రబీలో పెరిగిన మొక్కజొన్న సేద్యం

 

19-12-2021

ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 17 వరకు మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 10.25 ల.హె. నుండి పెరిగి 11.22 ల.హె.కు విస్తరించింది. వచ్చే గ్రీష్మకాలం కోసం బీహార్తో పాటు మరికొన్ని తూర్పు రాష్ట్రాలలో మొక్కజొన్న సేద్యం భారీగా విస్తరించగలదని భావిస్తున్నారు. తద్వారా ఫిబ్రవరి చివరి వారంలో ధరలు ఇనుమడించిన తరుణంలో స్టాకిస్టులు తమ సరుకు నిల్వలు ఖాళీ చేయడం శ్రేయస్కరం. 


ప్రస్తుత కర్ణాటకలో వారంలో 50 వేల బస్తాలు, ఒడిశ్శాలోని ఉత్పాదక కేంద్రాల వద్ద ప్రతి రోజు 10-12 వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నది. ఎగుమతి వ్యాపారుల ఎడతెరిపిలేని కొనుగోళ్లతో ఒడిశ్శా ఉత్పాదక కేంద్రాల నుండి పశ్చిమ బెంగాల్ లకు రేక్ల ద్వారా రూ. 1950-2000 ధరతో డెలివరి వ్యాపారమవుతున్నది. కర్ణాటకలోని చిత్రదుర్గ్, బళ్లారి, చెల్లకేరి ప్రాంతాలలో రూ. 1550-1750, ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, మడకశిర ప్రాంతాలలో 1550–1600, బెంగుళూరు డెలివరి రూ. 1700-1750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, సాలూరు చీపురు పల్లి ప్రాంతాలలో రూ. 1700-1725, విశాఖపట్నం పోర్డు డెలివరి రూ. 1840-1850, పెద్దాపురం డెలివరి రూ. 1850-1870, కోల్కతా కోసం రూ. 2040-2050, తెలంగాణలోని మహబూబ్నగర్, నాగర్కర్నూలు, అచ్చంపేట, జడ్చర్ల, వరంగల్ ప్రాంతాల మార్కెట్లలో రూ. 1670-1750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడు మార్కెట్లలో ప్రతి రోజు 8-10 వేల బస్తాల రాబడిపై కల్లకుర్చిలో స్థానికంగా రూ. 1350-1850, తిరుకోవిలూరు, చిన్నసేలంలో 800 బస్తాలు, ఉలుండరుపేట, శంకరాపురం, విరుధాచలం ప్రాంతాలలో రూ. 1500-1600, ఈరోడ్, నమక్కల్ డెలివరి రూ. 1900-2000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog