన్నది.



ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో గత వారం 80-90 టన్నుల కొబ్బరి రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 9200-9300, మీడియం రూ.8300 8500, యావరేజ్ రూ. 8000-8100 మరియు పాలకొల్లులో ప్రతి రోజు 30 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, పాత సరుకు రూ. 9500, మీడియం రూ. 8500, యావరేజ్ రూ. 6500, కొత్త కాయలు నాణ్యమైన రూ. 9000, మీడియం రూ. 7500, యావరేజ్ రూ. 6000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమై అత్యధిక సరుకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది.


కర్ణాటకలోని టిపూర్లో వారాంతపు సంతలో 5 వేల బస్తాల సరుకురాబడిపై బంతి కొబ్బరి రూ. 17,650-17,700, కిరాణా రకం నాణ్యమైన సరుకు రూ. 18,000-18,500, మీడియం రూ. 12,000-13,000,యావరేజ్ రూ. 9000-9500, మిల్లింగ్ కొబ్బరి రూ. 11,000 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. అరిసేకేరి, సి.ఆర్. పట్నం, మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 1500- 2000 బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 17,400-17,700, మీడియం రూ. 14,000-15,000, మిల్లింగ్ సరుకు రూ. 10,000–11,000 ధరతోవ్యాపారమైంది. 

తమిళనాడులోని కాంగేయంలో సాదా రూ.8600-8700, మిల్లింగ్ స్పెషల్ రూ. 8700, మెరికో రూ. 8800 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 1980-2000, వెల్లకోవిల్, అన్నామలై, అవిలుందురై, కొడుముడి, జులకందపురం ప్రాంతాల మార్కెట్లలో కలిసి 6 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8900-9000, మీడియం రూ. 7000-8000 మరియు కొచ్చి, త్రిచూర్లలో కొబ్బరి నూనె రూ. 14,700–14,800, పెరుందురైలో 5 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8500-9000, కోజికోడ్లో రాజాపురి కొబ్బరి రూ. 16,700, రాసి రూ.8950, మిల్లింగ్ కొబ్బరి రూ. 9400, బంతి కొబ్బరి రూ. 14,700, దిల్పసంద్ రూ. 9450 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ.30,500, వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 16,700, ఎండు సరుకు రూ. 11,500, మిల్లింగ్ సరుకు రూ. 9400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog