వాతావరణ సానుకులతతో శరవేగంగా చేపడుతున్న రబీ సేద్యం

07-12-2021

 దీర్ఘకాలం పాటు రుతుపవనాల వర్షాలు కురిసినందున నేలలో సమృ ద్ధిగా నిక్షిప్తమైన తేమ వలన ప్రస్తుత రబీ సీజన్లో డిసెంబర్ 3 వరకు దేశవ్యాప్తంగా సాధారణ సేద్యంతో పోలిస్తే 625.14 ల.హె.కు గాను 70 శాతం వృద్ధి చెందింది. మరియు గత ఏడాదితో పోలిస్తే 413.11 ల.హె. నుండి 438.51 ల.హె. కు విస్తరించింది. వాతావరణం సానుకూలంగా పరిణమించినందున ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి సేద్యం మొత్తం సాధారణ ప్రాంతాలకు కూడా విస్తరించగలదు.


 ఎందుకనగా, ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 3 వరకు దేశంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 50 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 85 శాతం ప్రాంతాలలో సాధారణంతో పోలిస్తే అధిక వర్షపాతం నమోదైంది. తద్వారా సేద్యం చేపట్టిన ప్రాంతాలలో పంటలకు ప్రయోజనం చేకూరుతున్నది. 

ఈ ఏడాది డిసెంబర్ 3 వరకు దేశంలో నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 64.73 ల.హె. నుండి 29 శాతం వృద్ధి చెంది 83.65 ల.హె.కు విస్తరించింది. ఇందులో ఆవాలు 59.57 ల.హె. నుండి 30 శాతం పెరిగి 77.62 ల.హె.కు విస్తరించింది. ప్రభుత్వం 2021-22 కోసం 75.80 ల.హె. నుండి ఉత్పత్తి 122.40 ల.ట. లక్ష్యం నిర్ధారించింది. అయితే, సేద్యం నిర్ధారిత లక్ష్యం అధిగమించడమే కాకుండా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. 

రుతుపవనాలు నిష్క్రమించిన తర్వాత కూడా వర్షాలు సమృద్ధిగా కురిసినందున ఇప్పటి వరకు గోధుమ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 193.42 ల.హె. నుండి వృద్ధి చెంది 266 ల.హె.కు విస్తరించింది. 

అపరాలు గత ఏడాదితో పోలిస్తే 113.48 ల.హె. నుండి స్వల్పంగా పెరిగి 113.98 ల.హె.కు విస్తరించింది. ఇందులో శనగ సేద్యం 80.1 ల.హె. నుండి 81.43 ల.హె.కు, వరి సేద్యం 9.48 ల.హె. నుండి 9.74 ల.హె.కు విస్తరించగా, ముతక ధాన్యాలు 32.11 ల.హె. నుండి తగ్గి 30.49 ల.హె.కు పరిమితమైంది.

 శనగ సేద్యం : ప్రస్తుత రబీ సీజన్లో డిసెంబర్ 1 వరకు దేశంలో శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 80.01 ల.హె. నుండి స్వల్పంగా పెరిగి 81.43 ల.హె.కు విస్తరించింది. ఇందులో రాజస్తాన్లో 18.05 ల.హె. నుండి 18.46 ల.హె., కర్ణాటకలో 9.62 ల.హె. నుండి 9.80 ల.హె., ఉత్తరప్రదేశ్లో 5.53 ల.హె. నుండి 5.63 ల.హె., మహారాష్ట్రలో 13.63 ల.హె. నుండి 14.19 ల.హె., గుజరాత్లో 5.33 ల.హె. నుండి 6.51 ల.హె.కు విస్తరించగా, మధ్య ప్రదేశ్లో 20.42 ల.హె. నుండి తగ్గి 20.02 ల.హె., ఆంధ్రప్రదేశ్లో 2.94 ల.హె. నుండి 2.72 ల.హె., ఛత్తీస్గఢ్ 2.22 ల.హె. నుండి 1.36ల.హె.కు పరిమితమైంది.

 సిరిశనగః ప్రస్తుత రబీ సీజన్ లో డిసెంబర్ 1 వరకు దేశంలో సిరిశనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.48 ల.హె. నుండి పెరిగి 13.03 ల.హె.కు విస్తరించింది. ఇందులో మధ్య ప్రదేశ్ 4.27 ల.హె. నుండి 5.12 ల.హె.కు విస్తరించగా ఉత్తరప్రదేశ్లో 5.56 ల.హె. నుండి 5.51 ల.హె., పశ్చిమ బెంగాల్లో 83 వేల హెక్టార్ల నుండి 68 వేల హెక్టార్లకు పరిమితమైంది.

బఠాణీలు : ప్రస్తుత రబీ సీజన్ లో డిసెంబర్ 1 వరకు దేశంలో బఠాణీల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.05 ల.హె. నుండి తగ్గి 7.92 ల.హె.కు విస్తరించింది. ఇందులో మధ్య ప్రదేశ్ 2.17 ల.హె. నుండి తగ్గి 1.93 ల.హె.కు పరిమితం కాగా, ఉత్తరప్రదేశ్లో 4.75 ల.హె. నుండి 4.95 ల.హె.కు విస్తరించింది. 

మినుములు : ప్రస్తుత రబీ సీజన్లో డిసెంబర్ 1 వరకు దేశంలో మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.50 ల.హె. నుండి తగ్గి 3.22 ల.హె.కు పరిమితమైంది. ఇందులో తమిళనాడులో 2.23 ల.హె. నుండి తగ్గి 1.66 ల.హె.కు పరిమితం కాగా, ఆంధ్రప్రదేశ్లో 67 వేల హెక్టార్ల నుండి 82 వేల హెక్టార్లకు, ఒడిశ్శాలో 40 వేల హెక్టార్ల నుండి 41 వేల హెక్టార్లకు విస్తరించింది.

పెసలు : ప్రస్తుత రబీ సీజన్లో - డిసెంబర్ 1 వరకు దేశంలో పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 85 వేల హెక్టార్ల నుండి తగ్గి 64 వేల హెక్టార్లకు పరిమితమైంది. ఇందులో ఒడిశ్శాలో 45 వేల హెక్టార్ల నుండి 25 వేల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 11 వేల హెక్టార్ల నుండి 9 వేల హెక్టార్లకు పరిమితం కాగా, తమిళనాడులో 23 వేల హెక్టార్ల నుండి పెరిగి 36 వేల హెక్టార్లకు విస్తరించింది.

Comments

Popular posts from this blog