కొబ్బరి ధరలపై ఆశలు లేనట్లే

 

దేశంలో పితృ పక్షం ముగిసింది. దసరా, దీపావళి పండుగల కోసం దక్షిణాది రాష్ట్రాలలో కొబ్బరి,కొబ్బరికాయల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఈసారి చెప్పుకోదగ్గ స్థాయిలో కొనుగోళ్లు లేవని చెప్పవచ్చు. ఎందుకనగా ఈ ఏడాది కొత్త సీజన్లో ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు ముందస్తుగానే భారీగా సరుకు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. అటు తర్వాత ధరలు దిగ జారుతున్నందున సరుకు కొనుగోలుకు బదులు విక్రయించేందుకు దృష్టి సారిస్తున్నారు. ఉత్పాదక రాష్ట్రాలలోని రైతులు కూడా తమ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడంలేదు. కావున 2022-23 సీజన్ పర్యంతం కొనుగోళ్లకు అనుగుణంగా సరుకు సరఫరా అయ్యే అవకాశం కనిపిస్తున్నది. కేవలం 5-10 శాతం లాభంతో క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్ లోని అంబాజీపేటలో గత వారం 4-5 వాహనాల కొబ్బరి రాబడి పై స్థానికంగా నాణ్యమైన రూ. 8500-8600, మీడియం సరుకు రూ. 7400-7500, యావరేజ్ సరుకు రూ. 6200-6900 మరియు 6-7 వాహనాల కొబ్బరికాయలు నాణ్యమైన సరుకు ప్రతి 1000 కాయలు రూ. 9500, మీడియం రూ. 8500, పాత సరుకు రూ. 10,200-11,000, మీడియం రూ. 9800-10,000, పాలకొల్లులో వర్షాలు కురుస్తున్నందున కొనుగోళళ్లు మందగించాయి. ప్రతి రోజు 30 వాహనాల కొబ్బరికాయల రాబడిపై నాణ్యమైన కొత్త సరుకు పెద్ద సైజు కాయలు రూ. 9500, మీడియం రూ. 8000-8500, యావరేజ్ రూ. 6000, పాత సరుకు పెద్ద సైజు కాయలు రూ. 10,500-11,000,మీడియం రూ. 9000-9500, యావరేజ్ సరుకు రూ. 7200-7500 ప్రతి 1000 కాయల ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ కోసం రవాణా అవుతున్నది. 

కర్ణాటక లోని టిపూర్ లో గత వారం 7-8 వేల బస్తాలు, తుంకూరు, అరిసెకేరి, మంగుళూరు,సి.ఆర్.పట్నం ప్రాంతాలలో 2 వేల బస్తాలకొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 14,000-14,220, మీడియం రూ. 12,000-12,500, కిరాణా రకం రూ. 10,000-11,000, మెరికో రూ. 7600-8000, యావరేజ్ సరుకు రూ. 5600-5700, బంతి కొబ్బరి రూ. 13,800-14,000ధరతో వ్యాపారమైంది.

తమిళ నాడులోని అన్నామలై, బోతపాడి, వెల్లకోవిల్, జలకందాపురం, కొడుముడి, ఇలమతూరు ప్రాంతాల వారాంతపు సంతలో 5-6 వేల బస్తాల కొబ్బరి రాబడిపై రూ. 7400-7800, పెరుందురైలో గత సోవు, బుధ , శనివారాలలో కలిసి 8-9 వేల బస్తాలకొబ్బరి రాబడిపై 7300-7780 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కేరళలోని కోజికోలో కొబ్బరి రూ. 13,450 మరియు రూ. 8100, రాసికొబ్బరి రూ. 7750, దిల్‌పసంద్ రూ. 8250, రాజాపురి కొబ్బరి రూ. 14,200, బంతి కొబ్బరి రూ. 12,200, మిల్లింగ్ సరుకు రూ. 8100, కాంగేయంలో సాదా కొబ్బరి రూ. 7450, స్పెషల్ రూ. 7500-7550, మెరికో రూ. 7650-7700, త్రిచూర్, కొచ్చిలో కొబ్బరినూనె రూ. 13,100-13,200 ప్రతి క్వింటాలు మరియు కాంగేయం, ఉటుకులిలో 15 కిలోల డబ్బా రూ. 1640-1650 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog