కొనుగోళ్లు లేని కందిపప్పు

 


07-12-2021

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల కుండపోత వర్షాలతో కంది పంటకు నష్టం వాటిల్లినందున కర్ణాటకలో కొత్త కందులు నాసిరకంగా వస్తున్నాయి. అయితే, సోలాపూర్లో కర్ణాటక నుండి వారంలో 4-5 వేల బస్తాల కొత్త కందుల రాబడిపై రూ.6300-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కల్బుర్గి, మహారాష్ట్రలోని లాతూర్, తెలంగాణలోని తాండూరు ప్రాంతాలలో ఇప్పటి వరకు కొత్త సరుకు రాబడులు ప్రారంభం కాలేదు. మరో 15 రోజులు పట్టగలదని భావిస్తున్నారు. పంట దిగుబడులు తగ్గగలవని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కావున మహారాష్ట్రలో రైతులు మరియు వ్యాపారుల వద్ద నిల్వ సరుకు విక్రయించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.


 విదర్భలోని అకోలా, బుల్డానా, వాషిం ప్రాంతాలలో వర్షాలు కురిసినందున పంటకు తెగులు సోకే అవకాశం ఉంది. దిగుబడులు కూడా తగ్గగలవు. ఇలాంటి పరిస్థితులలో నాణ్యమైన సరుకు కోసం భారీ డిమాండ్ నెలకొనగలదు. అయితే, పప్పు మిల్లర్లు ఈ ఏడాది నష్టాలనే చవి చూస్తున్నాయి. అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోళ్లు చేపట్టగలరు.


అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ మరియు లింక్లి కందులు 10 డాలర్లు తగ్గి 750 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు కొత్త సరుకు తగ్గి రూ. 5900, అరుశ రూ. 5100-5200, మొజాంబిక్ గజరి రూ. 5000-5100, మాలవి కందులు రూ. 4650-4750, సూడాన్ సరుకు రూ.6050-6100, మట్వారా రూ. 5050-5100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని ఉద్గిర్, దెగ్లూర్, లాతూర్, సోలాపూర్ ప్రాంతాల కందులు చెన్నై డెలివరి రూ.6500-6700,

 కర్ణాటక ప్రాంతం కందులు ఇండరో డెలివరి రూ.6200-6300, 

మహారాష్ట్ర ప్రాంతం తెల్లకందులు రూ. 6000-6100,

 మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం కందులు కట్ని డెలివరి రూ. 6550-6600, 

కట్ని, బిలాస్పూర్, భాటాపారాలో మేలిమి రకం పప్పు రూ. 8700-8800,

 లాతూర్లో మారుతి కందులు రూ. 6000-6300, తెల్లకందులు రూ. 5500-6000, 

అకోలాలో గులాబీ కందులు రూ. 6300-6325, 

గవరానిలో రూ. 6200, మేలిమి రకం పప్పు మీడియం రూ. 8500-8600, నాణ్యమైన సరుకు రూ. 8800-8900, సవానంబర్ పప్పు రూ. 8200-8450 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు రూ. 6050, పప్పు సార్టెక్స్ పాలిష్ సరుకు రూ. 8400, నాన్-సార్టెక్స్ రూ.8200, మాచర్లలో ఒంగోలు ప్రాంతం పాత కందులు రూ. 6000,

 పొదిలి ప్రాంతం సరుకు రూ. 6100, పప్పు సార్టెక్స్ పాలిష్ రూ. 8200, ఎండు సరుకు రూ. 8400, 

కర్ణాటకలోని గుల్బర్గాలో కందులు రూ. 6000-6200, | పప్పు మేలిమి రకం రూ. 8400-8800 మరియు మధ్య ప్రదేశ్లోని పిపరియాలో ప్రతి రోజు 250-300 బస్తాల సరుకు రాబడిపై రూ. 5700-5800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog