రబీ సీజన్ నువ్వుల ఉత్పత్తి భేష్

 

06-12-2021

 రబీ సీజన్ కోసం ప్రస్తుతం నువ్వుల సేద్యం 530 ఎకరాలకు విస్తరించగా సేద్యం చేపట్టడానికి మరో రెండు నెలల సమయం ఉంది. రేగడి నేలలో సాగుచేస్తున్న పత్తి పంట కోతలు జనవరిలో ముగిసిన వెంటనే నువ్వుల సేద్యం చేపట్టడం శ్రేయస్కరమని ప్రభుత్వం మరియు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఈ నేలలో సాగు చేపట్టిన ప్రతి హెక్టారు దిగుబడి 3-7 క్వింటాళ్లు సాధించవచ్చని, ధర రూ. 8000–10,000 ఆర్జించవచ్చని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.


 ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కుండపోత వర్షాలు కురిసినందున పంటకు నష్టం వాటిల్లింది. తద్వారా కడప జిల్లాలో రబీ సీజన్ సరుకు రాబడులు క్షీణించాయి. తమిళనాడులో ఫిబ్రవరి-మార్చిలో ప్రారంభమయ్యే పంట ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకనగా, ఇటీవల కురిసిన వర్షాలకు పంట అత్యంత నాణ్యంగా వికసిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉత్పత్తి కొరవడినందున ధరలు ఇనుమడిస్తున్నాయి. గత వారం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కలిసి 2 వేల బస్తాల సరుకు రాబడి కాగా, మధ్యప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హల్లింగ్ సరుకు రూ. 10,700-10,900, 98.2 రకం రూ. 11,000, ఆగ్రాలో హల్లింగ్ సరుకు రూ.500 తగ్గి రూ. 10,400-10,500, 98.2 సరుకు రూ. 11,100, కాన్పూర్లో హల్లింగ్ సరుకు రూ. 10,800-11,000, 98.2 సరుకు రూ. 11,100 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, గంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 6-7 వేల బస్తాల రాబడిపై తెల్లనువ్వులు రూ. 10,000-11,000, గజ్జర్ నువ్వులు రూ. 9500-9800, 75 కిలోల బస్తా విరుద్నగర్ డెలివరి రూ.8600, గజ్జర్ నువ్వులు రూ. 8100 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్, జూనాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 6-7 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 10,750-11,100, మీడియం రూ. 10,500-10,700, యావరేజ్ రూ. 10,200-10,400, నల్లనువ్వులు ప్రీమియం రూ. 12,500-13,500, జడ్ బ్లాక్ రూ. 12,000-12,500, యావరేజ్ రూ. 11,000-11,750, క్రషింగ్ సాధారణ రకంరూ. 8000-9000 ధరతో వ్యాపారమైంది. కర్నాటకలోని ముదగల్, అరిసెకేరి, కల్బుర్గి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో 300 బస్తాల అమ్మకంపె నాణ్యమైన సరుకు రూ. 10,500-11,250, ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 8000-9000, మీడియం రూ. 6500-7500, కడప, రాజంపేట ప్రాంతాలలో ప్రతి రోజు 2 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై హైదరాబాద్ డెలివరి రూ. 10,500, విరుధ్ నగర్ కోసం 75 కిలోల బస్తా రూ. 7500, పశ్చిమబెంగాల్లో మైక్రో-క్లీన్ రూ. 9100 -9200, అన్-క్లీన్ రూ. 8500-8600 ధరతో వ్యాపారమె తమిళనాడు కోసం రవాణా అయింది.

Comments

Popular posts from this blog