అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గిన మినుముల ధరలు

 

19-12-2021

డిసెంబర్ వరకు దేశంలో రబీ మినుము పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.47 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 4.25 లక్షల హెక్టార్లకు చేరింది. అయితే, ఇతర ఉత్పాదక దేశాలలో కంది, మినుము పంటల విస్తీర్ణం పెరగడం మరియు ఫిబ్రవరి నుండి అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా పెరిగే అవకాశం ఉండడంతో మయన్మార్ ఎఫ్ఎక్యూ 70 డాలర్లు తగ్గి 810 డాలర్లు మరియు ఎస్యూ 900 డాలర్లు ప్రతిటన్ను ప్రతిపాదించబడడంతో ముంబాయిలో ఎఫ్ఎక్యూ కొత్త రూ.150 తగ్గి రూ. 6800, పాత రూ. 6700, చెన్నైలో ఎస్యూ రూ. 7300, ఎఫ్ఎక్యూ రూ. 6700, కోల్కత్తాలో ఎఫ్ఎక్యూ రూ. 6850 ధరతో వ్యాపారమయింది.


కృష్ణాజిల్లాలో పాలిష్ మినుములు రూ. 100 తగ్గి రూ. 7500, సాదా రూ.7200, 

నంద్యాలలో పాలిష్ రూ. 7100, సాదా రూ. 6900,

 ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలలో పాలిష్ రూ. 7000, సాదా రూ. 6800, 

విజయవాడలో గుండు పాలిష్ రూ. 12000, మీడియం రూ. 10200, పప్పు రూ. 8400-8900 ధరతో వ్యాపారమయింది.

 అయితే, సంక్రాంతి పండుగ కోసం దక్షిణాది రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉండగలదు. ఇందుకోసం రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర సరుకు సర ఫరా అవుతున్నందున ధరలు స్థిరంగా ఉన్నాయి.


తాండూరులో మినుములు రూ. 4000-6800,

 కలుబరిగ, బిదర్ ప్రాంతాలలో రూ. 5200-7000,

 మహారాష్ట్రలోని లాతూరులో రూ. 6000-7400,

 సోలాపూర్ లో 5000-7300,

 జాల్నాలో రూ.3000-6300 లోకల్ లూజు మరియు

 అకోలాలో లారీ బిల్టీ రూ. 6600-6800, 

జల్గాంవ్లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6500, మహారాష్ట్ర సరుకు రూ. 6700, 

అకోలాలో మోగర్ మీడియం రూ. 9500-9600, బోల్డు రూ. 9900-10100 మరియు

మధ్యప్రదేశ్ మార్కెట్లలో నాణ్యమైన సరుకు రూ. 6000-6550, మీడియం రూ. 3550-4000 ధరతో వ్యాపారమయింది.

 అయితే, రాజస్తాన్ లోని కేక్తిలో 1500 బస్తాల రాబడిపై రూ. 5700-6300, 

కోటా, సుమేర్ పూర్, సివాయ్ మధోపూర్ ప్రాంతాలలో రూ. 5000-6000, 

ఉత్తర ప్రదేశ్ లోని మహోబా, లలిత్పూర్ ప్రాంతాలలో రూ. 5000-6000, 

చందౌసీ, వజీర్ గంజ్ ప్రాంతాలలో రూ. 6700-6800 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog