పెరిగిన కొబ్బరి సరఫరా

 

దేశంలో ప్రస్తుతం హోళి పండుగ డిమాండ్ తగ్గి, రాబోవు ఉగాది పండుగ కోసం ఎడ్వాన్స్ కొబ్బరి కాయలు కొబ్బరి కొనుగోలు చేశారు. తద్వారా డిమాండ్ కొరవడడంతో ధరలు స్థిరంగా మారాయి. ఈ ఏడాది ఉత్పత్తి అధికంగా ఉండడంతో పాటు ఇంతవరకు పాత సరుకు సప్లై కొనసాగుతున్నట్లు సమాచారం. దీనితో ధరలు నిలకడగా ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో గత వారం 800-1000 బస్తాల కొబ్బరి రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 9700-10,000, మీడియం రూ. 8500- 8800, యావరేజ్ రూ.7700-8000 మరియు ప్రతి రోజు 30-40 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, పాత సరుకు రూ. 9400-9500, మీడియం రూ. 7900 -8000, యావరేజ్ రూ. 6200- 6500, మరియు మిల్లింగ్ రకం రూ.8900-9000, ఎండు సరుకు రూ. 11,800-12,000 ధరతో వ్యాపారమైంది. పాలకొల్లులో గత వారం 30-35 వాహనాల కొబ్బరికాయల రాబడిపై నాణ్యమైన పాత సరుకు 9200-9500, మీడియం రూ. 7800-8000, యావరేజ్ రూ. 6350-6500 మరియు నాణ్యమైన కొత్త సరుకు రూ. 8000-8200, మీడియం రూ.6850 - 7000, యావరేజ్ రూ. 5850 – 6000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమెంది. 

కర్ణాటకలోని టిపూర్లో వారాంతపు సంతలో 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 17,250 -17,350, కిరాణా రకం సరుకు రూ. 18,000, మీడియం రూ. 12,100 -12,500, యావరేజ్ రూ.8200 -8500, మెరికో రకం రూ. 9800 10,000, మిల్లింగ్ కొబ్బరి రూ. 9500-9700 మరియు అరిసేకేరి, సి.ఆర్. పట్నం, మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 2000 బస్తాల కొబ్బరి రాబడి పై నాణ్యమైన సరుకు రూ. 15,000-17,350, మీడియం రూ. 13,000-14,000, మిల్లింగ్ సరుకు రూ. 9500-9800 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని కాంగేయంలో వారంలో 300-400 బస్తాల రాబడి కాగా, కొబ్బరి సాదా రూ. 9200, మిల్లింగ్ స్పెషల్ రూ. 9200, మెరికో రూ. 9350 ప్రతి క్వింటాలు మరియు కాంగేయం, ఊటుకులి ప్రాంతాలలో కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 2100 -2130, వెల్లకోవిల్, అన్నామలై, అవిల్ పుందురై, కొడు ముడి, జలకందపురం ప్రాంతాల మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాల సరుకు రాబడిపైనాణ్యమైన సరుకు రూ. 9000 -9365, మీడియం రూ.7000 - 7500 మరియు పెరుందురె లో గత P వారం 5 వేల బస్తాల రాబడిపై రూ. 8000-8200, కొచ్చి, త్రిచూర్ లో కొబ్బరి నూనె రూ. 15,300 -15,400, కోజికోడ్లో రాజాపురి కొబ్బరి రూ. 15,600, రాసి రూ. 9200, మిల్లింగ్ కొబ్బరి రూ. 9700, దిల్ పసంద్ రూ. 9800, బంతి కొబ్బరి రూ. 13,600 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ. 32,500, వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 15,600, ఎండు సరుకు రూ. 11,500, మిల్లింగ్ సరుకు రూ. 9700 ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog