పెరుగుతున్న పసుపు వాయిదా ధరలు

 

19-12-2021

దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పాదక రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సేద్యం భారీగా విస్తరించిన తర్వాత కురిసిన భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో పంటకు కీటక సంక్రమణం వలన పంట దిగుబడులు 15-20 శాతం తగ్గే అంచనా వ్యక్తమవుతున్నది. మరి కొద్ది నెలలలో కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, 25-30 లక్షల బస్తాల పాత సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఉత్పత్తి 30-40 శాతం తగ్గుతుందని వదంతులు ప్రచారం చేస్తూ స్టాకిస్టు వ్యాపారులు ధరలు భారీగా పెంచి సరుకు విక్రయించి బయట పడుతున్నారు. అంతేకాకుండా, అధిక ధరతో వాయిదా విక్రయించి లాభాలు మూటగట్టుకుంటున్నారు. 


సీజన్లో ధరలు ఇనుమడించినట్లయితే రైతుల సరుకు రాబడులు మార్కెట్లకు వెల్లువెత్తగలవు. ఎందుకనగా, చాలా కాలం తర్వాత తొలిసారి సీజన్లో ధరలు ఇనుమడిస్తున్నందున రైతులు తమ సరుకు వెనువెంటనే విక్రయించగలరు. దీని ప్రభావం 2022-23 సీజన్ లో పొడసూపగలదు. గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద కిరాణా వ్యాపారులు మసాలా తయారీదారులు కొనుగోళ్లు జోరందుకున్నందున ధర రూ. 400-500 ప్రతి క్వింటాలుకు ఎగబాకింది.ఎన్ సిడి ఇఎక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా రూ. 7822 తో ప్రారంభమైన గురువారం వరకు రూ. 1358 వృద్ధి చెంది రూ. 9180,ఏప్రిల్ వాయిదా రూ. 8870 తో మొదలుపెట్టి శుక్రవారం వరకు రూ. 268 ఎగబాకి రూ. 9138 వద్ద ముగిసింది.


తెలంగాణలోని నిజామాబాద్లో గత వారం 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై ధర రూ. 400-500 వృద్ధి చెంది అన్-పాలిష్ కొమ్ములు రూ. 7700 -8200, దుంపలు రూ. 7500-7600, పాలిష్ కొమ్ములు రూ. 8700-8800, దుంపలు రూ. 8300-8400 మరియు 

ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 2500 బస్తాలు కొమ్ములు నాణ్యమైన సరుకు రూ. 6800-7000, పుచ్చు సరుకు రూ. 5500 – 5800, 

మహారాష్ట్రలోని హింగోలిలో గత సోమ, బుధ, శుక్రవారాలలో కలిసి 17–18 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 7800-8200, నాణ్యమైన సరుకు రూ.8500-8600, దుంపలు రూ. 7400-7800, 

నాందేడ్లో 10-12 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు నాణ్యమైన సరుకు రూ. 9000-9500, మీడియం రూ. 8000-800, దుంపలు రూ. 7500-8100, 

బస్మత్ నగర్లో 7-8 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు మరియు దుంపలు నాణ్యమైన రూ. 8700-9500, మీడియం రూ. 7000-7700, 

సాంగ్లీలో 5-6 వేల నాణ్యమైన బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి సరుకు రూ. 9800-10,000, మీడియం రూ. 7800-8000, దేశీ కడప రూ. 7500–7700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని ఈరోడ్లో గత వారం 20-25 వేల బసాలు, రాసిపురంలో 5 వేల బస్తాల రాబడిపై కొమ్ములు నాణ్యమైన సరుకు రూ.9000-9500, మీడియం రూ. 7000-7200, దుంపలు రూ. 8000-8200, మీడియం రూ. 7000-7500, పుచ్చు సరుకు కొమ్ములు మరియు దుంపలు రూ. 5000 -5500, 

పెరుందరైలో 1500-2000 బస్తాలు కొమ్ములు రూ. 6689 9339, దుంపలు రూ. 6399-8091 ధరతో వ్యాపారమైంది.




Comments

Popular posts from this blog