కొబ్బరికాయలు - కొబ్బరిలో పెరుగుదలకు అవకాశం లేదు

 



కొచ్చి- దక్షిణ భారతంలో ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో మార్కెట్లో రాబడులు పెరగడంతో రాబోవు ఓనం సహా అన్ని పండుగల కోసం కొబ్బరినూనె ధరలు పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి మరియు భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడంలేదు.


కొచ్చిన్ ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్ (కోమా) వర్గాల కథనం ప్రకారం ద్రవ్యోల్బణం మరియు నగదు సమస్యతో వినియోగం తక్కువగా ఉంది. మరోవెప్పు సరఫరా పెరిగింది. దీనితో హోల్సేల్ మార్కెట్లో కొబ్బరినూనె ధర రూ. 150 ప్రతికలో స్థాయిలో ఉంది మరియు అనేక చిన్న యూనిట్లు కొబ్బరినూనె అమ్మకం కోసం ముందుకు వస్తున్నాయి. ఎందుకనగా, కొబ్బరి ధర తగ్గి రూ. 85-90 కి చేరింది. పామాయిల్ నిల్వలు భారీగా ఉండడం మరియు ప్రస్తుతం ఉత్పత్తి సీజన్ ఉన్నందున పామాయిల్, సోయానూనె, సన్ఫ్లవర్ నూనె మొదలగు వంటనూనెల ధరలు రూ.30-40 ప్రతిలీటరు కు తగ్గాయి. దీనితో ఈ ప్రభావం కొబ్బరినూనె ధరలపై కూడా పడింది.


అనేక చిన్న యూనిట్లు కొబ్బరినూనె అమ్మకంకోసం ముందుకు రావడంతో సంఘటిత రంగంలోని యూనిట్ల పై ప్రభావం పడింది. అంతేకాకుండా ఆర్థిక మాంద్యం వలన కూడా ఎగుమతి మార్కెట్పై వత్తిడి ఉంది. ఈ ఏడాది చివరలో డిమాండ్- సప్లై పరిస్థితి మెరుగైన తరువాత ధరలు మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది.


గత వారం ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో 8-10 వాహనాల కొబ్బరి రాబడి కాగా ఎక్స్పోర్ట్ రకం రూ. 8500-9000, మీడియం రూ. 7000-7500, యావరేజ్ రూ. 6800-7000 మరియు 8-10 వాహనాల కొబ్బరి కాయల రాబడి కాగా, పాత కాయలు రూ.8500-9000, మీడియం రూ.7800-8000, పాత సరుకు రూ.9000-9500, మీడియం రూ. 8200-8500, యావరేజ్ రూ.7000-7500 (ప్రతి 1000 కాయలు) -ధరతో వ్యాపారమైంది. పాలకొల్లులో దినసరి 30 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, కొత్త కాయలు (పెద్ద) నాణ్యమైన సరుకు రూ. 9400-9500, మీడియం రూ. 8000-8500, యావరేజ్ రూ.6000-6500 మరియు పాత సరుకు రూ. 10,500, మీడియం రూ. 9400-9500, యావరేజ్ రూ. 7000-7500 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమై మహారాష్ట్ర రాజస్థాన్, ఛత్తీస్గడ్ కోసం రవాణా అవుతోంది.


కర్ణాటకలోని టిప్టూర్లో వారాంతపు సంతలో 5 వేల బస్తాలు, తుమ్కూరు, అరసెకేరి, మంగళూరు, సి ఆర్ పట్నం ప్రాంతాలలో 2 వేల బస్తాల రాబడిపై రూ. 14000–14700, మీడియం రూ. 11000-12000, ఎడిబుల్ రూ. 10500-10600, మెరికొ రకం రూ. 8000-8500, మీడియం రూ. 7000-7500, యావరేజ్ రూ. 5500-6000 మరియు బాల్ కొబ్బరి రూ. 14000 ధరతో వ్యాపారమైంది


తమిళనాడులోని వెల్లకోవిల్, అన్నామలై, జలకందపురం, బోతప్పాడి, కొడిముడి, ఎలమత్తూరు ప్రాంతాల మార్కెట్లలో కలిసి సంతరోజు 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8500-8600 మరియు పెరుందురైలో 10-11 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7850-8450, కోజికోడ్లో కొబ్బరి రూ. 8750, రాసి రూ. 8550, దిల్పసంద్ రూ. 9050, రాజాపురి కొబ్బరి రూ. 14,000, మిల్లింగ్ కొబ్బరి రూ. 8850, బంతి కొబ్బరి రూ. 12,000-12,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కాంగేయంలో సాదా కొబ్బరి రూ. 7900, స్పెషల్ రూ. 8000, మెరిక్కొ రూ. 8100, కొచ్చి, త్రిచూర్ లలో కొబ్బరి నూనె రూ. 13,700–13,800 ప్రతి క్వింటాలు మరియు కాంగేయం, ఊటుకు లిలలో 15 కిలోల డబ్బా రూ. 1770-1790 ధరతో వ్యాపారమైంది..

Comments

Popular posts from this blog