అతివృష్టి వలన చింతపండు రాబడులు ఆలస్యమయ్యే అవకాశం

 
06-12-2021

దక్షిణాదిలోని ప్రముఖ చింతపండు ఉత్పాదక రాష్ట్రాలలో తరచుగా కురుస్తున్న వర్షాల వలన చింతపండు పంటకు నష్టం వాటిలడంతో పాటు కొత్త సరుకు రాబడులు జాప్యం కాగలవని భావిస్తున్నారు. ఎందుకనగా, తాజాగా మరో తుపాను కేంద్రీకృతమై ఉన్నందున ఒడిశ్శా మరియు తీర ప్రాంతమైన విజయనగరం, శ్రీకాకుళం మరియు ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుత తరుణంలో చింతపండు పక్వానికి రావడానికి జాప్యం ఏర్పడుతున్నది. 


తమిళ నాడులో నాణ్యమైన సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున గత వారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశ్శా, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని చింతపండు ఉత్పాదక కేంద్రాలలో కలిసి 200 వాహనాలకు పైగా సరుకు విక్రయించినప్పటికీ ధరలు చైతన్యం చెందలేదు. వర్షాలు ఇక ముందు కూడా ఇలాగే కురిసినట్లయితే పంటకు నష్టం వాటిల్లడమే కాకుండా, కొత్త సరుకు రాబడులు జాప్యం కాగలవని వ్యాపారులు భావిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూపుర్ మార్కెట్లో గత వారం 20-25 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, సిల్వర్ రకం రూ. 20,000-25,000, మేలిమి రకం రూ. 17,000-18,500, మీడియం రూ. 13,000-14,500, యావరేజ్ సరుకు రూ. 11,000-12,000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8000-9000, మీడియం రూ. 7000-8000, యావరేజ్ రూ. 5500-6500, 

పుంగనూరు, పలమనేరు, మదనపల్లిలో వర్షాలు కురిసినందున రాబడులు తగ్గి 10-15 వాహనాలకు పరిమితం కాగా, మేలిమి రకం రూ. 11,000-12,000, చపాతీ రూ. 9000-11,000, ఫ్లవర్ రూ. 7000-9000, గింజ సరుకు రూ. 3000-3500, 

విజయనగరం, పార్వతీపురం, రాయ్ఢ్, సాలూరు ప్రాంతాలలో గత వారం శీతలగిడ్డంగుల నుండి 30-35 లారీల చింతపండు అమ్మకం కాగా, నాణ్యమైన సెమీ ఫ్లవర్ రూ. 8000-8500, మీడియం రూ. 6000, యావరేజ్ రూ. 5400-5500, గింజ సరుకు స్థానికంగా రూ. 3200-3300 మరియు 

ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో 18-20 వాహనాల ఎసి సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 3400-3500, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 20 వాహనాల సరుకు అమ్మకంపై ఓం బ్రాండ్ రూ. 9000, మీడియం ఫ్లవర్ రూ. 6800-7500, గింజ సరుకు రూ. 2600-3000 ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. 

తరానా, ఉల్లో 8-10 వాహనాల ఎసి సరుకు అమ్మకం కాగా, రంగువెలిసిన గింజ సరుకు రూ.2500-2600, రంగు సరుకు రూ.3000-3200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బెల్గాం, తుంకూరు, మైసూరు మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 6-7 వాహనాలు సరుకు అమ్మకంపై మహారాష్ట్ర ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 9000-10,000, స్థానికంగా రూ. 7000 -8000, సిల్వర్ రూ. 18,000 -20,000, మేలిమి రకం రూ. 13,000- 15,000, మీడియం రూ. 10,000 -11,000, ఫ్లవర్ రూ. 5500- 6000 ప్రతి క్వింటటాులు ధరతో వ్యాపారమైంది.

 తమిళనాడులోని పాపరంపట్టిలోని శీతలగిడ్డంగుల నుండి గత వారం 12-15 వాహనాల సరుకు రాబడిపై మహారాష్ట్ర ఎసి చపాతీ రూ. 9000, మహారాష్ట్ర నాణ్యమైన గింజ సరుకు రూ. 3000-3200, స్థానికంగా రూ. 3000, నలగ్గొట్టని చింతపండు రూ. 2300-2400 మరియు సేలంలో 10-12 వాహనాల చింతపండు అమ్మకం కాగా, మేలిమి రకం రూ. 12,000-13,000, మహారాష్ట్ర చపాతీ రూ. 9000-9500, ఫ్లవర్ రూ. 8000-8500, రంగు వెలిసిన గింజ సరుకు రూ.3000-3500 మరియు కంబంలో 7-8 వాహనాలు, 

ధర్మపురిలో 4-5 వాహనాలు, దిండిగల్లో 6-7 వాహనాల సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ. 8500 -9500, చపాతీ రూ. 9000 11,000, గింజ సరుకు రూ. 3000 3200 మరియు క్రిష్ణగిరిలో 8-10 వాహనాలు నాణ్యమైన గింజ సరకు రూ. 5000-5500, కర్ణాటక సరుకు రూ. 3200-3500, స్థానికంగా రూ. 3000–3200 ధరతో వ్యాపారమైంది.


చింతగింజలు : ఆంధ్ర ప్రదేశ్ లోని హిందుపూర్ మార్కెట్లో చింతగింజల ధర రూ. 1850, పప్పు సూరత్, అహ్మదాబాద్ డెలివరి రూ. 3250, ఎక్స్పోర్ట్ రకం రూ. 4400-4500, స్థానికంగా రూ. 4000-4200 మరియు సాలూరులో 2-3 వాహనాలు సరుకు అమ్మకంపై స్థానికంగా చింతగింజలు రూ. 1550, పుంగనూరు డెలివరి రూ. 1725, పుంగనూరులో రూ. 1800-1825, పప్పు రూ. 3200-3250, పౌడర్ రూ. 4500, సిద్దిపేటలో చింతగింజలు రూ. 1800 – 1825, పప్పు రూ. 3250– 3300, పౌడర్ రూ. 4200-4250 మరియు మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో 1 వాహనం చింతగింజల అమ్మకంపై బార్షీ డెలివరి రూ. 1900-1950 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog