ఇనుమడించిన ఉత్పత్తితో పురోగమించని కొబ్బరి ధరలు

 


01-02-2022

 ఈ ఏడాది గణనీయంగా కొబ్బరి ఉత్పత్తితో పాటు ఉత్పాదక కేంద్రాలు మరియు కిరాణా వ్యాపారుల వద్ద పాత సరుకు నిల్వలు అమ్మకం కాకుండా మూలుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పాత సరుకు సరఫరా కొనసాగుతున్నందున ధరలు పురోగమించడంలేదు. అంతేకాకుండా, మార్చిలో రాబడులు పోటెత్తుతున్న తరుణంలో ధరలు మరింత దిగజారగలవని స్పష్టమవుతున్నది. దేశంలోని వినియోగ రాష్ట్రాలలో కిరాణా వ్యాపారులు ఈసారి సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరచడంలేదు.




 ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో ప్రతి రోజు 100-150 టన్నుల కొబ్బరి రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 8700-8750, మీడియం రూ. 7500-7800, యావరేజ్ రూ.7300-7500 మరియు పాలకొల్లులో 25-30 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, నాణ్యమైన పునాస రకం సరుకు రూ. 9500, మీడియం రూ. 8500, యావరేజ్ రూ. 5500, కొత్త కాయలు నాణ్యమైన సరుకు రూ.9000, మీడియం రూ.7500, యావరేజ్ రూ. 5000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని టిపూర్లో వారాంతపు సంతులో 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 17,250-17,500, కిరాణా రకం మీడియం సరుకు రూ.17,800-18,000, కిరాణా రకం రూ.13,000-13,100, మీడియం రూ. 7500–8500, మిల్లింగ్ కొబ్బరి రూ. 10,000-10,800, 

అరిసేకరి, సి.ఆర్. పట్నం మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 2 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 16,800–17,000, మీడియం రూ. 15,000, మిల్లింగ్ సరుకు రూ. 10,000-11,000 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని కాంగేయంలో సాదా రూ. 8600, మిల్లింగ్ స్పెషల్ రూ. B800-9000, మెరికో రూ. 8700-8900 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 1900-1950, వెల్లకోవిల్, అన్నామలై, అవిలుందురై ప్రాంతాల మార్కెట్లలో 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8780-9175, మీడియం రూ. 6500-7500 మరియు 

కొచ్చి, త్రిచూర్లలో కొబ్బరి నూనె రూ. 14,900, పెరుందురైలో 8 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9100-9800, కోజికోడ్లో రాజాపురి కొబ్బరి రూ. 16,400, రాసి రూ. 8900, మిల్లింగ్ కొబ్బరి రూ. 9300, బంతి కొబ్బరి రూ. 14,900, దిల్వనంద్ రూ. 9400 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ. 30,000, వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 16,500, ఎండు సరుకు రూ. 11,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం