కంటిమీద కునుకు కరవైన నువ్వుల స్టాకిస్టులు

 


19-12-2021

 ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి తగ్గినందున ఇప్పడిముబ్బడిగా సరుకు నిల్వ చేశారు. అయితే, ఎగుమతి వ్యాపారం డీలా పడినందున ధరలు చైతన్యం కోల్పోయాయని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా జనవరి మూడో వారం నుండి స్టాకిస్టులు తమ సరుకు బయటకు తీసే అవకాశం ఉంది. ఎందుకనగా జనవరి నుండి రబీ సీజన్ పంట రాబడులు మరియు మే నెల నుండి గ్రీష్మకాలం పంట రాబడులు ప్రారంభం కానుండడమే ఇందుకు నిదర్శనం.


 రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, గంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాల రాబడిపై తెల్లనువ్వులు రూ. 10,000-11,000, గజ్జర్ నువ్వులు రూ. 9000-9700 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతనుసారం వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హల్లింగ్ సరుకు రూ. 10,600-10,700, 98.2 రకం రూ. 10,800, 

ఆగ్రాలో హల్లింగ్ సరుకు రూ. 10,400-10,500, 99.1 సరుకు రూ. 11,40 1,500, న్పూర్ హల్లింగ్ సరుకు రూ. 10,800-10,900, 98.2 సరుకు రూ. 11,100 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. 

గుజరాత్లోని రాజ్కోట్, జూనాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 8-10 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 10,950-11,200, మీడియం రూ. 10,600-10,850, యావరేజ్ రూ. 10,350-10,500, నల్లనువ్వులు ప్రీమియం రూ. 12,250-13,000, జడ్ బ్లాక్ రూ. 11,500-13,250, యావరేజ్ రూ. 10,500-11,500, క్రషింగ్ రకంరూ. 8000-9000 ధరతో వ్యాపారమైంది.

 కర్నాటకలోని ముదగల్, అరిసెకేరి, కల్బుర్గి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో 300 బస్తాల అమ్మకంపె నాణ్యమైన సరుకు రూ. 10,500-11,200, 

ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 8500-9000, మీడియం రూ. 6500-7500, కడప, రాజంపేట ప్రాంతాలలో ప్రతి రోజు 1-2 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై హైదరాబాద్ డెలివరి రూ. 10,500 10,600 మరియు విరుధ్నగర్ కోసం 75 కిలోల బస్తా రూ. 7600, పశ్చిమబెంగాల్లో మైక్రో-క్లీన్ రూ. 9200-9500, అన్-క్లీన్ రూ. 8500-8600 ధరతో వ్యాపారమె తమిళనాడు కోసం రవాణా అయింది.

Comments

Popular posts from this blog