కొత్త వేరుశనగ పంట ధరకు ఢోకా లేదు - తమిళనాడు వేరుశనగ విత్తులకు గుజరాత్ లో భారీ డిమాండ్ - వేరుశనగ పంట కోసం లభ్యమైన కేంద్ర నిధులు

 

05-12-2021

2022 లో వేరుసెనగ ఉత్పత్తి గణనీయంగా రాణిస్తున్నప్పటికీ ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారే అవకాశం లేదని వ్యాపారులు భావిస్తున్నారు. దేశంలో సోయానూనె వినియోగం భారీగా వృద్ధి చెందినప్పటికీ సోయాచిక్కుడు ధరలు గత ఏడాదితో పోలిస్తే ఎగబాకాయి. సన్ఫ్లవర్ నూనె దిగువుతులకు కళ్లెం పడింది, నత్తనడకేశాయి. కుసుమల నిల్వలు దాదాపు లేవనే చెప్పవచ్చు. ఈ సారి నువ్వుల ఉత్పత్తి కూడా అంతంతమాత్రమే ఉంది. పామాయిల్ నూనె ధర మార్చి వరకు దిగివచ్చే అవకాశం లేదు. ఈ ప్రభావమే సోయాచిక్కుడు మరియు వేరుసెనగకు ప్రయోజనం చేకూరుతున్నది. భారత్ నుండి ఎగుమతులు మరియు రాబోయే సీజన్ సేద్యం చేపట్టేందుకు విత్తులకు డిమాండ్ నెలకొన్నందున ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండే ధరలు ఇనుమడించాయి. కుసుమ లాంటి నూనెల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. ప్రభుత్వం నిల్వ పరిమితి విధించినందున ప్రతి వర్తకుడు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున నూనె మిల్లులకు ఎడతెరిపి లేకుండా క్రషింగ్ చేపడుతున్నాయి.


 గుజరాత్లో వేరుసెనగ ధరలు ఎగబాకినందున ప్రభుత్వ కొనుగోళ్లు నామమాత్రంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ధరలు తగ్గినవేళ కొనుగోలు చేయడం పెరిగినప్పుడు విక్రయించడం శ్రేయస్కరం. కావున ఏడాది పొడవునా ధరలు ఇనుమడిస్తూనే ఉంటాయి. మలేషియా పామాయిల్ ఉత్పత్తి వృద్ధి నమోదు చేసినప్పటికీ వచ్చే ఏడాది మే నెలలో రంజాన్ మాసం సమాప్తమైన తర్వాత ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ప్రముఖ వంటనూనెల విశ్లేషకులు దొరాబ్ మిశ్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 180 ల.ట. ఉత్పత్తి అయినట్లు తెలుస్తోంది. కావున సరఫరా తగ్గినందున ఫిబ్రవరి వరకు మలేషియా పామాయిల్ బెంచ్ మార్క్ ధర 5000-5400 రింగిటు చేరగలదని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో ధర తగ్గి గరిష్ఠంగా 4800 రింగిట్ మరియు కనిష్ఠంగా 4000 రింగిట్ దిగివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రబీ సీజన్ కోసం మహారాష్ట్ర, గుజరాత్లో గ్రీష్మకాలం కోసం బీహార్ మరియు తూర్పు భారత్లోని అన్ని రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో గణనీయమైన ఉత్పత్తికి అవకాశం ఉంది. ఎందుకనగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరియు రైతులకు లాభసాటి ధరలు లభిస్తున్నందున సేద్యం గణనీయంగా విస్తరించగలదు. తెలంగాణలో రబీ సీజన్ లో వరికి బదులు వేరుసెనగ చేపట్టినందున గత ఏడాది 1,03,521 ఎకరాలకు గాను ఈసారి రెట్టింపై 2,72,314 ఎకరాలకు విస్తరించింది. ఇందులో నాగర్కర్నూలులో సాధారణ సేద్యానికి 16 వేల ఎకరాలు వృ ద్ధి చెంది 1,36,024 ఎకరాలకు చేరింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో వేరుసెనగ ఉత్పత్తి పెంచేందుకు రైతుల కోసం రూ. 45.08 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధిని సమకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్హులైన రైతులకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.


గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం 2-3 లక్షల బస్తాల వేరుసెనగ రాబడిపై తమిళనాడు నుండి విత్తులకు డిమాండ్ నెలకొనడంతో కళ్యాణి హెచ్పీఎస్ గింజలు పోర్టు డెలివరి రూ. 8600-8700, -37 80-90 కౌంట్ రూ. 9200, 50-60 కౌంట్ రూ. 10,500-10,600, పోర్బందర్ డెలివరి రూ.50-55 కౌంట్ రూ.8600, 40-50 కౌంట్ రూ. 8700, టిజె-37 60-70 కౌంట్ ముంబై డెలివరి రూ. 9200-9250, 70-80 కౌంట్ రూ. 9000-9100, రాజ్కోట్ ప్రాంతం వేరుసెనగ రోహిణి 24-నెంబర్ నాణ్యమైన సరుకు రూ.5500-5700, మీడియం రూ.5200-5500, యావరేజ్ రూ. 4900-5200, 37-నెంబర్ నాణ్యమైన రూ.5400-5700, మీడియం రూ. 5100-5250, యావరేజ్ సరుకు రూ.4850-5150, 39-నెంబర్ మీడియం రూ. 5000-5100, యావరేజ్ సరుకు రూ. 4750-4900, జి-20 రకం సరుకు రూ.5500-5750, మీడియం రూ. 5300-5500, యావరేజ్ రూ.5250-5350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని దిసా, గోండల్, పాలన్పూర్, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి గత వారం 1-2 లక్షల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5200-5900, మీడియం రూ. 4950-5000 ప్రతి క్వింటాలు మరియు నూనె 10 కిలోలు రూ.1350-1355, 

ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ, లలిత పూర్ మరియు మధ్య ప్రదేశ్ లోని శివపురి ప్రాంతాలలో కలిసి 50 వేల బస్తాల సరుకు రాబడిపై 4400-4800, 75-85 కౌంట్ రూ. తమిళనాడు డెలివరి రూ. 8500-8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్ కోసం రవాణా అవుతున్నది.


రాజస్తాన్లోని బికనీర్ లో ప్రతి రోజు 80 వేల బసాలు, మెడతాలో 30 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 4800-5400, హెచ్పీఎస్ గింజలు 60-65 కౌంట్ రూ.8400-8500, 60-70 కౌంట్ రూ. 8300, 40-50 కౌంట్ రూ.9100-9200 ధరతో వ్యాపార తమిళనాడు కోసం రవాణా 70-80 కౌంట్ ముంబై డెలివరి రూ. 10,200-10,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో గత వారం 35-40 వేల బస్తాలు వేరుసెనగ రాబడిపై నిమ్ము సరుకు రూ. 4000 - 5000, ఎండు సరుకు రూ. 6500-7300, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర (విత్తుల కోసం) రూ. 10,500, చెన్నై డెలివరి రూ. 9700, కిరాణా రకం రూ. 10,200-10,300,

 కళ్యాణ్ దుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో 50-60 వేల బస్తాలు నిమ్ము సరుకు రూ. 5000-6000, హెచ్ పిఎస్ గింజలు 80-90 కౌంట్ ఎక్స్పోర్టు రకం రూ. 9800, ముంబై కోసం రూ. 10,00-10,200, 70-80 కౌంట్ స్థానికంగా రూ. 10,000, విత్తుల కోసం 8. 10,300-10,500, 60-70 కౌంట్ రూ. 11,500 ధరతో వ్యాపార మైంది. 

కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, లక్ష్మేశ్వర్, హుబ్లీ, రాయిచూర్ ప్రాంతాలలో కలిసి గత వారం 60-70 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6500-7500, నిమ్ము సరుకు రూ. 3500-4500, మీడియం రూ. 6000-6500, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర (9 శాతం) రూ. 9550-9600, కళ్యాణి ప్రత్యక్ష ధర రూ. 8650-8750, 90-100 కౌంట్ రూ. 9450-9500, ఎక్స్పోర్డు రకం 80-90 కౌంట్ రూ. 9750-9800, 90-100 కౌంట్ రూ. 9550-9600, కళ్యాణి రూ. 8800-8850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడు వేరుశనగ విత్తులకు గుజరాత్ లో  డిమాండ్



తమిళనాడులోని తంజావూరులోని రైతులు డిసెంబర్లో వేరుసెనగ సేద్యం చేపట్టి, మార్చిలో నూర్పిళ్లు చేపడుతుంటారు. ఈ కాలంలో చేపట్టిన పంట అత్యంత నాణ్యంగా ఉంటుంది. దీని తర్వాత మరోసారి ఏప్రిల్ చేపట్టిన సేద్యం జూన్-జూలైలో నూర్పిళ్లు ఉంటాయి. తమిళనాడు వ్యాపారులు రాష్ట్రంలో సేద్యం కోసం జిజెజి-9 (గుజరాత్ జునాగఢ్ గ్రౌండ్ నట్-9) వేరుసెనగ విత్తులు శరవేగంతో కొనుగోలు చేస్తున్నారు. మలేషియా, సింగపూర్, వియత్నాం మొదలగు దేశాల దిగుమతి వ్యాపారులు తమిళనాడు వేరుసెనగ కోసం రైతులకు ఆకర్షణీయమైన ధరలు ప్రతిపాదిస్తున్నారు. అంతేకాకుండా, నంబర్-9, 66 మరియు 7 రకాలు సంతృ ప్తికరమైన దిగుబడులు లభిస్తున్నాయి. తమిళనాడులోని పుదుకొట్టై, తంజావూరు, కడలూరు, నాగపట్నం, చెన్నై లాంటి జిల్లాలలో వేరుసెనగ సేద్యం ఉధృతమవుతున్నదని వ్యాపారులు పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వేరుసెనగ విత్తుల కోసం వాతావరణం అనుకూలంగా లేదు. కావున గుజరాత్లోని జామ్నగర్ నుండి కొనుగోళ్లు చేపడుతున్నారు. తద్వారా జామ్నగర్ రైతులు ఈ రెండింటి సేద్యం భారీగా విస్తరించి పండిస్తున్నారు. ఎందుకనగా రైతులకు ఈ రెండు రకాల దిగుబడులు భారీగా రాణిస్తుండడమే ఇందుకు నిదర్శనం. తమిళనాడు వ్యాపారులు ఈ రెండు రకాల విత్తులు అధిక ధరతో కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. పంట సంతృప్తికరంగా వికసిస్తున్నందున అత్యధిక రైతులు వేరుసెనగ సేద్యం కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. అత్యధిక రైతులు తమ సరుకు స్వేచ్ఛా విపణిలో విక్రయిస్తున్నారని జామ్నగర్(గ్రామీణ) శాసన సభ్యుడు రాధ్వజి పటేల్ తెలిపారు. ఎందుకనగా, మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ. 5550 అధిగమిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. దీనితో ప్రభుత్వ కొనుగోళ్లు నామమాత్రంగా ఉన్నాయని చెప్పవచ్చు. 

గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో తమిళనాడు వ్యాపారులు రెండు రకాల కోసం ప్రతి క్వింటాలు రూ. 7000 కు పైగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారని జామ్నగర్ ఎపిఎంసి అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది తమిళనాడులో దాదాపు 40 శాతం వ్యాపారులు పట్టణంలో ఎపిఎంసిలో నమోదైన వ్యాపారులతో పాటు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాపారులు ఈ రెండింటికి సంబంధించి సగటున 220 క్వింటాళ్ల సరుకు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 8 నుండి కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ.5550 తో ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే, కేవలం 9 శాతం రైతులు మాత్రమే ప్రభుత్వ ఏజెన్సీలకు తమ సరుకు విక్రయిస్తున్నారు. ఎందుకనగా, జామ్నగర్ ఎపిఎంసిలో రైతులకు తమ సరుకు కోసం ప్రతి క్వింటాలుకు రూ. 8000 లభ్యమవుతుండడమే ఇందుకు నిదర్శనం. అయినప్పటికీ ప్రస్తుతం జామ్నగర్లో ఎపిఎంసి కేవలం బిజెజి-9 మరియు 66 వంగడాల కోసం ప్రతి క్వింటాలుకు రూ. 6000-8000 ప్రతిపాదిస్తున్నారు. కావున మార్కెట్లలో విక్రయాలు జోరందుకున్నాయని వ్యాపారులు తెలిపారు.


అలివాడ గ్రామంలోని ఒక రైతు 30 బిగా (6.25 బిగా అనగా 1 హెక్టారు) మరియు ఇతర పట్టాదార్లు 50 బిగా విస్తీర్ణంలో వేరుసెనగ సేద్యం చేపట్టారు. 10 బిగాలలో ప్రయోగాత్మకంగా జిజి-9 వంగడాన్ని సేద్యం చేపట్టగా సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు దిగుబడులు క్షీణించాయి. అయితే, నాణ్యమైన సరుకు దిగుబడి అయింది. గత సీజన్లో పండించిన పంటలో కలిపి ప్రతి క్వింటాలు రూ. 6500 ధర లభించగా, ఈ ఏడాది రూ.7500 లభించే అవకాశం ఉంది.



వేరుశనగ పంటకు లభ్యమైన కేంద్ర నిధులు


అర్హులైన రైతులందరికీ పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందించగలదని దిండిగల్ జిల్లాలో గత వారం నిర్వహించిన నెలవారీ ఫిర్యాదుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. విసాకన్ ప్రకటించారు. జిల్లాలో వేరుసెనగ ఉత్పత్తి పెంచేందుకు రైతులకు రూ. 45.08 లక్షల్లు కేంద్ర నిధులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. దిండిగల్ జిల్లాలో వేరుసెనగ సేద్యం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 45.08 లక్షల నిర్ధారించిందని కలెక్టర్ తెలిపారు. నిర్ధారించిన సమయంలో వడ్డీ రహిత రుణాలు చెల్లించబడతాయని కలెక్టర్ తెలిపారు. ఎవరైనా వరితోపాటు ఇతర పంటలు సేద్యం చేయాలనుకునే రైతులు ఎంత రుణం, ఎప్పుడు లభించగలదో మరియు రుణం పొందినవారు ఎలా చెల్లించాలో ఇత్యాది వివరాలు త్వరలో తెలియజేయబడతాయని కలెక్టర్ అన్నారు. 

ఇందుకోసం రైతులు అవసరమైన ధృవ పత్రాలు, బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకంతో పాటు 197 పిఎసిబి మరియు సొసైటీ వద్ద సంప్రదించిన రైతులకు 2021-22 కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. సలహాలు, ఫిర్యాదుల కోసం సంయుక్త సంచాలకులు (వ్యవసాయ) సంప్రదించాలని, సహేతుకంగా ఉన్నట్లయితే, విచారణ చేపట్టబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. తక్కువ నీటి ఆవశ్యకత గల ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని, ఒక పంటకు బదులు రెండు పంటలు సేద్యం చేపట్టాలని, సమావేశంలో రైతులు నీటి సరఫరా కోసం అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. మీరు లాభాలు కోరుతున్నారా? నష్టాలు కోరుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog