కొబ్బరి ధరలు పెరిగే అవకాశం లేదు?

  


వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలలో కొబ్బరి పంట ఉత్పత్తి భారీగా పెరగడంతో పాటు మార్చి వరకు పాత నిరవధికంగా సరఫరా కావడంతో మరియు తమిళనాడు, కేరళలలో రాబ డులు పెరగడంతో పాటు ఏడాది పొడగునా సరఫరా ఉండడంతో పెద్ద కంపెనీల కొనుగోళ్లు తగ్గడంతో కొబ్బరి ధరలు పెరగడం లేదు.


గత వారం ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో 10-12 వాహనాల కొబ్బరి రాబడి కాగా నాణ్యమైన సరుకు రూ. 8800-9000, మీడియం రూ.8000, యావరేజ్ రూ. 7000-7100 మరియు 15-20 వాహనాల కొబ్బరి కాయల రాబడి కాగా, పాత కాయలు రూ. 9450-9525, మీడియం రూ.8900 9000, కొత్త సరుకు రూ. 8500, మీడియం రూ.7500 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమైంది. పాలకొల్లులో దినసరి 30-35 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, పాత సరుకు రూ. 9900-10,000, మీడియం రూ. 8000-8500, యావరేజ్ రూ. 7000, కొత్త కాయలు నాణ్యమైన సరుకు రూ. 9000, మీడియం రూ. 7000-7500, యావరేజ్ రూ. 6000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమై తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజ రాత్, ఛత్తీస్ఘడ్ ప్రాంతాల కోసం రవాణా అయింది.


కర్ణాటకలోని టిపూర్లో వారాంతపు సంతలో 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 16,800-17,000, వంట కొబ్బరి రూ. 12,000–12,100, మీడియం రూ. 7200-8200, మెరికొ రకం రూ. 9000 మరియు అరిసేకేరి, సి.ఆర్. పట్నం, మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో నాణ్యమైన కు రూ. 16500-17,000, మీడియం రూ. 12,000-13,000, మిల్లింగ్ సరుకు రూ.9000-9200 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని వెల్లకోవిల్, కొడుముడి, ఎలమత్తూర్, అన్నామలై, అవిలుందురై, జలకందపురం ప్రాంతాల మార్కెట్లలో కలిసి వారంలో 6–7 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8500-9100, మీడియం రూ.6500-7500 మరియు పెరుందురైలో గత వారం 5 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8600-9000, కొచ్చి, త్రిచూర్ లో కొబ్బరి నూనె రూ. 14,900-15,000, కోజికోడ్లో రాజాపురి కొబ్బరి రూ. 16,200-16,500, యావరేజ్ రూ. 9250-9350, మిల్లింగ్ కొబ్బరి రూ. 9250-9400, దిల్పసంద్ రూ. 9500, బంతి కొబ్బరి రూ. 14,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కాంగేయంలో కొబ్బరి రూ. 8600, స్పెషల్ రూ. 8700-8800 మరియు కొబ్బరినూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 1950-1990 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog